కృష్ణా ట్రిబ్యునల్–2కు దాఖలు చేసిన తెలంగాణ
నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు
ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు
భవిష్యత్‌లో వచ్చే ప్రాజెక్టులు కలిపి మొత్తం 555 టీఎంసీలు కేటాయించాలి
ట్రిబ్యునల్‌ను కోరిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా 555 టీఎంసీలను కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్– 2కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందులో 238 టీఎంసీల నీటి అవసరాలు కలి గిన ఐదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను మంగళ వారం ట్రిబ్యునల్‌కు సమర్పించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అదనపు విధి విధానాలు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)ను గతంలో జారీ చేసింది. దీని ఆధారంగా కృష్ణా జలాల పంపిణీ విధానంపై ట్రిబ్యునల్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తమ వాదన లతో స్టేట్‌మెంట్ ఆఫ్ కేస్‌లను ఇప్పటికే దాఖలు చేశాయి.
నవంబర్ 6 నుంచి 8 వరకు ట్రిబ్యునల్‌లో తదుపరి విచారణ జర గాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 53 టీఎంసీలు, నెట్టెంపాడు ప్రాజెక్టుకు 25.4 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 40 టీఎంసీలు కలుపు కొని మొత్తం 238 టీఎంసీలను ఆయా ప్రాజెక్టులకు కేటాయించాలని కోరుతూ వాటి డీపీఆర్‌లను తాజాగా ట్రిబ్యునల్‌కు అందజేసింది.
వీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజె క్టుకు మరో20 టీఎంసీలు, కొడంగల్– నారా యణపేట ఎత్తిపోతలకు 7టీఎంసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల అవ సరాలకు 299 టీఎంసీలు అవసరమని ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఇక భవిష్య త్‌లో నిర్మించనున్న జూరాల వరద కాల్వ, కోయి ల్‌కొండ ప్రాజెక్టు, జూరాల–శ్రీశైలం మధ్య లో కొత్త బరాజ్, భీమాపై మరో బరాజ్ అవసరాలు కలుపుకొని మొత్తం 555 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది.
పాత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు
చిన్న నీటిపారుదలకు 89.15, నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 105.7, భీమా ఎత్తి పోతలకు 20, జూరాలకు 17.8, తాగునీటి సరఫరాకు 5.7, పాకాల చెరువుకు 2.6, వైరా చెరువుకు 3.7, పాలేరు ప్రాజెక్టుకు 4 , డిండి ప్రాజెక్టుకు 3.5, కోయిల్‌సాగర్‌కు 3.9, ఆర్డీఎస్‌కు 15.9, మూసీకి 9.4, లంకసాగర్‌కు 1, కోటిపల్లివాగుకు 2, ఓకచెట్టి వాగుకు 1.9 టీఎంసీలు కలిపి మొత్తం 299 టీఎంసీలను ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు తెలంగాణ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment