నేడు వైఎస్ విజయమ్మ ధర్నా
Published Wed, Dec 4 2013 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
అచ్చంపేట, న్యూస్‌లైన్: కృష్ణా మిగులు జలాలపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నిర్మాణంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశే ఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్‌లు వెల్లడించారు. విజయమ్మ ధర్నా చేయనున్న పులిచింతల ప్రాజెక్టు ప్రదేశాన్ని పరిశీలించడానికి మంగళవారం ఇక్కడకు వచ్చిన వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. విజయమ్మ ప్రాజెక్టుపైనే ధర్నా చేస్తారని స్పష్టం చేశారు. దీనికి ప్రాజెక్టుపైన రోడ్డు మార్గం అనుకూలంగా ఉందని చెప్పారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు వేలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రం ఎడారే.. ట్రిబ్యునల్ తీర్పు వల్ల కృష్ణా మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా పోతాయని, అప్పుడు రాష్ట్రం ఎడారి అవుతుందని తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు. సాగు, తాగు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దీన్ని ప్రతి ఒక్క రు వ్యతిరేకించాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ నిర్మాణం జరిగిందన్నారు. అప్పుడే ఆయన వ్యతిరేకించినట్లయితే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని ధ్వజమెత్తారు.
ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం.. వైఎస్ విజయ మ్మ పులిచింతల ప్రాజెక్టుపై నిర్మించిన రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం 10గంటలకు ధర్నా చేపడతారని ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరాం చెప్పారు. మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పరిశీలకులు గున్నం నాగిరెడ్డి, కృష్ణాజిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కోటగిరి గోపాల్, చౌడవరపు జగదీశ్, లీగల్ సెల్ కన్వీనర్ సామినేటి రాము, జగ్గయ్యపేట టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ వ ట్టెం మ నోహర్, మండల కన్వీనర్ సందెపోగు సత్యం, నాయకులు గంగసాని నరసింహారెడ్డి, త మ్మా ప్రవీణ్‌రెడ్డి, అనుముల సాంబిరెడ్డి, షేక్ రహమాన్ పాల్గొన్నారు.
Advertisement