నీటి పంపకాలపై సీఎం ఆరా!
Published Wed, Aug 7 2013 2:38 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నీటి పంపకాలకు సంబంధించిన సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. మంగళవారం రోజంతా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇతర సీనియర్ ఇంజనీర్లతో క్యాంప్ కార్యాలయంలో చర్చలు కొనసాగించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. కృష్ణా నది నీటి పంపకాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ నదిపై కల్వకుర్తి, నెట్టెంపాడు, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. దాంతో సరైన వర్షాలు కురవని సమయాల్లో ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు కష్టంగా మారనుంది. అప్పుడు ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనే విషయంపై సీఎం అధికారులతో చర్చించినట్టు సమాచారం.
Advertisement