'వాదనలు వినిపించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి వైఫల్యం'
కృష్ణా జలాలపై నియమించిన బ్రిజేష్ కుమార్ ట్ర్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలైమందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.నారాయణ అభివర్ణించారు.ప్రాంతాలవారీగా విడిపోయిన కేబినెట్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై ఇప్పటికైన జోక్యం చేసుకోని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్బంగా నారాయణ విజ్ఞప్తి చేశారు. బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేడు న్యూఢిల్లీలో తుది తీర్పును వెలువరించింది. కృష్ణా జలాలపై 1001 టీఎంసీల నుంచి 1005 టీఎంసీలకు పెంచెందుకు సుముఖుత వ్యక్తం చేసింది. అలాగే ఆల్మట్టి ఎత్తును పెంచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.