dharnas
-
కదం తొక్కిన కార్మికులు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఐక్య కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జనగామలో రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యా లీగా వచ్చి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పార్టీలు, సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, అధికారులు ముందుగానే దూరప్రాంత సర్విసులు రద్దుచేశారు. మిగతా సర్విసులు మధ్యాహ్నం తర్వాత మొదలయ్యాయి. కాగా, ఖమ్మం రూరల్ మండలం కాశిరాజుగూడెం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. హాల్ టికెట్లు చూపించినా అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతం కాగా, ఇతరులు సర్దిచెప్పడంతో పంపించారు. ఇక సింగరేణివ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే సాగింది. 39,010 మంది కార్మికులకు 18,072 వేల మంది(60 శాతం) విధులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే, రోజువారీ లక్ష్యంలో 10 శాతం మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
పార్లమెంటు ప్రాంగణంలో ధర్నాలు, దీక్షలు బంద్! విపక్షాలు ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో సభ్యులు నిషేధిత పదాలు వాడరాదంటూ గురువారం జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం సమసిపోక మునుపే..శుక్రవారం జారీ చేసిన మరో బులెటిన్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘పార్లమెంటు ప్రాంగణాన్ని సభ్యులు ‘ధర్నా, సమ్మె, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోరాదు’ అంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. సమావేశాలు సవ్యంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పనికిమాలిన, పిరికిపంద ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ‘విశ్వ గురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాలపైనా నిషేధం’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. చదవండి: Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు -
ధరలపై మూడంచెల పోరు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ‘ధరాభారం లేని భారత్’పేరిట మూడంచెల పోరుకు దిగుతామని ప్రకటించింది. ‘‘తొలి దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్యులు మార్చి 31న తమ ఇళ్ల బయట ఆందోళనలు చేస్తారు. ఎల్పీజీ సిలిండర్లకు పూలదండలు వేసి చెవిటి బీజేపీ ప్రభుత్వానికి వినపడేలా డప్పులు, గంటలు మోగిస్తూ నిరసన తెలుపుతారు. తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 దాకా దేశవ్యాప్త ర్యాలీలు, ఆందోళనలుంటాయి. ఏప్రిల్ 2 నుంచి 4 దాకా స్వచ్ఛంద సంస్థలు, మత, సామాజిక సంస్థలు, సంక్షేమ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ధర్నాలుంటాయి. ఏప్రిల్ 7న అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యాలయాల్లో ‘ధరాభారం లేని భారత్’ధర్నాలు చేపడతాం’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. మోదీ సర్కారు దేశ ప్రజలను వంచించిందని ఆయన మండిపడ్డారు. ‘‘ఐదు రాష్ట్రాల్లో ఓట్ల కోసం నాలుగు నెలలకు పైగా పెట్రో, ఎల్పీజీ, సీఎన్జీ తదితరాల ధరలను పెంచలేదు. అవి పూర్తవుతూనే వాటి ధరలను రోజూ ఎడాపెడా పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తోంది. జనాన్ని పిండి ఖజానా నింపుకునే సూత్రం పాటిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు సమావేశమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించిన మీదట దీనిపై భారీ ఉద్యమానికి నిర్ణయించాం’’అని వివరించారు. నిస్సిగ్గు దోపిడీ ఆగాల్సిందే: రాహుల్ ప్రజలను నిస్సిగ్గుగా దోచుకుంటున్న కేంద్రానికి ముకుతాడు వేయాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. జనం అష్టకష్టాలు పడుతుంటే రాజు బేపర్వాగా తన ప్రాసాదాన్ని అలంకరించుకుంటున్నారంటూ ప్రధాని మోదీనుద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో తేదీలు మారుతున్నా సమస్యలు మాత్రం యథాతథమంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ఓవైపు జనాన్ని బాదుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారాలు జరుపుకుంటోంది. పెట్రోల్, డీజిల్‌కు భారత్‌లో రోజుకో కొత్త రేటు. ఐదు రోజుల్లో నాలుగు దాడులు’’అని ధరల పెంపునుద్దేశించి విమర్శలు సంధించారు. -
ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి
సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, తక్షణమే ఆ చట్టాలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు తన కాన్వాయ్‌తో రైతులను ఢీకొట్టి నలుగురి మృతికి కారణమైన ఘటనకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం రేవంత్ మాట్లాడుతూ 11 నెలలుగా రైతులు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా వారిపై దౌర్జన్యాలు, దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని చెప్పిన మోదీ, దాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్, మొదట్లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి, ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత కేంద్రానికి అనుకూలంగా మారారని విమర్శించారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో.. న్యాయం అడిగితే ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. యూపీ రైతుల హత్యలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో తేల్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాధారిత దేశంలో రైతులకు మేలు చేస్తా నని హామీ ఇచ్చిన మోదీ ఆచరణలో అమలు చేయటంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యూపీలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సమస్యను పరిష్కరించకుండా హత్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుం బానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ ఈ నెల 8న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. -
ప్రజా పోరాటాలు చేస్తున్న జగన్‌పై అక్రమ కేసులా?
నేడు మండల కేంద్రాల్లో ఆందోళనలు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జిల్లా కన్నబాబు సాక్షిప్రతినిధి, కాకినాడ : నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులను వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఓదార్చేందుకు వెళ్లిన జగన్ సంఘటన పూర్వపరాలు అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన బస్సు అధికార పార్టీ ఎంపీకి చెందినది కావడంతోనే కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బస్సును నడిపిన డ్రైవర్ ప్రమాదంలో మరణిస్తే పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఈ విషయంలో ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని, పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు కళ్లు తెరిపించేలా అక్రమ కేసులపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కేంద్రాలు, నగరపాలక సంస్థ కేంద్రాల వద్ద వెసులుబాటును బట్టి విభిన్న రీతుల్లో ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా చంద్రబాబు విధానాలను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. -
ధనలోపం.. జనక్రోధం..
కష్టార్జితం చేతికి రాక కన్నెర్ర బ్యాంకుల వద్ద నిరసన కీలలు అమలాపురం టౌ¯ŒS : బ్యాంకుల్లో ఇప్పుడు కరెన్సీ నోట్ల రెపరెపల కన్నా.. కడుపు మండిన వారి నోటి వెంట ఆక్రోశపు మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. తాము దాచుకున్న డబ్బులను అవసరాలకు తీసుకునేందుకు లేకపోవడంతో బ్యాంకులు ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో, తహసీల్దార్, పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యలతో బ్యాంకుల ముందే ధర్నాలు చేసే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. నగదు కోసం పడిగాపులు పడుతున్న వారు బ్యాంక్ అధికారులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. వేచి, వేచి, విసిగి, వేసారి.. జిల్లాలో గత 40 రోజులుగా నగదు బాధలను ప్రజలను ఎదుర్కొంటున్నప్పటికీ గత రెండు వారాలుగా బ్యాంకుల ముందు నగ దు కోసం పడిగాపులు, నో క్యాష్ బోర్డులు, పగలంతా బ్యాంకుల వద్దే సమయం కేటాయింపు వంటి సమస్యలతో విసిగి వేసారిన జనం అక్కడే నిరసన బాట పడుతున్నారు. జిల్లాలో గురువారం పలు చోట్ల బ్యాంకుల ముందు జరిగిన ధర్నాలే ఇందుకు సాక్ష్యం. పది రోజుల కిందట ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో ప్రజలు ఎస్బీఐ శాఖ అద్దాలు పగలగొట్టారు. బ్యాంక్‌ను ముట్టడించి బైఠాయించారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంక ఆంధ్రా బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. ఇలా జిల్లాలో ప్రతి రోజూ పలు బ్యాంకులు జనాగ్రహాన్ని ఎదుర్కోక తప్పటం లేదు. ఒక్క గురువారం రోజే రాజమహేంద్రవరం, కాకినాడ, కడియం మండలం జేగురుపాడు, కొత్తపేట మండలం అవిడి బ్యాంకుల వద్ద నిరసలు, ఆందోళనలు జరిగాయి. జేగురుపాడు కెనరా బ్యాంక్ ఎదుట ప్రజలు వంటా వార్పు ఏర్పాటు చేసి రోజంతా తామంతా బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నా నగదు ఉండటంలేదన్న నిరసనను వినూత్నంగా చాటారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనతో బ్యాంకు అధికారులు దిగివచ్చి సమస్యను కొంతలో కొంత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కొత్తపేట మండలం అవిడి ఎస్బీఐపై రైతులు కన్నెర్ర చేశారు. ముందు రోజు 150 మంది రైతులకు నగదు విత్‌డ్రాకు టోకెన్లు ఇచ్చారు. తీరా బ్యాంక్‌కు వస్తే నో క్యాష్ బోర్డులు చూసి రైతులు కదం తొక్కారు. ధర్నాతో బ్యాంకు దద్దరిల్లేలా చేశారు. చివరకు తహసీల్దార్ రంగ ప్రవేశంలో సమస్య కొంత సద్దుమణిగింది. ఇక కాకినాడ సాంబమూర్తినగర్లోని ఎస్బీఐ వద్ద, రాజమహేంద్రవరం ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు కూడా పరాకాష్టకు చేరుకున్న ప్రజాగ్రహానికి అద్దం పట్టాయి. జిల్లాలో బ్యాంకుల వద్ద మొదలైన ఈ జనాగ్రహం ఇలానే కొనసాగితే పరిస్థితి పెడదోవ పట్టే అవకాశం ఉంది. బ్యాంకులపై దాడి చేసే పరిస్థితి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంక్‌ల అధికారులు çస్పందిస్తేనే ఈ ధర్నాలు, నిరసనలకు తెర పడే అవకాశం ఉంటుంది. -
చెట్టుకింద... కట్టు ‘బడి’
చినరాజాం కాలనీ వాసుల వినూత్న నిరసన ‘మాగ్రామంలో పాఠశాలను మూసేయొద్దు’ అని ఎంతగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో ఆగ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. చెట్టుకిందే బడి నిర్వహిస్తూ సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో గల చినరాజాంకాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తక్కువ మంది పిల్లలు ఉన్నారనే నెపంతో ప్రభుత్వం ఇటీవల మూసివేసింది. పాఠశాలను మూసివేయడం సరికాదని గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి దూరంగా ఉన్న వజ్రపుకొత్తూరు మండలం బరంపురం కాలనీ పాఠశాలలో దీనిని విలీనం చేసింది. తమ గ్రామం నుంచి పిల్లలు రోడ్డుపై అంతదూరం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని, మా పాఠశాల మాకు కావాలి అని గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామంలో ఉన్న విద్యాధికులు ఒక చెట్టుకిందనే బడి నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈపరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. - పలాస -
భగ్గుమన్న వామపక్షాలు, కాంగ్రెస్
పలుచోట్ల సీఎం, పీఎంల దిష్టిబొమ్మల దహనం కాకినాడ : ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని, ముఖ్యమంత్రుల తీరుపై కాంగ్రెస్, వామపక్షా లు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వారి దిష్టిబొమ్మలను దహ నం చేయడంతో పాటు పలుచోట్ల ధర్నాలు చేశారు. రాజమండ్రిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పంతం నానాజీ ఆధ్వర్యంలో కల్పనా సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. గోకవరంలో డీసీసీ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు ఆ ధ్వర్యంలో ధర్నా చేశారు. అమలాపురంలో కాంగ్రెస్ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రంపచోడవరంలో కాంగ్రెస్ నేత కె.సుధాకరబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పిఠాపురంలో సీపీఐ నే త కోరాకుల సింహాచలం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పెద్దాపురంలో సీపీఐ నేతలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రామచంద్రపురంలో సీపీఐ, సీపీఎం నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉండవల్లి గోపాలరా వు, ఎన్.రాము, శారదాదేవి, పి.జానకీరాం తది తరులు పాల్గొన్నారు. అమలాపురంలో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో గడియారస్తంభం సెంట ర్లో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజోలులో సీపీఐ నేత దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసాల వద్ద ధర్నాలు నిర్వహించాలని భావించిన టీడీపీ నేతలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ రోజే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు జరపాలని గురువారం రాత్రి మహబూబ్‌నగర్ సభ అనంతరం పార్టీ నేతలు నిర్ణయించారు. విషయం ముందే తెలుసుకున్న పోలీసులు తెలుగుదేశం, టీఎన్ఎస్ఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంటికి ఉదయం వెళ్లిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్ చంద్రతో పాటు పలువురు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇంటి బారికేడ్లను దాటి లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివసించే తిరుమల హిల్స్‌కు వెళ్లేందుకు ఆ నియోజకవర్గం ఇన్చార్జి వీరేంద్రగౌడ్, ఆయన అనుచరులు బయలుదేరగా మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లేందుకు తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితర మహిళా నాయకులు ప్రయత్నించగా, వారిని కూడా ఇంటికి వెళ్లకముందే అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యేలు ఇళ్ల వద్ద లేని సమయంలో ధర్నాలు చేసే కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల పార్టీ నేతలే పెదవి విరిచారు. -
ప్రజల పక్షాన పోరాటం
రుణ మాఫీ అంటూ ఊరించి పేద రైతులు, మహిళలను ఉసూరుమనిపించిన తెలుగుదేశం పార్టీ సర్కారుపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరించింది. పేదలకు అండగా నిలబడి, వారి పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టింది. బుధవారం జిల్లావ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. పేదలను దగా చేస్తే పుట్టగతులుండవని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ ధర్నాల్లో రైతులు, మహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. పల్లెల నుంచి పట్టణాలకు కదంతొక్కారు. తహశీల్దార్ కార్యాలయాల వద్ద బైఠాయించి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘రుణాలు చెల్లించొద్దు.. నాదీ భరోసా’ అంటూ నాడు నమ్మబలికి నేడు నయవంచనకు తెగబడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ధ్వజమెత్తారు.బాబుకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం ఈ ధర్నాలు ఆరంభం మాత్రమే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల జగ్గంపేట : రుణాల మాఫీ పేరుతో అధికారాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు గుంతనక్క మాదిరిగా ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శాసనసభలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. బుధవారం జగ్గంపేట సెంటర్లో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ ధర్నాకు భారీ సంఖ్యలో మహిళలు, రైతులు తరలివచ్చారు. వీరినుద్దేశించి జ్యోతుల మాట్లాడుతూ బాబుకు బుద్ధిచెప్పేందుకు ఈ ధర్నాలు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని పేర్కొన్నారు. రైతాంగాన్ని, ఆడపడుచులను రుణమాఫీ పేరుతో చంద్రబాబు వంచించారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాల మాఫీ హామీకి తూట్లు పొడిచి సంఘానికి రూ.లక్ష ఇస్తామని నమ్మబలికిన ఆయనను మహిళలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు. రైతులకు సుమారు 89 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయాల్సి ఉండగా రూ.43 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ఆయన బడ్జెట్లో కేవలం రూ.5 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. తీరా చూస్తే కేవలం కోటి రూపాయల మూలధనంతో రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న ఆయన ఇప్పుడు ఉద్యోగాలు తీసే పనిలో పడ్డారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మహిళలు, రైతుల పక్షాన పోరాడుతుదని స్పష్టం చేశారు. జనవరి 6,7 తేదీలలో ఉభయ గోదావరి జిల్లాల సమస్యలపై తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటిం చారు. కార్యక్రమంలో ఆయన తనయుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది నయవంచక పాలన : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : అధికారంలోకి వస్తే రుణమాఫీ అమలు చేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత మాయమాటలతో ప్రజలను మోసం చేశారని, నయవంచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దుయ్యబట్టారు. ‘బాబు దగాలు.. జనం దిగాలు’ అనే నినాదంతో రాజమండ్రిలో బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమలు సాధ్యం కాని హామీలు గుప్పించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. దర్నాలో ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేస్తున్న తీరును ఇంద్రజాలం కళాకారులు ప్రదర్శించారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వేషధారణ ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ విజయరామరాజుకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నేతలు ఆర్.వి.వి. సత్యనారాయణచౌదరి, రావిపాటి రామచంద్రరావు, అడపా శ్రీహరి, పోలు కిరణ్‌రెడ్డి, నగరపాలక సంస్థలో పార్టీ చీఫ్ విప్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాను విజయవంతం చేయండి
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా కోరారు. స్థానిక గణేష్ చౌక్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, అలాగే అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ఉదయం 11 గంటలకు ధర్నా జరుగుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. ఆధిపత్యం కోసం రోడ్డెక్కుతున్నారు రాజమండ్రి విషయం చూస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు రోడ్డెక్కి కొట్టుకుంటున్నారని, ఆధిపత్య పోరు కోసం ప్రజా సమస్యలను పక్కనపెట్టేస్తున్నారని విమర్శించారు. సాఫీగా సాగాల్సిన ఇసుక ర్యాంపుల వ్యవహారంలో ప్రజాప్రతినిధుల జోక్యం ఏంటంటూ ప్రశ్నించారు. పుష్కరాల సమయం తరుముకొస్తున్నా... వాటి గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదన్నారు. వచ్చే నెల 6న కలెక్టరేట్ ఎదుట ధర్నా చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 6న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయనున్నట్టు రాజా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలను వేదికగా చేసుకుని 2015 జనవరి 6, 7 తేదీల్లో అధినేత జగన్ మోహన్‌రెడ్డి రిలే నిరాహార దీక్షలు చేస్తారని వివరించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొత్త కార్యవర్గాలు వేస్తామన్నారు. ఎవరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, రాజమండ్రి అర్బన్ జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. అనారోగ్యం కారణంగా రాజమండ్రి సిటీ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఏడాది పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంత శ్రీహరి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ నాయకుడు మాసా రామ్‌జోగ్ పాల్గొన్నారు. -
నేడు వైఎస్ విజయమ్మ ధర్నా
అచ్చంపేట, న్యూస్‌లైన్: కృష్ణా మిగులు జలాలపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నిర్మాణంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశే ఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్లు వెల్లడించారు. విజయమ్మ ధర్నా చేయనున్న పులిచింతల ప్రాజెక్టు ప్రదేశాన్ని పరిశీలించడానికి మంగళవారం ఇక్కడకు వచ్చిన వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. విజయమ్మ ప్రాజెక్టుపైనే ధర్నా చేస్తారని స్పష్టం చేశారు. దీనికి ప్రాజెక్టుపైన రోడ్డు మార్గం అనుకూలంగా ఉందని చెప్పారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు వేలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఎడారే.. ట్రిబ్యునల్ తీర్పు వల్ల కృష్ణా మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా పోతాయని, అప్పుడు రాష్ట్రం ఎడారి అవుతుందని తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు. సాగు, తాగు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దీన్ని ప్రతి ఒక్క రు వ్యతిరేకించాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ నిర్మాణం జరిగిందన్నారు. అప్పుడే ఆయన వ్యతిరేకించినట్లయితే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని ధ్వజమెత్తారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం.. వైఎస్ విజయ మ్మ పులిచింతల ప్రాజెక్టుపై నిర్మించిన రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం 10గంటలకు ధర్నా చేపడతారని ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరాం చెప్పారు. మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పరిశీలకులు గున్నం నాగిరెడ్డి, కృష్ణాజిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కోటగిరి గోపాల్, చౌడవరపు జగదీశ్, లీగల్ సెల్ కన్వీనర్ సామినేటి రాము, జగ్గయ్యపేట టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ వ ట్టెం మ నోహర్, మండల కన్వీనర్ సందెపోగు సత్యం, నాయకులు గంగసాని నరసింహారెడ్డి, త మ్మా ప్రవీణ్‌రెడ్డి, అనుముల సాంబిరెడ్డి, షేక్ రహమాన్ పాల్గొన్నారు.