- రెండు రాష్ట్రాలేర్పడితే కృష్ణా నీటి పంపిణీలో ఎన్నో చిక్కుముళ్లు
- 1,005 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకూ వుూడు రకాలుగా పంచాలి
నీటి ‘విభజన’ మరింత క్లిష్టం
Published Sat, Nov 30 2013 2:50 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల నడువు కృష్ణా జలాల పంపిణీ వురింత క్లిష్టతరం కానుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వుహారాష్ట్ర నడువు కృష్ణా జలాల పంపిణీ కథే ఇంకా వుుగియులేదు. ఇంకా సుప్రీంకోర్టులో ఈ వివాదానికి తుది పరిష్కారం దొరకాల్సి ఉంది. ఈలోపు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే తాత్కాలికంగా పాత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వునకు దక్కిన మొత్తం వాటాను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే 65 శాతం డిపెండబిలిటీతో కనిపిస్తున్న అదనపు నికర జలాలను, మిగులు జలాలను కూడా పంపిణీ చేయూలంటే సుప్రీం తుది తీర్పు దాకా వేచి ఉండాల్సిందే. ఒకవేళ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును అవులు చేయూల్సిన పరిస్థితి వస్తే... 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు మూడు రకాలుగా పంపిణీ చేయూలి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, కృష్ణా డెల్టాలకు ఎలాగూ నికర జలాల కేటారుుంపులున్నారుు. ఇప్పటికే ఎలాంటి స్పష్టమైన నీటి కేటారుుంపుల్లేని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎవ్మూర్పీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకం.
ఇక అదనపు నికర జలాలు (65 శాతం డిపెండబిలిటీ ద్వారా వచ్చే కోటా), మిగులు జలాల్ని ఏ ప్రాతిపదికన వీటికి కేటారుుంచాలనేది సంక్లిష్టంగా వూరనుంది. ఈ పరిస్థితిలో పోలవరానికి జాతీయు హోదా ఇచ్చినా ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు, చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రకరకాల సవుస్యలు సృష్టిస్తూనే ఉన్నారుు.గోదావరి నీటిని కృష్ణాకు వుళ్లించేందుకు ఉద్దేశించిన దువుు్మగూడెం ప్రాజెక్టుకు తెలంగాణ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనువూనమే. 2000 మే నెలతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు వుుగిసి.. 2004 ఏప్రిల్‌లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి.. ఇన్నేళ్లు గడిస్తేగానీ ఇప్పటికీ నీటి పంపిణీ ప్రక్రియు వుుగియులేదు. కావేరీ, నర్మద వంటి జల వివాదాలు దాదాపు 3 దశాబ్దాలుగా సాగుతున్నా ఇంకా పరిష్కారం దొరకలేదు సరికదా సాక్షా త్తూ ప్రధాని జోక్యం చేసుకున్నా దిగువ రాష్ట్రాలకు సకాలంలో కాసింత నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సీవూంధ్ర సకాలంలో నీటి విడుదలకోసం వుహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలంగాణపై కొత్తగా ఆధారపడాల్సిన స్థితి వస్తుంది.
Advertisement
Advertisement