
చట్టాలను ఉల్లంఘించి తీర్పు
- రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పొలాలు ఎడారే: చంద్రబాబు
- చంద్రబాబు విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించి ఈ కథనం ఇచ్చింది. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది.
- {పాజెక్టులు పూర్తి చేస్తే మిగులు జలాలపై హక్కులు కోరవచ్చని ట్రిబ్యునల్ చెబుతోంది. మీ తొమ్మిదేళ్ల హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేయలేదు. అదే చేస్తే రాష్ట్రానికి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా?
- బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కును 2000 మే నెల వరకూ నిర్దేశించింది. మీరు 1995 సెప్టెంబర్‌లో సీఎం పదవి చేపట్టి 2004 వరకూ కొనసాగారు. అయినా మిగులు జలాల లభ్యత ఆధారంగా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకపోవడం వాస్తవం కాదా?
- కర్ణాటక అసలు ఆల్మట్టి ప్రాజెక్టును చేపట్టిందే మీరు సీఎంగా ఉన్నప్పుడు. పైగా మీ పార్టీ నాయకుడికి చెందిన కాంట్రాక్ట్ సంస్థే దాని నిర్మాణం పూర్తి చేసింది. దాని ఎత్తు పెంచుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా మీ హయాంలోనే... వాటన్నింటినీ మీరు అడ్డుకుని ఉంటే ఈరోజు ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తును పెంచుకోవడాన్ని సమర్థించేది కాదుకదా?
- మిగులు జలాలపై ఆధారపడి కల్వకుర్తి, గాలేరు నగరి, నెట్టెంపాడు, ఏఎమ్మార్, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శంకుస్థాపన జరిగినా ఏ ఒక్కదాన్నీ పూర్తి చేయలేదు. మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టును కట్టడానికి వీలులేదని ట్రిబ్యునల్ అభ్యంతరపెట్టిన విషయం మీకు తెలియంది కాదు. ఆ సమయంలోనే ప్రాజెక్టులన్నింటినీ నిలిపివేయాల్సి వస్తుందన్న కారణంతో వైఎస్ మిగులు జలాలపై లేఖ రాశారన్న విషయం అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ ప్రాజెక్టులన్నీ మీ హయాంలో పూర్తయి ఉంటే ఈ సమస్యలే వచ్చేవి కాదుకదా?
- మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కూడా మీరు సీఎంగా ఉన్నప్పుడే మొదలుపెట్టిన విషయం మరిచిపోయారా? అప్పుడు సహకరించి ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండటం అవకాశవాదం కాదా?