ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి
హైదరాబాద్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు అశనిపాతంలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నీటి పంపకాల వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణం అఖిలపక్షాన్ని పిలిచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి సుధాకర్ విజ్ఞప్తి చేశారు.