
'తెలుగు జాతిని అవమానపరిచే విధంగా ఉంది'
ఏలూరు: కృష్ణానది మిగులు జలాల పంపిణీపై శుక్రవారం బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఇ చ్చిన తుది తీర్పు తెలుగు జాతిని అవమానపరిచే విధంగా ఉందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో నష్టపోనున్నారని తెలిపారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పుతో ఆయా నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారనుంది.
దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడనుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం దాదాపు రూ.4,418 కోట్లు వ్యయం చేసినా, మిగులు జలాలపై ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం, మనం లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో సర్కారు సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.