Water distribution
-
ఏపీ అనధికార నీటి తరలింపును అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అనధికారికంగా నీళ్లను తరలించుకోవడాన్ని అడ్డుకోవడంతో పాటు ఏపీ, తెలంగాణ మధ్య న్యాయమైన రీతిలో నీటి పంపిణీ జరిగేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. మేడిగడ్డ బరాజ్‌పై నెలాఖరులోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అందజేస్తామని తెలిపారు. అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం అక్కడ సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో సమావేశమై చర్చలు జరిపారు. కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి: ఉత్తమ్మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో ఏడాది కాలంగా విచారణ సాగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. బరాజ్ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలతో తుది నివేదికను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో ఏపీ శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా అదనపు నీళ్లను అక్రమంగా తరలిస్తోందని చెప్పారు. సాగర్ కింద తెలంగాణలో సాగు చేస్తున్న ఆయకట్టు పంటలు, ప్రత్యేకించి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తున్న ఆయకట్టు పంటలను కాపాడేందుకు కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకతతో పాటు భవిష్యత్తు వివాదాల నివారణ కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలతో పాటు కృష్ణా నదిపై 35 చోట్ల టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితో నీటి వినియోగం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని, వాటాలకు కట్టుబడి నీళ్లు తీసుకునేందుకు దోహదపడుతుందని సూచించారు. మంత్రి అభిప్రాయంతో కేంద్ర మంత్రి ఏకీభవించారు. ఏపీతో ఉన్న నీటి వివాదాల్లో జోక్యం చేసుకుని తెలంగాణ ఆందోళనలకు పరిష్కారం చూపాలంటూ మంత్రి చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సత్వర అనుమతులిస్తామని భరోసా ఇచ్చారు. జీరో వడ్డీ, 50 ఏళ్ల గడువుతో రుణాలు.. కేంద్రంసీతారామ, సీతమ్మసాగర్, పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు సత్వర అనుమతులతో పాటు నిధులను కేటాయించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జీరో వడ్డీతో పాటు తిరిగి చెల్లింపులకు 50 ఏళ్ల గడువుతో రుణాలు అందించేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. నెల రోజుల్లోగా సీతారామ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన, పునరుద్ధరణతో పాటు గోదావరి–మూసీ అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర సహాయం అందించాలని కోరగా, ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలు చేస్తున్న డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు మరమ్మతుల నిర్వహణతో పాటు జలాశయాల్లో పూడిక తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో కేంద్రం రాష్ట్రానికి సూచించింది. కాగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2లో జరుగుతున్న విచారణ సత్వరంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. -
TS: స్వరాష్ట్రంలోనే అన్యాయం!
కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్.. దానిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కింది. కృష్ణా నీటిని ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్రానికి తరలించుకుపోతుంటే కేసీఆర్ సహకరించారని అంటూ అధికారపక్షం విమర్శలు గుప్పించగా.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ దీటుగా ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ సర్కారు తీరును వివరించేందుకు తాము నల్లగొండలో బహిరంగ సభ చేపడితే.. దృష్టి మళ్లించేందుకు సభలో తీర్మానం పెట్టారని మండిపడింది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పాపాల భైరవుడు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌ను కొడతారంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. జలాల్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చినా, ఆ రాష్ట్రం భారీగా తరలించుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కారు కుమ్మక్కైందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినది గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకొని మంత్రిని మాట్లాడనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘2020లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 92,500 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోవడానికి ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 203 తెచ్చినా కేసీఆర్ సర్కార్ అడ్డుకోలేదు. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. కృష్ణా నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినా పట్టించుకోలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 1983లో 11,150 క్యూసెక్కుల నీరు తరలిస్తే.. 2005లో వైఎస్సార్ ప్రభుత్వం దానిని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచింది. జగన్ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏకంగా 92,500 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు ద్వారా 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలను తీసుకెళ్తే.. 2014 నుంచి 2024 వరకు ఏకంగా 1,201 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. ఏనాడూ అభ్యంతరం తెలపలేదు 2014లో కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాల్లో నీటి వాటాను తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా నిర్ణయిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి 299 టీఎంసీలకు ఒప్పుకొని.. కృష్ణా జలాల్లో తెలంగాణకు శాశ్వత నష్టం చేకూర్చారు. 2015 నుంచి 2023 వరకు ఏటా ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్, హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలేమీ తెలపలేదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల కోసం 299 టీఎంసీలకు ఒప్పుకొన్నవాళ్లు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన 225 టీఎంసీల గురించి గానీ, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన 206 టీఎంసీల గురించి గానీ ఏనాడూ అడగలేదు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డిలకు అవసరమైన నీటి గురించి కేంద్రాన్ని నిలదీయలేదు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ సైతం.. 2016 సెపె్టంబర్ 16న ఢిల్లీలో జరిగిన తొలి అపెక్స్ కమిటీ సమావేశానికి అధికారులతో పాటు అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు హాజరయ్యారు. అప్పుడు కూడా కృష్ణాలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొని వచ్చారు. నీటి వాటాలపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత ఒప్పందమే కొనసాగించాలంటూ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా కేసీఆర్ అంగీకరించడం రాష్ట్రానికి తీరని ద్రోహమే. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అన్యాయం స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇంతా చేసి తెలంగాణ ప్రజానీకంలో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వాస్తవాలతో ప్రజెంటేషన్ ఇస్తున్నాం. కృష్ణానీటి వాటాలో అన్యాయంపై మేం పోరాడుతాం. ఏపీ ప్రయోజనం కలిగేలా చేశారు ఏపీ సీఎం జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ గంటల కొద్దీ ఏకాంత చర్చలు చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా కేసీఆర్ అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరుకాకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారు. కేసీఆర్ తెలంగాణ నీళ్లను ఏపీకి ఇస్తున్నారంటూ జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో పొగడటం నిజం కాదా? అసెంబ్లీ ఎన్నికల చివరిరోజున నాగార్జునసాగర్‌ను ఏపీ ప్రభుత్వం అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక రాజకీయం లేదా? కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని తరలించుకోవడం వాస్తవం కాదా? ఈ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కృష్ణాబోర్డుకు నాగార్జునసాగర్‌ను అప్పగించేందుకు సిద్ధమన్న రీతిలో అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి లేఖ రాయడం మరింత నష్టం కలిగించింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇందుకు సంబంధించిన సమావేశం మినిట్స్ మార్చాలని కోరాం. అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ సభకు వస్తే.. తేలుస్తాం: రేవంత్‌రెడ్డి పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని.. కృష్ణా నదిజలాలపై ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ఆయన సభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ చర్చలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు, వారి మాటలకూ ఏమాత్రం విలువ లేదు. గత పదేళ్ల పాపాలకు కేసీఆరే బాధ్యుడు. ఆ పాపాల భైరవుడు సభలోకి వచ్చి చర్చ చేస్తే మేం సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ అధినేత ఇక్కడికొచ్చి మాట్లాడాలి. ఆయనకు ఎంతసేపైనా మైక్ ఇచ్చేందుకు సిద్ధం. తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో తేలుస్తాం..’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత ఎన్నికల్లో కేసీఆర్‌కు నల్గొండ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చెప్పుతో కొట్టినట్టుగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కనీసం మంచినీళ్లు కూడా అందని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. ఇంత అన్యాయం చేసిన కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకురాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులున్నారు.. సాగనంపుతాం: భట్టి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. కృష్ణా జలాలపై అప్పటి ఈఎన్సీ మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈఎన్సీ బీఆర్ఎస్ వ్యక్తిగా పనిచేశారని, అందుకే సాగనంపామని పేర్కొన్నారు. ఇలాంటి కోవర్టులు ఇంకా ఉన్నారని, వారిని కూడా పంపేస్తామని చెప్పారు. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీకి..ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి జలాల వాటాను తేల్చి, నీటిని పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై న్యాయసలహా, తెలంగాణ సర్కార్ అభిప్రాయం తీసుకుని కొత్త గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌పై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. కానీ.. ప్రస్తుత జల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉత్పన్నమైంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ♦ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించారు. ♦ గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతను తేల్చాలి. ♦ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాలి. దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆయకట్టు హక్కులను పరిరక్షించేలా ఎగువ ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని రూపొందించాలి. ♦ కాళేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలి. ♦ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణను ఆదేశిస్తూ.. దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. ♦ ఉమ్మడి రాష్ట్ర పరిధిలో జీడబ్ల్యూడీటీ (గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరిలో నీటి లభ్యతను నిర్ధారించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాలు తేల్చడానికి ఐఎస్ఆర్డబ్ల్యూడీ (అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు) చట్టం–1956 సెక్షన్–4(1) ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ♦ జీడబ్ల్యూడీటీ అవార్డుతో పాటు విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తుండటాన్ని అనేక సార్లు కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ♦ ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మదింపు చేసి.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదించేవరకూ వాటిని నిలుపుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ♦ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ♦ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైన నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం.. 2020, అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన మేరకు ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గోదావరి జలాలను పంపిణీ చేయాలి. ♦ జీడబ్ల్యూటీడీ అవార్డు ద్వారాగానీ విభజన చట్టం ద్వారాగానీ రెండు రాష్ట్రాలకు ఇప్పటిదాకా గోదావరి జలాలను ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. కానీ.. తెలంగాణ సర్కార్ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా అక్రమంగా కాళేశ్వరం(450 టీఎంసీలు), దేవాదుల మూడో దశ (22 టీఎంసీలు), తుపాకులగూడెం బ్యారేజ్ (100 టీఎంసీలు), సీతారామ ఎత్తిపోతల (100 టీఎంసీలు), వాటర్ గ్రిడ్ (32.58 టీఎంసీలు), లోయర్ పెన్‌గంగపై బ్యారేజ్‌లు (6.55 టీఎంసీలు), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు తరలింపు (3 టీఎంసీలు) ప్రాజెక్టులను చేపట్టింది. నికర జలాల్లో మిగులు లేకుండానే.. ♦జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో పాటు 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తేల్చింది. ♦ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టులకు 659.691 టీఎంసీల కేటాయింపు ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116.20 టీఎంసీలు అవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ డిమాండ్ 775.891 టీఎంసీలు. బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే వరద జలాలపై పూర్తి హక్కు ఉంటుంది. ♦తెలంగాణలో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 471.686 టీఎంసీలను వినియోగించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు అవసరం. అంటే.. తెలంగాణ డిమాండ్ 649.802 టీఎంసీలు. గోదావరిలో 1,430 టీఎంసీల నికర జలాలు ఉంటాయని వ్యాప్కోస్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే.. 1425.693 టీఎంసీలు అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదు. ♦గోదావరి నికర జలాల్లో మిగులు లేకున్నా సరే.. 714.13 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా అక్రమంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలుగుతుంది. ♦ గోదావరి జలాల వినియోగం, పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోయినా తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును 2015లో చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని అనేకసార్లు కోరినా పెడచెవిన పెట్టి.. 2018, జూన్ 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ♦అంతర్రాష్ట్ర జల వివాదం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్టు అథారిటీ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతి చెల్లదు. -
అప్పటివరకు పాత వాటాలే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణాబోర్డు తేల్చిచెప్పాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ కేటాయించిన కృష్ణా జలాల్లో 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. చిన్న నీటివనరుల విభాగంలో వినియోగించిన జలాలు, ప్రకాశం డెల్టాకు మళ్లించే గోదావరి జలాలను పంపిణీ నుంచి మినహాయించినట్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఈ నెల 2న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణాబోర్డు సంయుక్తంగా దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశాయి. కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ పాత పద్ధతిలోనే వినియోగించుకోవడానికి మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ.. ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. అర్ధ భాగం డిమాండ్ అసంబద్ధమే.. కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్.. 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందనే అంశాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణాబోర్డు గుర్తుచేశాయి. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చిందని, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించిందని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకున్న నీటిని పరిగణనలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను తాత్కాలిక ప్రాతిపదికన పంపిణీ చేసుకోవడానికి అంగీకరిస్తూ 2015 జూన్ 18–19న కేంద్ర జల్ శక్తిశాఖ సమక్షంలో రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయనే అంశాన్ని ఎత్తిచూపాయి. ఆ తర్వాత 2016–17లోనూ అదే పద్ధతిలో నీటిని పంపిణీ చేసుకున్నాయి. ఆ తర్వాత చిన్న వనరుల విభాగం, మళ్లించిన గోదావరి జలాలను మినహాయించి.. మిగతా నీటిలో ఏపీ 66 శాతం, తెలంగాణ 33 శాతం చొప్పున పంచుకుంటున్నాయనే అంశాన్ని పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని.. ఆ ట్రిబ్యునల్ అవార్డు వస్తేనే నీటి లెక్కలు తేలతాయని అఫిడవిట్లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు స్పష్టం చేశాయి. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీకి నీటిని పునఃపంపిణీ చేసే సమయంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదని గుర్తుచేస్తున్నారు. -
సీతారామా.. నీళ్లెక్కడ?
సాక్షి, అమరావతి: సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు నీళ్లెక్కడివని తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ప్రశ్నించింది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని, నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందమే కుదరలేదని స్పష్టంచేసింది. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టును ఎలా చేపట్టారని తెలంగాణను నిలదీసింది. దమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్ల దిగువన 36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీ, దానికి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ కేంద్రం నిర్మించి రోజుకు 9 వేల క్యూసెక్కుల చొప్పున 70 టీఎంసీలను తరలించి 6.74 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ఎత్తిపోతలను తెలంగాణ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను గోదావరి బోర్డుకు అందజేసింది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకూడదని, తద్వారా దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శక్తి శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక లేఖలు రాసింది. ఇదే అంశంపై జనవరి 3న జరిగిన సర్వ సభ్య సమావేశంలోనూ సీడబ్ల్యూసీని కోరింది. తాజాగా సీతారామా ఎత్తిపోతలపై గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలవరం ఆయకట్టుకు రక్షణ కల్పిస్తేనే పోలవరం ప్రాజెక్టు వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 561 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 141వ సమావేశంలో తేల్చింది. ఎగువన ఏ ప్రాజెక్టు చేపట్టినా పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన 561 టీఎంసీలకు రక్షణ కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ.. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో సీతమ్మ సాగర్ వద్ద 347.06 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలంగాణ పేర్కొంది. దీనిని అధ్యయనం చేసి నీటి లభ్యతను ఖరారు చేయాలని సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు ప్రతిపాదించింది. సీతారామ ఎత్తిపోతల చేపడితే పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యతపై స్పష్టత ఇవ్వాలని కోరింది. కృష్ణా బేసిన్‌కు ఎలా తరలిస్తారు? సీతారామ ఎత్తిపోతల ద్వారా 10.109 టీఎంసీల గోదవరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరిస్తామని డీపీఆర్‌లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఏ ప్రాతిపదికన గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు కోరింది. వీటిపై స్పష్టత ఇస్తేనే సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ డీపీఆర్ మదింపు, అనుమతి ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల డిమాండ్ 1,743 టీఎంసీలు ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ ప్రతిపాదించాయని గోదావరి బోర్డు పేర్కొంది. అంటే.. రెండు రాష్ట్రాల అవసరాలు 1,743 టీఎంసీలని లెక్కగట్టింది. కానీ, గోదావరిలో ఆ మేరకు నీటి లభ్యత లేదని రెండు రాష్ట్రాలూ అంగీకరిస్తున్నాయని తెలిపింది. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం గోదావరిలో నీటి లభ్యత 1,486.155 టీఎంసీలని తెలంగాణ అంటుండగా, 2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం గోదావరిలో కేవలం 1,360 టీఎంసీలని, పునరుత్పత్తితో కలిసి 1,430 టీఎంసీలని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. పునరుత్పత్తి జలాలను పరిగణలోకి తీసుకోకూడదని గోదావరి ట్రిబ్యునల్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వ్యాప్కోస్ నివేదిక ప్రకారం నీటి లభ్యత 1,360 టీఎంసీలే. ఇదిలా ఉండగా.. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000 – 2020 మధ్య కాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంది. ఈ నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని గోదావరి బోర్డు కోరింది. -
తెలుగుగంగ.. రికార్డు మురవంగ
సాక్షి, అమరావతి: తెలుగుగంగ ప్రాజెక్టు కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఐదు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు రాష్ట్ర ప్రభుత్వం నీటిని అందించింది. ప్రాజెక్టు చరిత్రలో ఈ స్థాయిలో నీళ్లందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ లైనింగ్ పనులను రూ.460 కోట్లతో చేపట్టి దాదాపు పూర్తి చేయడంతోపాటు రూ.90 కోట్లతో డయాఫ్రమ్‌వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసింది. ఫలితంగా బ్రహ్మంసాగర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు రికార్డు స్థాయిలో నీళ్లందించగలిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నాడు వైఎస్సార్ కృషితో.. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్ కడప (1.67 లక్షల ఎకరాలు), నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు)ల్లో మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగు గంగ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 2004 నుంచి 2009 మధ్య దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో అప్పట్లోనే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించగలిగారు. నిర్వహణపై టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ 7.80 కిలోమీటర్ల పొడవున 15 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తెలుగుగంగ లింక్ కెనాల్‌ను తవ్వారు. అయితే ఈ కాలువకు లైనింగ్ చేయకపోవడంవల్ల 2019 వరకు కేవలం 6 – 7 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించారు. దీనివల్ల వెలిగోడు రిజర్వాయర్ సకాలంలో నిండని దుస్థితి నెలకొంది. ఇక వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు 42.566 కి.మీల పొడవున ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తెలుగుగంగ ప్రధాన కాలువను తవ్వారు. దీనికి కూడా లైనింగ్ చేయకపోవడంతో 2,500 – 3,000 క్యూసెక్కులు కూడా తరలించలేని పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీ (ఊట) ఏర్పడటంతో 17.745 టీఎంసీలకుగానూ కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వచేసేవారు. మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీలను (పిల్ల కాలువలు) పూర్తి చేయడం, ప్రధాన కాలువ నిర్వహణను టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో ఐదేళ్లలో ఎన్నడూ రెండు మూడు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాల్లేవు. సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువలకు లైనింగ్ చేయడం, డయాఫ్రమ్ వాల్‌తో బ్రహ్మంసాగర్ లీకేజీలకు అడ్డకట్ట వేయడం వల్లే ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందించగలిగాం. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులను పూర్తి చేయించారు. దీనివల్లే సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు నింపగలిగాం. తద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించగలిగాం. – హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ యుద్ధప్రాతిపదికన లైనింగ్.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తెలుగుగంగ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకు తెలుగుగంగ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీంతో 2020, 2021, 2022లో వెలిగోడును సకాలంలో నింపగలిగారు. ఆయకట్టుకు నీళ్లందిస్తూ పంటలు పూర్తయ్యాక వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ పనులను చేపట్టి ఇప్పటికే 90% పూర్తి చేశారు. ఫలితంగా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులకు పెరిగింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టలో ఊటనీరు వచ్చే ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి లీకేజీలకు గతేడాది అడ్డుకట్ట వేశారు. దీంతో 2021, 2022లో బ్రహ్మంసాగర్‌లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. కాలువల ప్రవాహ సామర్థ్యం పెంచి సోమశిల, కండలేరు జలాశయాలలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వచేయడానికి మార్గం సుగమం చేశారు. ఈ ఏడాది వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో ఖరీఫ్.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో లేట్ ఖరీఫ్ కింద ఆయకట్టులో ఐదు లక్షల ఎకరాలకుపైగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. మిగతా డిస్ట్రిబ్యూటరీ పనులను వేగంగా పూర్తిచేసి మిగిలిన 75 వేల ఎకరాలకు కూడా నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
స్వచ్ఛ జల్ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం తీసుకుంటున్న చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘స్వచ్ఛ జల్ సే సురక్ష’ పేరుతో గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి మార్కులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి వనరులు(రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలు) వద్ద నీటి నాణ్యత పరీక్షల నిర్వహణను కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. అలాగే నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ తదితర రసాయనాలతో పాటు ఈ–కోలి తదితర బ్యాక్టీరియా కారకాలను గుర్తించినప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుంది. వర్షాకాలం ముందు, తర్వాత నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల సంఖ్యను.. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి సౌకర్యాలను, నాణ్యత పరీక్షల నిర్వహణకున్న వసతులు, అందులో స్థానిక మహిళలకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను కూడా కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా 900 మార్కులకు గాను రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. ఈసారి 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 568 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. 96% నీటి వనరుల వద్ద నాణ్యత పరీక్షలు.. ఏపీలో 87 శాతానికి పైగా గ్రామాల్లో స్థానికంగానే తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో తేలింది. 18,393 గ్రామాలుండగా, 96 శాతానికి పైగా అంటే 17,772 గ్రామాల్లోని వనరుల వద్ద రెండు విడతల పాటు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.64 లక్షల తాగునీటి వనరుల వద్ద పరీక్షలు నిర్వహించగా, 21,193 చోట్ల వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారని తెలిపింది. అందులో 20,739 చోట్ల ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రక్షిత మంచినీటి వనరులు కల్పించినట్టు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. -
ఏడేళ్లుగా కేంద్రం పట్టించుకోలేదు: హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: కృష్ణా జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని, గొంతెమ్మ కోరికలేవీ కోరట్లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే అంటే.. 2014 జూలై 14నే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై సెక్షన్ 3 కింద అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభ్యంతరం తెలపడాన్ని, తెలంగాణ చేసిన జాప్యం వల్లే ఈ అంశం పెండింగ్‌లో ఉందని పేర్కొనడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఇది 4 నెలల నుంచి కాదు.. ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్య అని గుర్తుచేశారు. షెకావత్ వ్యాఖ్యలు సరికాదని, సీఎం వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా తీసుకున్నట్లుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలని చట్టంలో ఉందని, సమస్య పరిష్కారం కాకపోతే ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కేంద్రం 13 నెలలపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోనందున 2015 ఆగస్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ విషయంలో ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదన్నారు. కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని హరీశ్ విమర్శించారు. ఏడాదిగా స్పందించలేదేం? ‘సీఎం కేసీఆర్‌తోపాటు నీళ్ల మంత్రిగా నేను, అధికారులు ఢిల్లీకి ఏడాది తిరిగినా మీరు (షెకావత్) స్పందించలేదు. సరైన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకొని ఉంటే సుప్రీంను ఆశ్రయించాల్సిన అవసరం రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా మొదటి ప్రాధాన్యం నీళ్లకు ఇచ్చాం. ఇది సీఎం కేసీఆర్‌కు నీళ్ల మీద, రాష్ట్రం మీద ఉన్న తపన. వారి కృషికి, పట్టుదలకు ఒక నిదర్శనం. దీన్ని షెకావత్ అర్థం చేసుకోవాలి. మీ (షెకావత్) మీద ఉన్న గౌరవంతో అందరినీ సంప్రదించి సుప్రీంకోర్టులో కేసును విత్‌డ్రా చేసుకున్నాం’అని హరీశ్ గుర్తుచేశారు. కేంద్రం ఏడేళ్లుగా ఈ వ్యవహారాన్ని నాన్చడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఈ అంశాన్ని ప్రస్తుతమున్న బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అనుసంధానించడమో లేదా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడమో చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా కావాలన్నదే మా ఆవేదన. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే మా తపన, వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, శివ కుమార్, యాదవరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. చదవండి: (కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్) -
ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నాం: మంత్రి అనిల్
సాక్షి, కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నామని జల వనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో అదే తాము ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీటిమట్టం రాక ముందే తెలంగాణ రాష్ట్ర అక్రమ కట్టడాల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు సామార్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. ‘చంద్రబాబు మతిభ్రమించినట్లే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలకు మతి భ్రమించి ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాస్తున్నారు. నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుపై తెలుగుదేశం నాయకులు మద్దతివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జూమ్ మీటింగ్‌లకు పరిమితమైన తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాయలసీమ వివక్షకులు టిడిపి నేతలే’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
శ్రీరాముడికి జలాభిషేకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద పూర్తి ఆయకట్టు సాగులోకి తెచ్చేలా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. ఎస్సారెస్పీ కింద నిర్ణయించిన పూర్తి ఆయకట్టుకు నీరివ్వడంతో పాటే ప్రతి చెరువును నింపి నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు జూలై నుంచి నీరు విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల మేరకు కాళేశ్వరం ద్వారా నీటిని ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం ఆయకట్టుకు నీరు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గతేడాది వానాకాల సీజన్లో పుష్కలంగా వర్షాలు కురవడంతో నీటి వినియోగం పెద్దగా అవసరం లేక పోయింది. అదే యాసంగి సీజన్లో మాత్రం స్టేజ్–1 కింద 9.50 లక్షల ఎకరాలు, స్టేజ్–2 కింద 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. దీనికోసం మొత్తంగా 90 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇందులో 25 నుంచి 30 టీఎంసీల నీరు కాళేశ్వరం ద్వారా తరలించిన నీటి వాటా ఉంది. అయితే ఈ ఏడాది స్టేజ్–1, 2ల కింద ఉన్న మొత్తం ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు జూలై ఒకటి నుంచే నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులోకి ఆగస్టు నుంచి అధిక ప్రవాహాలుంటాయి. గత పదేళ్ల ప్రవాహాల లెక్కలు తీసుకుంటే జూన్, జూలైలో వచ్చిన ప్రవాహాలు సగటున 10 నుంచి 15 టీఎంసీల మేర ఉండగా, ఆగస్టులో 50 నుంచి 60 టీఎంసీలుంది. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎస్సారెస్పీలో 30 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఇందులో 10 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి మిగతా 20 టీఎంసీల నీటిని జూలై నుంచే సాగుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్ఫా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్‌మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్‌మఠ్, గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. వస్తే వరద.. లేదంటే ఎత్తిపోత ఆగస్టులో ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేసుకుంటూ, ప్రవాహాలు ఉంటే ఆ నీటితో, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీలో భాగంగా ఉండే లోయర్ మానేరు కింద 5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే నీటిని తరలించనున్నారు. ఇక్కడి నుంచే స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లా వరకున్న 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఇక ఎల్ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడితే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి తరలించి, ఆయకట్టుకు నీరివ్వనున్నారు. ఇప్పటికే పునరుజ్జీవ పథకం పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా కనీసంగా 200 టీఎంసీల ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్సారెస్పీ నీటితో పాటే కాళేశ్వరం నీటిని కలిపి మొత్తంగా 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వరద కాల్వ కింద 49, ఎస్సారెస్పీ కింద 900 చెరువులు, కాళేశ్వరం కింద మరో 1,200 చెరువులున్నాయి. ఆరునూరైనా ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ప్రతి చెరువునూ నింపడం లక్ష్యంగా సాగు నీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఇదే అంశమై సోమవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
ఆ ఐదింటికి నికర జలాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమివ్వాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణాజలాల్లో మిగులు నీటిని బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకే కేటాయించాలని కోరింది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల తాగు, సాగు అవసరాలను తీర్చేవిధంగా చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు 200 టీఎంసీల మేర నికర జలాలు కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌లో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో తెలంగాణ అవసరాలు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న సాగు డిమాండ్, ఏపీకి అక్రమంగా జరిగిన కేటాయింపుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రాజెక్టులు, తాగు, పారిశ్రామిక అవసరాలకు మొత్తం కలిపి 936.58 టీఎంసీల నీరు అవసరమని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ‘గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు పూర్తిస్థాయిలో ఖర్చుకావు, తిరిగి 80 శాతం వివిధ రూపాల్లో బేసిన్‌లోని జల వనరులకు చేరుతాయి. కావున నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా పేర్కొనాల’ని కోరింది. ఇతర బేసిన్లకు నీటి తరలింపు.. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహక ప్రాంతం తక్కువే అయినప్పటికీ, భారీ ఎత్తున కృష్ణాజలాలను ఏపీ వినియోగించుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. 397 టీఎంసీల కృష్ణాజలాలను పెన్నా, ఇతర బేసిన్లకు ఏపీ తరలిస్తున్నదని, శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఇతర బేసిన్లకు ఈ నీటిని తరలిస్తున్నదని తెలిపింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణలోని 36.45 లక్షల హెక్టార్ల భూమి సాగు యోగ్యంగా ఉందని తెలిపింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ కేటాయింపుల్లో సర్దుబాటు చేసిన 299 టీఎంసీల ద్వారా 5.75 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగులోకొచ్చిందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా మరో 10.38 లక్షల హెక్టార్లు సాగులోకి రానుండగా, మరో 20.32 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి వసతి కల్పించాల్సి ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా ఏపీ బేసిన్ ఆవలకు తరలిస్తున్న నీటి నుంచి 75 శాతం డిపెండబిలిటీపై ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎస్ఎల్బీసీ)కు 33 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 34 టీఎంసీలు, నెట్టెంపాడుకు 19.38 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 84.85 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 29 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని కోరింది. వలసలకు నిలయమైన పాత మహబూబ్‌నగర్, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజల వెతలు ఈ ప్రాజెక్టుల ద్వారా తీరుతాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌పై ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగనున్నాయి. -
సేవా మోహనుడు
మానవసేవే మాధవసేవ అని అందరూ సూక్తులు చెబుతుంటారు తప్ప ఆచరణలో ఎవరూ పాటించరు. కోట్లకు పడగలెత్తిన వారు సైతం గుళ్లో ఉన్న మాధవుడికి మొక్కుతారు తప్ప...గుడి బయట ఉన్న మానవుడిని పట్టించుకోరు. సేవ చేయాలనే మనసు ఉండాలే కానీ...లక్షలు, కోట్లు ఉండనవసరం లేదని, ఉన్నంతలోనే సేవ చేయవచ్చని గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ అనే యువకుడు నిరూపిస్తున్నాడు. లక్ష్మీపురం(గుంటూరు): ఆ యువకుడు వ్యాపార వేత్తో, ఉన్నతోద్యోగో కాదు... గ్యాస్ కంపెనీలో పని చేసే సాధారణ కూలీ. డబ్బుకు పేద అయినా...సేవలో రాజు..అతని పేరు జొన్నలగడ్డ రాజమోహన్. చిన్నతనంలో తల్లిదండ్రులు ఏ పూటకు ఆ పూట పనిచేసి కుటుంబాన్ని పోషించే వారు. ఒక్కో సందర్భంలో కుటుంబమంతా పస్తులున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. అందుకే ఉన్నంతలో...తను చేయగలినంతలో అన్నార్తులకు, దాహార్తులకు సేవ చేస్తున్నాడు. నగరంలోని హనుమయ్య నగర్‌కు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ హెచ్.పి గ్యాస్ కంపెనీలో నెలకు కేవలం 7వేల రూపాయల వేతనంపై పనిచేసే కూలీ. నెల జీతం అంతా కుటుంబ పోషణకు వినియోగిస్తాడు. భార్య సుజాత టైలరింగ్ చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. రాజమోహన్ ఖాళీ సమయంలో గ్యాస్ స్టౌవ్ రిపేర్లు చేస్తుంటాడు. ఈ అదనపు పనితో వచ్చి డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు. సహృదయ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వారానికి సుమారు 40 మందికి అన్నదానం చేస్తుంటాడు. తల్లి దండ్రులు లేని అనాథ విద్యార్థులను చదవించడం, వారికి పుస్తకాలు, బ్యాగ్‌లు, దుస్తులు ఇవ్వడంతో పాటు వారికి కావల్సిన అవసరాలు తీరుస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. తన ద్విచక్రవాహనానికి మినరల్ వాటర్ క్యాన్‌ను కట్టుకొని సంచార చలివేంద్రం నడుపుతూ ఉచితంగా మంచినీరు అందిస్తాడు. ప్రతి సోమవారం జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీరు అందిస్తాడు. రోజూ ఎవరికో ఒకరికి సేవ చేస్తేనే తనకు తృప్తిగా ఉంటుందంటాడు రాజమోహన్. -
నేడు కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ
నీటి పంపకాలు, పోతిరెడ్డిపాడు టెలిమెట్రీపై చర్చ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలు, ఎంపిక చేసిన ప్రాజెక్టు పాయింట్ల వద్ద ఏర్పాటు చేయనున్న టెలి మెట్రీ వ్యవస్థలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం భేటీ కానుంది. జలసౌధలో మధ్యాహ్నం 12కు జరిగే భేటీకి తెలంగాణ, ఏపీల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ హాజరు కానున్నారు. ప్రధానంగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంపిణీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. తెలం గాణ ఇప్పటికే నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1.5 టీఎంసీలు కోరగా, కృష్ణా డెల్టా కింద తాగునీటికి ఏపీ 3 టీఎంసీలు కోరుతోంది. ఎవరికి ఎలాంటి కేటాయింపులు జరపాలన్నా సాగర్‌లో ప్రస్తు తం ఉన్న నీటిమట్టం 501అడుగులు, శ్రీశైలం లో 775 అడుగుల దిగువకు వెళ్లాల్సి ఉంటుం ది. అయితే నీటి మట్టాల విషయంలో ఇరు రాష్ట్రాలు మొండిగా వ్యవహరిస్తుండటంతో బోర్డు నిర్ణయం కీలకం కానుంది. మొదటి విడతలో ఏర్పాటు చేయనున్న 18 టెలిమెట్రీ పరికరాల అమలుపై, ఏపీ పరిధిలోని పోతి రెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ దిగువన టెలిమె ట్రీ ఏర్పాటుపై చర్చ జరగవచ్చు. -
స్కాడా వెబ్సైట్ ఆవిష్కరణ
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ద్వారా అందించే రక్షిత తాగునీటి సరఫరాను ఆ¯ŒSలై¯ŒS ద్వారా ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేసిన స్కాడా వెబ్సైట్(స్మార్ట్వాటర్ డిస్టిబ్య్రూష¯ŒS మోనిటరింగ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. స్కాడా వెబ్సైట్ పనితీరును మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియ¯ŒS సీఎంకు వివరించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ, వినియోగం, హెడ్‌వాటర్ వర్కŠస్ నుంచి రిజర్వాయర్‌కు ఎంతనీరు ఎన్ని గంటల్లో చేరుతోందనే వివరాలను వెబ్సైట్ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తద్వారా నీటి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు లీకేజీలను అరికట్టవచ్చన్నారు. నగర పరిధిలో 63 రిజర్వాయర్లు ఉండగా, 52 రిజర్వాయర్లను స్కాడాకు అనుసంధానం చేశామని, త్వరలోనే మిగితావి అనుసంధానం చేస్తామని కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్షి్మ, పబ్లిక్‌హెల్త్ సీఈ మోజేస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేతులు కాలాక..
- హెచ్చెల్సీ కోటా అయిపోయాక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హడావుడి - డెడ్ స్టోరేజీ సమయంలో అదనపు నీటి కోసం కసరత్తు - టీబీబోర్డుకు లేఖ రాసిన చీఫ్ విప్ కాలవ - ముందే మేల్కొని ఉంటే ప్రయోజనం ఉండేదంటున్న నిపుణులు అనంతపురం సెంట్రల్ : కరువు పారదోలతానంటూ ఆగస్టు చివర్లో జిల్లాకు వచ్చి హడావుడి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే సమయంలో కేసీ కెనాల్ డైవర్షన్ కోటా నీటిని కర్నూలుకు మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై నోరెత్తని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి వచ్చిన సమయంలో అదనపు కోటా కోసం లేఖలు రాయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. 22.6 టీఎంసీలు వస్తాయని మొదట్లో అంచనా వేశారు. చివరకు 10 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. దీంతో ఽనీటి పంపిణీ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఆయకట్టు కింద పంటలను నిషేధించారు. ముందస్తుగా సాగు చేసుకున్న అరకొర పంటలను కాపాడటమే అధికారులకు గగనంగా మారింది. ఈ సమయంలో కేసీ కెనాల్ డైవర్షన్ కోటా నీరు కొంత వరకు ఆదుకుంటుందిలే అని అధికారులు భావించారు. అయితే.. సీఎం నిబంధనలకు విరుద్ధంగా ఈ నీటిని కర్నూలు జిల్లాకు మళ్లిస్తూ జీవో విడుదల చేశారు. ఈ విషయంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేసినా.. అధికారపార్టీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదు. డెడ్‌స్టోరేజీకి నీటిమట్టం తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 24 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరో నాలుగు టీఎంసీలు తగ్గిపోతే హెచ్చెల్సీకి నీళ్లు ఎక్కవు. ఇవి తగ్గిపోవడానికి కూడా రెండు,మూడు రోజులకు మించి పట్టదు. ఆ తర్వాత ఎల్ఎల్సీ, బళ్ళారి జిల్లా రైతులు మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చెల్సీకి అదనంగా నీళ్లు విడుదల చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లేఖలు రాయడం మొదలుపెట్టారు. నీళ్లు ఉన్నప్పుడే ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతి అమలు చేసి ఎక్కువ నీళ్లు రాకుండా చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన కేసీ కెనాల్ డైవర్షన్ కోటాను మళ్లించారు. ఇప్పుడు అంతా అయిపోయాక నీళ్ల రాజకీయం మొదలు పెట్టారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ముగిసిన హెచ్చెల్సీ కోటా : శేషగిరిరావు, ఎస్ఈ, హెచ్చెల్సీ హెచ్చెల్సీకి దామాషా ప్రకారం నికర జలాల కోటా బుధవారంతో పూర్తయ్యింది. ఇప్పటి వరకూ 10.1 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి. అదనంగా నీటిని విడుదల చేయాలని బోర్డు అధికారులకు లేఖ రాశాం. కేసీ కెనాల్ వాటా దామాషా ప్రకారం 3 టీఎంసీలు ఇవ్వాలి. అయితే..ఇప్పటికే కర్నూలుకు దాదాపు 2.6 టీఎంసీలు విడుదల చేశారు. మిగిలిన నీటిని జిల్లాకు ఇవ్వాలని పట్టుబడుతున్నాం. ఈ నీళ్లొస్తే ఈ నెల 17వరకూ హెచ్చెల్సీకి విడుదలవుతాయి. లేదంటే బుధవారంతోనే నీటివిడుదల ముగిసిపోయినట్లే. -
‘కృష్ణా’పై ఏం తేలుస్తుందో?
జలాల వివాదంపై 19న బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన విచారణను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? లేదా నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలా? అన్న అంశం ఈ నెల 19న తేలనుంది. దీనిపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ ఆఫీస్ హెడ్ హెచ్.ఎం.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అడ్వకేట్లకు సమాచారం అందించారు. ఇప్పటికే ఈ అంశంమై ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా బేసిన్లో లభ్యతగా ఉన్న మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు మళ్లీ కేటాయించాలని వాదించింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా చూడరాదని, నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నందున కేటాయింపుల్లోనూ అవన్నీ భాగస్వాములు అవుతాయని స్పష్టంచేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలని ట్రిబ్యునల్‌కు ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న ఉదయం 11 గంటలకు ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. -
'కృష్ణా బోర్డు అధికారికి హరీష్ ఫిర్యాదు'
హైదరాబాద్ : శ్రీశైలం నుంచి సాగర్‌కు నీళ్లు రాకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతో భేటీయ్యారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా నీటిని వాడుకుంటుందని హరీష్ ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన చటర్జీని కోరారు. -
జాతీయ స్థాయిలో పరిష్కరించాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నదీజలాల పంపిణీ, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ నదీ జలాల విషయంలో ఘర్షణ వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. భారీ వర్షాలతో పుష్కలంగా నీరు వస్తున్నందున సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. -
హే కృష్ణా.. ఇది తగునా?
-
హే కృష్ణా.. ఇది తగునా?
► తెలంగాణ నీటి అవసరాలు పట్టించుకోని కృష్ణా బోర్డు ► నీటిని విడుదల చేయాలని కోరినా పట్టనట్లే.. ► ఏపీ అవసరాలకు మాత్రం నీరివ్వాలని సూచనలు ► సాగర్ నుంచి 4 టీఎంసీలు విడుదల చేయాలని స్పష్టీకరణ ► మండిపడుతున్న తెలంగాణ సర్కారు ► శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్‌కు విడుదల సాధ్యమని బోర్డుకు లేఖ ► 503 అడుగుల వద్ద నీటిని తోడడం కష్టమని వివరణ హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, వివాదాల పరిష్కారంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణకు మింగుడుపడటం లేదు. రాష్ట్ర నీటి అవసరాలపై నోరు మెదపని బోర్డు.. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు మాత్రం నీటిని విడుదల చేయాలని సూచించడం పుండుపై కారం చల్లినట్లుగా ఉందని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్లకు నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ఏపీ అడిగిందే తడవుగా నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలనడం తమపట్ల వివక్ష చూపడమేనని భావిస్తోంది. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడికాల్వకు నీటి విడుదల సాధ్యమవుతుందని తెలంగాణ తాజాగా బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బోర్డు సరైన న్యాయం చేస్తుందా? లేక ఏపీ వైపే మొగ్గు చూపుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అవసరాలు పట్టని బోర్డు ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగంపై ఈ నెల 20న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. నాగార్జునసాగర్ కుడి కాలువకు 8, తాగునీటి అవసరాలకు 4, కృష్ణా పుష్కరాలకు 4 టీఎంసీలు కలిపి మొత్తంగా 16 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం బోర్డును కోరింది. ఇదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 3, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు 4 టీఎంసీలతో పాటు నల్లగొండ తాగునీటి అవసరాలను తెలంగాణ వివరించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నీటి విడుదల చేయడం సాధ్యం కాదని సమావేశంలో స్పష్టం చేసిన బోర్డు... మూడ్రోజులకే మాట మార్చింది. ఏపీ అవసరాల నిమిత్తం 4 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణకు సూచించింది. కనీస నీటి మట్టాలకు దిగువన సాగర్ నిల్వలు పడిపోయిన అంశాన్ని కూడా విస్మరించి బోర్డు చేసిన ఈ సూచనపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌లో 503.50 అడుగులకు పడిపోయింది. ఇంతకుమించి నీటిని తోడడం సాధ్యం కాదని తెలంగాణ చెబుతోంది. అయితే 500 అడుగులకు వరకు తోడవచ్చని, అప్పటికీ సుమారు 6.07 టీఎంసీల లభ్యత ఉంటుందన్న ఏపీ వాదనకు బోర్డు వత్తాసు పలుకుతోందని తెలంగాణ భావిస్తోంది. శ్రీశైలంలోకి నీరు వస్తున్నా.. అక్కడినుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఏపీకి సూచించకుండా సాగర్ నీటిని ఏపీకి ఇవ్వాలనడం సరికాదని అంటోంది. శ్రీశైలం నుంచి వదిలితేనే.. నాగార్జున సాగర్ కుడి కాలువకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న బోర్డు సూచనపై మంగళవారం తెలంగాణ ఘాటుగానే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తామేమీ చేయలేమని బోర్డుకు స్పష్టం చేసింది. సాగర్‌లో నీటిమట్టాలు పడిపోయిన దృష్ట్యా నీటి విడుదల అసాధ్యమని, శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే తప్ప ఏపీకి నీరు విడుదల చేయలేమని తేల్చిచెప్పింది. సాగర్ కుడి కాలువ అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం నుంచి నీటి విడుదలకు ఏపీని ఒప్పించాలని బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. ఎగువ నుంచి శ్రీశైలంలోకి ఆశించిన స్థాయిలో నీరు వ స్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తే సాగర్ నుంచి కుడి కాలువకు నీటిని ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని వివరించింది. బోర్డు ఏం చెబుతుందో..? తెలంగాణ వినతిపై బోర్డు ఎలా స్పందిస్తున్న దానిపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 885 అడుగులు. గరిష్టంగా 215.8 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులు. గతేడాది 790 అడుగుల వరకూ నీటిని వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నా.. 786 అడుగుల వరకూ నీటిని వినియోగించుకున్నాయి. దీంతో ఏపీ సర్కారుకు రాయలసీమ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శ్రీశైలంలో 874 అడుగుల నీటిమట్టం ఉంటేనే.. దిగువకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ రైతులు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 802.7 అడుగుల వద్ద 30.35 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడానికి ఏపీ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బోర్డు చెప్పే నిర్ణయం కీలకం కానుంది. -
5 కోట్ల మంది జీవితాలతో ఇద్దరు సీఎంల చెలగాటం
జలదీక్షలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన ♦ తెలంగాణ ప్రాజెక్టులతో సీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణాడెల్టాకు నష్టం ♦ ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ నష్టమే... కృష్ణా,గోదావరి నీటిలో ప్రతి బొట్టూ అందరిదీ ♦15 రోజులకొకమారు వాటా సర్దుబాటు జరగాలి.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజుల జల దీక్షను సోమవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నించకుండా సీఎం చంద్రబాబు మౌనంగా ఎందుకున్నారని జగన్ నిలదీశారు. వారి స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేసీఆర్, చంద్రబాబులను విమర్శించారు. ఈ ప్రాజెక్టులతో నీటి యుద్ధాలు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల వ్యవహారం గురించి కేంద్రంతో పాటు అందరికీ తెలియజేసేందుకు చేస్తున్న ఈ నిరాహార దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. శ్రీశైలానికి నీరొచ్చే దారేది?: శ్రీశైలానికి నీరు రాకమునుపు మహబూబ్‌నగర్‌లో 120 టీఎంసీల నీటిని అటు నుంచి అటే పైకి తీసుకుపోతే శ్రీశైలానికి నీళ్లు ఎలా వస్తాయి అని కేసీఆర్‌ను, చంద్రబాబును అడుగుతున్నా. పాలమూరు-రంగారెడ్డి, డిండిల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు పైకి తీసుకుపోవాలని ప్రణాళిక వేసుకున్నారు. 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీరు అందించే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టులకు నీరందాలంటే శ్రీశైలం వద్ద 854 అడుగులపైన నీరు ఉండాలి. హంద్రీ నీవాకు అందాలంటే 833 అడుగులుండాలి... అటువంటిది 800 అడుగుల్లోనే ఇన్‌టేక్ పాయింటు పెట్టుకుని నీరు తోడేసుకుపోతే తాగడానికైనా నీరు దొరుకుతాయా? సీమలోని 4 జిల్లాలతో పా టు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు... చివరకు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ అన్యాయం చేసే కార్యక్రమం కేసీఆర్ చేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమే..: శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్లోనే కనీస నీటి మట్టం 854 అడుగులుగా నిర్ధారించారు. మన ఖర్మ ఏమిటంటే చంద్రబాబు ఈ కనీస నీటి మట్టాన్ని తగ్గిస్తూ జీవో 69ను తెచ్చారు. ఇది మనకు శాపంగా పరిణమించింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు రైతుల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా, డ్యామ్‌ను కట్టిన ఉద్దేశ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బాబు కనీస నీటి మట్టాన్ని తగ్గించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆ అన్యాయాన్ని సరిచేస్తూ... కనీస నీటి మట్టం 854 అడుగులకు తగ్గరాదంటూ జీవో 107 తెచ్చారు. తద్వారా రాయలసీమతో పాటు ఆరు జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని సరిచేశారు. 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీరు రాదు. కానీ 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నా.. రోజుకు ఏకంగా 30వేల క్యూసెక్కుల నీటిని తోడుకుపోయేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఏమి చేస్తున్నారు? అనుమతులు లేకపోయినా కేసీఆర్ ప్రాజెక్టులు ఎలా కడతారు? అటు గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల, దేవాదుల ఎత్తిపోతల, తుపాకులగూడెం, సీతారామ, భక్తరామదాసు... మొత్తం 5 ప్రాజెక్టుల ద్వారా 70 వేల క్యూసెక్కుల నీరును రోజూ తోడుకునేందుకు కేసీఆర్ ప్రణాళిక వేసుకున్నారు. దీనిని నిలదీయాల్సిన చంద్రబాబు కిమ్మనకుండా ఉన్నారు. ప్రతి బొట్టులో ఎవరి వాటా వారికుండాలి.. కృష్ణా, గోదావరి నదుల నీటి కేటాయింపులపై 2011లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు 26 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేశాం. ప్రతీ బొట్టులో ఎవరివాటా వారికి ఇవ్వండని కోరా. 15 రోజులకు ఒక్కసారి అందరికీ సర్దుబాటు చేయాలని కోరా. ఇవాళ మనం చేయాల్సింది కూడా అదే. ప్రతి నీటి బొట్టులో ఎవరి వాటా వారికి ఇవ్వాలి. 15 రోజులకొకమారు వాటా సర్దుబాటు చేస్తే ఎవరూ బాధపడకుండా ఉంటారు. అందరూ కలిసి పోరాడాలి... ఇద్దరు సీఎంలకూ జ్ఞానోదయం కావాలి. ఇప్పటికైనా కేంద్రం, చంద్రబాబు, కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయాలి. పాలకులు మార్గనిర్దేశకులుగా ఉండాలి. ఇదే ఏపీ పైన ఉండి తెలంగాణ కింద ఉండి...మేం నీరు వదలం అంటే మీకు నీరు వచ్చేదా? అది మీకు నచ్చేదా? ఎవరికీ నచ్చేది కాదు. కారణం.. నీరు లేకపోతే బతకలేని పరిస్థితి. వీరిలో మార్పు రావాలంటే అందరూ కలిసి కట్టుగా పోరాడాల్సి ఉంది. మన ప్రాంతాలు ఎడారులుగా మారకుండా ఉండాలంటే ఆ పోరాటంలో అందరూ భాగస్వాములం కావాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
కేసీఆర్ హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదు
► నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమో ► అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడుతున్నారు ► కింది రాష్ట్రాలు ఎడారి అయిపోయినా మీకు పట్టదా ► వీటి గురించి పట్టించుకునే నాథుడు లేడా ► ప్రశ్నించాలన్న జ్ఞానం చంద్రబాబుకు లేదా ► జలదీక్ష ప్రారంభ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు తమ అవసరాలు తీరిన తర్వాతే కిందకు నీళ్లు పంపుతామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనని భయపడుతున్నానన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు ఏమాత్రం మాట్లాడకపోవడానికి నిరసనగా కర్నూలులో మూడు రోజుల జలదీక్షను సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 12 గంటలైందన్న సంగతి నాకుతెలుసు, ఎండలు తీక్షణంగా ఉన్నాయనీ తెలుసు అయినా మండుటెండను సైతం లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను చూపిస్తున్నారు కష్టమనిపించినా, ఇక్కడికొచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా మనం ఈవాళ దీక్షా కార్యక్రమాన్ని చేస్తూ ఇన్ని వేల మంది ఇక్కడ ఏకమయ్యాం రాష్ట్రవ్యాప్తంగా కొన్నికోట్ల గుండెలు మనకు ఆశీస్సులు ఇస్తున్నాయి ఏం జరుగుతోంది, ఎందుకు మనం దీక్షలు చేస్తున్నాం, రాష్ట్రంలో పరిస్థితులేంటని గమనిస్తే.. ఒక్కటి అర్థమవుతుంది దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అవుతోంది.. అటు తెలంగాణ ప్రభుత్వం మన కళ్లెదుటే, మనకు నీళ్లు రావని తెలిసి కూడా అన్యాయం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా, వాళ్ల ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతూ పోతున్నారు. ఇటు కృష్ణా, అటు గోదావరిపై ప్రాజెక్టులు కడుతూ పోతున్నారు, కిందకు నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా వీళ్లకు తట్టడం లేదు. ఒకటే అడుగుతున్నా.. కేసీఆర్ గారిని అడుగుతున్నా.. ఇలా అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతూ పోతే కిందకు నీళ్లు ఎలా వస్తాయని నిలదీసి అడగలేకపోతున్నారేమని చంద్రబాబును అడుగుతున్నా మేం ఎలా బతకాలన్న ఆలోచన మీకు ఉందా అని అడుగుతున్నా కృష్ణా, గోదావరి.. ఈ రెండు నదులపై ఏం జరుగుతోందో గమనిద్దాం కృష్ణానదిలో దాదాపు 1750 టీఎంసీల నీళ్లు లైవ్ స్టోరేజి నిల్వ చేసే సామర్థ్యంతో ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అనధికారికంగా మరో 2-300 టీఎంసీలు స్టోర్ చేస్తున్నారు ఇందులో దాదాపు 1300 టీఎంసీలకు సరిపడ కర్ణాటక, మహారాష్ట్ర డ్యాములు కట్టాయి కృష్ణానదిలో మహారాష్ట్ర వాళ్ల అవసరాలు తీరాక, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా వదలట్లేదు మధ్యలో ఇప్పుడు శ్రీశైలానికి నీళ్లు రాకముందే మహబూబ్‌నగర్‌లోనే తెలంగాణ ప్రభుత్వం 120 టీఎంసీల నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకెళ్లిపోతే శ్రీశైలానికి నీళ్లెలా వస్తాయని కేసీఆర్, చంద్రబాబులను అడుగుతున్నా రోజుకు 2 టీఎంసీల నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకెళ్లేలా పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులు కడుతున్నారు కల్వకుర్తి ప్రాజెక్టు ఇంతకుముందు 25 టీఎంసీలుంటే 40 టీఎంసీలకు పెంచారు. దానికోసం మరో .66 టీఎంసీల నీళ్లు పైకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు.. అయ్యా, మీరు 2.66 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నారు. అంటే, దాదాపు 30వేల క్యూసెక్కుల నీరు ప్రతిరోజూ తీసుకెళ్లిపోతున్నారు.. ఇది ధర్మమేనా? శ్రీశైలంలో 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీళ్లు అందించే పరిస్థితి లేదు అలాంటిది 800 అడుగుల్లోనే ఇన్‌టేక్ పాయింట్ పెట్టి, తెలంగాణలో ఆ పాయింట్ పెట్టుకుని, శ్రీశైలానికి నీళ్లు రాకుండా ఎడాపెడా నీళ్లు తోడేసుకుంటే మాకు తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అని కేసీఆర్, చంద్రబాబులను అడుగుతున్నా శ్రీశైలంలో అవసరాలు తీరిన తర్వాత సాగర్‌కు, ఆ తర్వాతే కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేస్తున్నా, అడిగే నాథుడు లేడు, చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు శ్రీశైలం ప్రాజెక్టులో ఎప్పుడూ కనీసం 854 అడుగుల నీళ్లుండాలని 1960లోనే ప్రాజెక్టు డిజైన్‌లో ఉంచారు. దానికి అనుకూలంగానే అంజయ్యగారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు శంకుస్థాపన చేసి, కట్టారు తర్వాత మన ఖర్మ కొద్దీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆయన మొదటిసారిగా ఈ డ్రా డౌన్ లెవెల్‌ను ఒక జీవో ద్వారా తగ్గించారు ఆ తర్వాత రాజశేఖరరెడ్డి వచ్చి, ఆ అన్యాయాన్ని సరిదిద్దుతూ జీవో నెం. 107 ఇచ్చారు. మళ్లీ 854 అడుగుల మట్టం తగ్గకూడదన్నారు తాగడానికి మరీ ఇబ్బంది వస్తే మాత్రం కాస్తో కూస్తో తగ్గినా పర్వాలేదని చెప్పారు రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగులు ఉండక తప్పదు అంత ఉన్నా కూడా పూర్తిగా నీళ్లివ్వలేమని అందరికీ తెలుసు అయినా చంద్రబాబు సీఎంగా ఉండి, మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ టెండర్లు పిలిచి, 800 అడుగులకే ఇన్‌టేక్ పాయింట్ పెడుతున్నారు ఇక శ్రీశైలంలోకి నీళ్లు ఎలా వస్తాయి, తర్వాత సాగర్ పరిస్థితేంటి, కృష్ణా డెల్టా ఎడారి అయిపోదా అని చంద్రబాబు అడగలేకపోతున్నారు వాళ్లిద్దరినీ ఒక్కటే అడుగుతున్నా.. మీరు మీ స్వార్థం కోసం 5 కోట్ల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు కడుతున్న ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా ఎలా కట్టగలరని ప్రశ్నిస్తున్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా ఒకసారి చూడాలి వీళ్లిద్దరూ చెబుతున్న ప్రాజెక్టులేవీ షెడ్యూలు 9లో కనిపించవు హంద్రీ నీవా, తెలుగు గంగ, గాలేరు- నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు మాత్రం కనిపిస్తాయి వీటికి మాత్రమే నీళ్ల కేటాయింపులు జరుగుతాయని చెప్పారు మరి పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఎక్కడ పెట్టారని అడుగుతున్నా ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 84 ప్రకారం నిబంధనలున్నాయి ముందుగా సీడబ్ల్యుసీ అనుమతి, నీటి యాజమాన్య బోర్డుల అనుమతి తీసుకోవాలని, తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు మరి నీటి యాజమాన్య బోర్డులు మీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాయా.. లేదు. అయినా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతున్నారు ఎప్పుడో 2013లో ఫీజిబులిటీ నివేదిక తయారు చేయమన్న చిన్న మాటను పట్టుకుని, అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కట్టడంపై చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? కృష్ణానది విషయంలో ఇంతటి భయానక పరిస్థితులున్నాయి 2015లో మనకు చుక్కనీరు కూడా అందలేదు. 2014లో ఇదే చంద్రబాబుతో కలిసి ఆ ఒక్క సంవత్సరానికి సంబంధించి నీళ్ల పంపకంపై ఒక సమావేశం పెట్టుకున్నారు 299 టీఎంసీల నీళ్లు వాళ్లు వాడుకోడానికి చంద్రబాబు అప్పుడు ఆమోదం తెలిపారు అది చంద్రబాబు చేసిన తప్పే.. కానీ అది కేవలం ఒక్క ఏడాదికేనన్న విషయం మర్చిపోకూడదని కేసీఆర్‌కు చెబుతున్నా ఇక గోదావరి పరిస్థితి కూడా అంతే. మనకున్నది రెండే రెండు నదులు. ఈ రెండూ తెలంగాణలోంచి ప్రయాణించి, ఆంధ్ర రాష్ట్రానికి రావాలి ఇదే గోదావరి మీద కూడా కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారు కాళేశ్వరం ఎత్తిపోతల, దేవాదుల ఎత్తిపోతుల, తుపాకుల గూడెం ఎత్తిపోతల, సీతారాంపూర్ ఎత్తిపోతల, భక్తరామదాసు ఎత్తిపోతలతో నీళ్లు ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నిలదీయడం లేదు గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు కాస్తో కూస్తో వరదలుంటాయి. ఆ తర్వాత నుంచి ఆ నదిలో ఉన్నవి కేవలం 1539 క్యూసెక్కుల నీళ్లే. కేసీఆర్ గారు నీళ్లు ఎత్తుకపోతే కిందకు వచ్చేది ఏమీ ఉండదు 36వేల క్యూసెక్కులు అక్కడ అవసరం అవుతాయి గోదావరి మీద, కృష్ణామీద ఆయన ప్రాజెక్టులు కడుతుంటే, కనీసం అడిగే నాథుడు కూడా లేకపోతే బాధ వేస్తుంది రాష్ట్రం కలిసున్నప్పుడు తెలుగువాళ్లు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలని కర్ణాటక, మహారాష్ట్రపై ఒక్కటిగా పోరాడేవాళ్లం రాష్ట్రం విడిపోయాక తెలుగువారు అని కూడా చూడకుండా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు హైదరాబాద్ నగరాన్ని అప్పుడు వాళ్లు పట్టుబట్టి తీసుకెళ్లిపోయారు ఎక్కడున్నా ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు. కానీ ఆ మంచి ఎలా చేస్తున్నారో చూడాలి కింది రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేకపోతే అక్కడి ప్రజల ఉసురు తగలదా అని కేసీఆర్‌ను అడుగుతున్నా మీరు చేస్తున్నది తప్పు.. దాన్ని సరిచేసుకోవాలి. అందరం కలిసి నీళ్ల కోసం పోరాడుదాం మీరు మమ్మల్ని రోడ్డుమీద పారేయడం అన్యాయమని చెబుతున్నా 2011లోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద 26 మంది ఎమ్మెల్యేలతో ధర్నా చేశాం మహారాష్ట్ర నుంచి ఆంద్ర రాష్ట్రం చివరి వరకు ప్రతి బొట్టు కూడా మా వాటా మాకు, వాళ్ల వాటా వాళ్లకు ఇవ్వండని చెప్పాను అందరం ఒక్కటై ఈ వ్యవస్థలో మార్పును తీసుకురావాలి.. ప్రతి నీటి బొట్టు కూడా ఎవరి వాటా వాళ్లకు రావాలి 15 రోజులకు ఒకసారి వాటాల సర్దుబాటు జరగాలి. అలా చేయకుండా మా దగ్గర నుంచి నీళ్లొస్తాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లు అడ్డుపడితే ఎలా ఇది ఇండియా - పాకిస్థాన్ మధ్య గొడవలా అయిపోదా అని అడుగుతున్నా గోదావరి నది నుంచి కూడా నీళ్లను కేసీఆర్ తీసుకుపోతున్నారు ఎవడబ్బ సొమ్మని నీళ్లు తీసుకుపోతున్నారు.. 954 టీఎంసీలు తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? మిగిలినవి మాత్రమే పంపుతామని కేసీఆర్ మాట్లాడుతున్న తీరు ధర్మమేనా అని అడుగుతున్నా తెలంగాణలో మీ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతనేది రెండు నదుల విషయంలో తేలలేదు కేవలం మీ అవసరాలు తీరిన తర్వాతే మాకు నీళ్లు పంపుతామంటూ హిట్లర్ మాదిరిగా మాట్లాడటం భావ్యం కాదు ఇక్కడ జరుగుతున్న అన్యాయం మన రాష్ట్రంలోని వాళ్లకే కాదు, దేశంలోని నాయకులందరికీ తెలియాలి కేసీఆర్‌కు, చంద్రబాబుకు కూడా జ్ఞానోదయం కావాలని నాలుగు అడుగులు ముందుకు వేద్దాం పాలకులు మార్గనిర్దేశకులుగా ఉండాలి, ప్రజల బాగోగులు చూడటం మన ధర్మమని చెబుతున్నా అదే ఆంధ్ర ప్రదేశ్ పైన ఉండి, తెలంగాణ కింద ఉండి, మేం మీలా చేస్తే మీకు నచ్చేదా అని ప్రశ్నిస్తున్నా కేసీఆర్ పాలన చూస్తుంటే.. బ్రహ్మం గారు చెప్పినట్లు నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయా అని భయం వేస్తోంది (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏడాది తర్వాత మళ్లీ కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాద పరిష్కారానికి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భేటీ కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాదనలూ విననుంది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ట్రిబ్యునల్ అధికారులు సమాచారం పంపారు. గత ఏడాది మార్చి 30న ట్రిబ్యునల్ చివరిసారి సమావేశమైంది. తదనంతరం ట్రిబ్యునల్ సమావేశం జరిగే గదిలో షార్ట్‌సర్క్యూట్ కావడం, కీలక ఫైళ్లన్నీ దగ్ధం కావడంతో అప్పటి నుంచి సమావేశాలు ఎక్కడ జరపాలన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. దీనికి తోడు జూన్ 30న బోర్డులోని సభ్యుడు జస్టిస్ డీకే సేథ్ ట్రిబ్యునల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సభ్యుడిని నియమించారు. విచారణలో భాగస్వామిగా ఉన్న కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని సభ్యునిగా నియమించడంపై తెలంగాణ, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు చూపింది. పునఃకేటాయింపులకు రాష్ట్రం పట్టు.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. నదీ జలాల వివాదానికి సంబంధించి మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరుతోంది. కృష్ణా జలాల వివాదాన్ని ఏపీ, తెలంగాణ మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నది నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని మరోమారు ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. -
తెలంగాణ గోస వినాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంలో రాష్ట్రానికి ఊరట. జలాల పంపిణీలో తెలంగాణ వాదనలను వినాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గురువారం సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, లేదంటే నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ వినడం గానీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆ అర్జీలో కోరింది. కేంద్రం ఏడాదిలోగా కృష్ణా నదీ జలాల భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఏడాది గడువు ముగిసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కాల వ్యవధి ముగిసిన నేపథ్యంలో ఈ అర్జీని పరిష్కరించడంలో భాగంగా కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ వాదనలు కూడా వినాలని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2కు కేంద్రం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అర్జీలో ఏముంది? కృష్ణా జలాల పంపిణీలో ఎన్నడూ తమ వాదనలు వినిపించలేకపోయామని, అందువల్ల ఈ నదీ పరివాహకంలోని నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ మొదటి నుంచీ వినేలా వీలు కల్పించాలని తెలంగాణ కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా గానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా గానీ తెలంగాణకు న్యాయం జరగలేదని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలు వినిపించుకోలేకపోయామని తెలిపింది. ‘అసలు నీళ్లలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ ప్రాంతం ఏపీ నుంచి విడిపోవాలని కోరుకుంది. ఇప్పుడు విడిపోయిన తరువాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా? అన్యాయాన్ని సరిదిద్దేందుకు వీలుగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, నాలుగు రాష్ట్రాల వాదనలు తిరిగి వినిపించేందుకు గానీ వీలు కల్పించాలి’ అని కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి అవార్డు ప్రకటించాక వివిధ రాష్ట్రాల అభ్యర్థనలతో సుప్రీంకోర్టు సూచనల మేరకు 2013లో తుది అవార్డు ప్రకటించింది. కానీ దానిని కేంద్రం నోటిఫై చేయలేదు. సుప్రీంకోర్టు దానిపై స్టే విధించడం వల్ల కేంద్రం నోటిఫై చేయలేకపోయింది. తెలంగాణ తమ వాదనలు వినాలని పట్టుబట్టుతుండగా.. మహారాష్ట్ర, కర్ణాటకలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికీ అవార్డును కేంద్రం నోటిఫై చేయలేదని, ఇలా అయితే ఇక ట్రిబ్యునళ్లు ఎందుకని మండిపడుతున్నాయి. ఉమ్మడి ఏపీకి ఏ కేటాయింపులైతే చేశారో.. వాటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని వాదిస్తున్నాయి. తదుపరి ఏంటి? ఒకవేళ కేంద్ర నిర్ణయంతో తెలంగాణకు మేలు జరిగే పరిస్థితి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటకలు దీనిని న్యాయస్థానంలో వ్యతిరేకించే అవకాశముంది. తాజాగా కేంద్రం చేస్తున్న ఈ సిఫారసును ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటుందా? ఆ మేరకు మళ్లీ మొదటి నుంచి తెలంగాణ వాదనలు విని అవార్డు తయారు చేస్తుందా? లేక సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నదున కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణకు అనుగుణంగా నిర్ణయం వెలువడితే ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
తీవ్ర నిరాశ !
నీటి పంపకాలపై లభించని స్పష్టత ముగ్గురు సీఎంలు చర్చించుకుని తన వద్దకు రావాలని {పధాని సూచన బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రాంతానికి సాగు నీటిని అందించే మహదాయి నదీ నీటి పంపకం విషయంలో పొరుగు రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రాలతో ఏర్పడుతున్న సమస్యలను పరి ష్కరించే విషయమై ప్రధాని నరేంద్రమో దీ నుంచి రాష్ట్ర అఖిల పక్షానికి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో రా ష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో పాటు వివిధ మఠాధిపతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మహదాయి నీటి పంపకం విషయంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల మధ్య ఏర్పడిన వివాదాన్ని తొలగించాల్సిందిగా కో రుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృ త్వంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, వివిధ మఠాధిపతులు ప్రధాని నరేం ద్రమోదీతో సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 45 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం జేడీఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేందరమోదీ సమాధానం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భేటీలో జరిగిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మహదాయి నదీ నీటి పంపకాలు సరిగా జరగక పోవడం వల్ల ఏడాదికి 100 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మీరు కలుగజేసుకుంటే వృథా నీటిని అడ్డుకట్టు వేయడానికి వీలవుతుంది. దీని వల్ల వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రావడమే కాకుండా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడవచ్చు.’ అని అఖిల పక్షం నాయకులు ప్రధానికి విజ్ఞప్తి చేశాం. ఇందుకు ప్రతిస్పందించిన ప్రధానమంత్రి మొదట మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడండి. అటుపై నా దగ్గరకు రండి. ఈ విషయంలో నేను ఏం చేయగలను.’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సమాధానం తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని బసవరాజ్‌హొరట్టి తెలిపారు. ప్రజలు రైతులు సాగు, తాగు నీటి కోసం అలమటిస్తుంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమావేశంలో పాల్గొన్న వివిధ మఠాలకు చెందిన అధిపతులు కూడా మీడియా ముందు నరేంద్రమోదీ వ్యవహరించిన తీరు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
తుంగభద్ర కాల్వ డిజైన్ మారదు
బోర్డు నిర్ణయం మేరకే నీటి పంపిణీ, ఆధునికీకరణ ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన సాక్షి, బెంగళూరు: తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (టీబీఆర్‌బీసీ) ప్రస్తుత డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కాల్వ ఆధునికీకరణ జరిగినా భవిష్యత్‌లో తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి గొడవలు తలెత్తవని వారు అభిప్రాయపడ్డారు. తుంగభద్ర నదీ జలాల పంపిణీ విషయమై బెంగళూరులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధుల మధ్య సోమవారం దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం తొలుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... తుంగభద్ర నీటి పంపకం కోసం ఏర్పాటైన బోర్డు కాల్వ ఆధునికీకరణ విషయమై కూడా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనన్నారు. ప్రస్తుత చర్చల్లో కుడికాల్వ ఆధునికీకరణ విషయాన్ని మాత్రమే చర్చించినట్లు చెప్పారు. వరద కాలువ విషయం, మరో విషయమంటూ తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుంగభద్ర కుడి కాల్వ ఆధునికీకరణ వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా బళ్లారితో పాటు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆధునికీకరణ విషయమై ‘బోర్డు నిర్ణయం’ తర్వాతే నిధుల విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ ట్రేడింగ్ చర్చల అనంతరం కర్ణాటకలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న విషయాలపై సంబంధిత అధికారులు, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హోటల్ అశోకాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియూతో మాట్లాడుతూ.. కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంభిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. దీన్ని ఏపీలో అమలు చేయనున్నామని వెల్లడించారు. ల్యాండ్‌పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చర్చల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత పాల్గొన్నారు. -
'నిబంధనల మేరకే నీరు వాడుకుంటున్నాం'
హైదరాబాద్: నీటి పంకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నిబంధనలు ప్రకారమే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. నియమాలు ఉల్లంఘించింది ఏపీ ప్రభుత్వమేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే నీటిని వాడుకుంటున్నామని వివరించారు. మిగులు జలాలు, నికర జలాలు వాడుకున్న తర్వాత కూడా ఇంకా 136.9 టీఎంసీలు వాడుకునే హక్కు తమకుందని తెలిపారు. జీవో 233 గురించి ఆంధ్రా నాయకులు ఎందుకు మాట్లాడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
తెలంగాణకు కుట్రపూరిత అన్యాయం: కేసీఆర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీలో తెలంగాణకు కుట్రపూరిత అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రాజెక్టుల ఆపరేషన్ రూల్స్ ను తయారు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల గేట్లు, కాలువ నీటి విడుదలను బోర్డులే నిర్వహించాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 50 టీఎంసీలు కేటాయించాలని సీఎం తెలిపారు. నదుల పర్యవేక్షణకు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం హెలికాఫ్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ కు మంచి నీరు అందించే ఆలోచన ఉందన్నారు. కృష్ణా గోదావరి బోర్డులకు తక్షణం 5 కోట్ల సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఎస్ కే పండిట్, ఎమ్మెస్ అగర్వాల్ లు పాల్గొన్నారు. -
ఎవరి వాటా ఎంతో మీరే తేల్చుకోండి
బెంగళూరు: కృష్ణా నదీజలాల పంపకం మళ్లీ కొత్తగా జరగాలని, ఇందుకోసం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ వాదనను తిప్పికొట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయకోవిదులతో సమావేశమయ్యారు. తాము తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. ఈ నెల 14వ తేదీన మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి కృష్ణా నీటిలో వాటాలను తేల్చడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఇదివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని... అప్పుడు ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా లేనందువల్ల ఈ ప్రాంతానికి ఎంత వాటా అనేది తేల్చలేదని... ఈ రకంగా బచావత్, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునళ్ల కేటాయింపుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణ వాదనపై మీ వైఖరేమిటో తెలపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్ కర్ణాటక ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీకి నోటీసు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సమావేశం జరిగింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో మార్పులు జరిగే ప్రసక్తేలేదని, అది తమకు సమ్మతం కాబోదని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కూడా కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్ర వాటాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంచాలని పేర్కొన్నారని... అందువల్ల ఇందులోకి కర్ణాటకను లాగడం సబబు కాదని ఆయన అన్నారు. అది వారు (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు) తేల్చుకోవాల్సిన అంశమన్నారు. -
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు
-
మళ్లీ పంచాలి!
-
మళ్లీ పంచాలి!
* కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్రం డిమాండ్ * బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించేందుకు సిద్ధం * ఉమ్మడి రాష్ట్రంలో నీటికేటాయింపుల్లో అన్యాయం.. ఎగువ రాష్ట్రాలతోనూ సమస్య * తెలంగాణలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉండగా.. నీటి కోటా 36.4 శాతమే ట్రిబ్యునల్ ఎదుట ఉమ్మడి * ఆంధ్రప్రదేశ్ వాదనలు సమ్మతం కాదు * మహారాష్ట్ర, కర్ణాటకతో సహా మళ్లీ విడిగా వాదనలు వినాలి.. * మొత్తం జలాలను నాలుగు రాష్ట్రాలకు మళ్లీ పంపిణీ చేయాలి * మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని కోరనున్న టీ-సర్కారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాల మధ్య మళ్లీ పంపిణీ చేయాల్సిందేనని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని.. మళ్లీ వాదనలు వినాల్సిందేనని కోరనుంది. అంతేగాకుండా కృష్ణా నీటిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను మాత్రమేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను కూడా కలుపుకొని మొత్తం నదీజలాలను తిరిగి పంచాలని విజ్ఞప్తి చేయనుంది. నదిలో నీటి లభ్యత శాతం, నీటి ప్రవాహం అంచనా కోసం పరిగణనలోకి తీసుకున్న 47 ఏళ్ల సమయం విషయంలో పలు అభ్యంతరాలను వెల్లడించనుంది. మొత్తంగా ప్రస్తుతమున్న దానికంటే ఎక్కువ నీటి కేటాయింపులు పొందాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సమావేశాల్లో తన వాదన వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఎటూ తేలని పంపిణీ.. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తొలుత బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. అయితే జలాలను పంపిణీ చేస్తూ ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రాల మధ్య వివాదాలు సద్దుమణగకపోవడంతో.. పదేళ్ల కింద బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కృష్ణా ట్రిబ్యునల్-2ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించింది. కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకంగా ఉండడంతో.. ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కూడా. అయితే ఈ లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. దాంతో రెండు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యను పరిష్కరించడానికి వీలుగా అదే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగించారు. ఈ ట్రిబ్యునల్ తొలి సమావేశం వచ్చే నెల 24వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ ట్రిబ్యునల్ సమావేశంలో తమ వాదనలను వినిపించడానికి ఆయా రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. మొదటి నుంచీ పంచాలి.. వాస్తవానికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు ఉద్దేశం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి మాత్రమే. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే వచ్చే నెలలో జరగనున్న ఈ ట్రిబ్యునల్ సమావేశాలకు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్ణాటకను కూడా ఆహ్వానించారు. దీంతో కృష్ణా జల వివాదం రెండు రాష్ట్రాల మధ్యనే కాకుండా నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనల్ని వినిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని.. దానిని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సర్కారు వెల్లడించనుంది. ముఖ్యంగా నీటి పంపిణీని మళ్లీ మొదటి నుంచీ చేయాలని కోరనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని... వాటి ఆధారంగా చేసిన కేటాయింపులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున వాటిని వ్యతిరేకించనుంది. నాలుగు రాష్ట్రాల సమస్య కృష్ణా నది జల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశంగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరనుంది. తద్వారా ఎక్కువ నీటిని పొందవచ్చని అంచనా వేస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదంగా చూస్తే... ఆలమట్టి ఎత్తు, మిగులు జలాల పంపిణీ వంటి అంశాలను లేవనెత్తడానికి అవకాశం ఉండదు. కేవలం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. దాంతో నీటి కోటా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయా న్ని దృష్టిలో ఉంచుకుని.. కృష్ణా జలాల సమస్యను నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాలని తెలంగాణ సర్కా రు కోరనుంది. ప్రత్యేకించి నీటి కేటాయింపుల్లో నది పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ నీటి కేటాయింపు మాత్రం 36.4 శాతమే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ.. కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండాలని వాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో అన్యాయం తెలంగాణ వాదనల సందర్భంగా కేవలం ఆంధ్రప్రదేశ్తోనే పంచాయితీ ఉందని మాత్రమేగాకుండా... ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వల్ల కూడా అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ట్రిబ్యునల్ మందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం పద్ధతి, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని కోల్పోవడం, నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47 ఏళ్ల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం.. తదితర అంశాల్లో ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. అలాగే నది నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడాన్ని కూడా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కృష్ణా నీటిని ఇతర నదుల పరీవాహక ప్రాంతాలకు వినియోగించడానికి అనుమతించ వద్దని కోరనుంది. మిగులు జలాల పంపిణీని కూడా రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేయనుంది. -
నీటి విడుదలపై ప్రత్యేక కమిటీ
సాక్షి, హైదరాబాద్: నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు అయ్యే వరకు ఈ కమిటీ మనుగడలో ఉంటుంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. ఈ మేరకు సాగునీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వి. నాగిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల అధికారులు ఉంటారు. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇరు రాష్ట్రాల జెన్కో డెరైక్టర్లు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అయితే నీటి విడుదల విషయంలో పాత విధానం (ఇప్పటి వరకు అమలులో ఉన్న) ప్రకారమే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వరద నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత కూడా ఈ కమిటీ కిందకే రానుంది. కాగా కృష్ణా నదిపై ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలా? వద్దా ? అనే విషయాన్ని ఈ కొత్త కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ వరద జలాలపై ఆధారపడి ఉండడంతో నికర జల కేటాయింపులు లేవు. దాంతో వరదలు వచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం, సాగర్, జూరాల, బీమా, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, డెల్టాలకు నీటి విడుదల షెడ్యూల్‌ను ఈ కమిటీ ప్రకటించనుంది. అలాగే చెన్నై, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు మంచినీటి విడుదలను కూడా కమిటీయే పర్యవేక్షించనుంది. -
నీటి ‘విభజన’ మరింత క్లిష్టం
రెండు రాష్ట్రాలేర్పడితే కృష్ణా నీటి పంపిణీలో ఎన్నో చిక్కుముళ్లు 1,005 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకూ వుూడు రకాలుగా పంచాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల నడువు కృష్ణా జలాల పంపిణీ వురింత క్లిష్టతరం కానుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వుహారాష్ట్ర నడువు కృష్ణా జలాల పంపిణీ కథే ఇంకా వుుగియులేదు. ఇంకా సుప్రీంకోర్టులో ఈ వివాదానికి తుది పరిష్కారం దొరకాల్సి ఉంది. ఈలోపు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే తాత్కాలికంగా పాత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వునకు దక్కిన మొత్తం వాటాను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే 65 శాతం డిపెండబిలిటీతో కనిపిస్తున్న అదనపు నికర జలాలను, మిగులు జలాలను కూడా పంపిణీ చేయూలంటే సుప్రీం తుది తీర్పు దాకా వేచి ఉండాల్సిందే. ఒకవేళ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును అవులు చేయూల్సిన పరిస్థితి వస్తే... 1,005 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు మూడు రకాలుగా పంపిణీ చేయూలి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, కృష్ణా డెల్టాలకు ఎలాగూ నికర జలాల కేటారుుంపులున్నారుు. ఇప్పటికే ఎలాంటి స్పష్టమైన నీటి కేటారుుంపుల్లేని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎవ్మూర్పీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకం. ఇక అదనపు నికర జలాలు (65 శాతం డిపెండబిలిటీ ద్వారా వచ్చే కోటా), మిగులు జలాల్ని ఏ ప్రాతిపదికన వీటికి కేటారుుంచాలనేది సంక్లిష్టంగా వూరనుంది. ఈ పరిస్థితిలో పోలవరానికి జాతీయు హోదా ఇచ్చినా ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు, చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రకరకాల సవుస్యలు సృష్టిస్తూనే ఉన్నారుు.గోదావరి నీటిని కృష్ణాకు వుళ్లించేందుకు ఉద్దేశించిన దువుు్మగూడెం ప్రాజెక్టుకు తెలంగాణ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనువూనమే. 2000 మే నెలతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు వుుగిసి.. 2004 ఏప్రిల్‌లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి.. ఇన్నేళ్లు గడిస్తేగానీ ఇప్పటికీ నీటి పంపిణీ ప్రక్రియు వుుగియులేదు. కావేరీ, నర్మద వంటి జల వివాదాలు దాదాపు 3 దశాబ్దాలుగా సాగుతున్నా ఇంకా పరిష్కారం దొరకలేదు సరికదా సాక్షా త్తూ ప్రధాని జోక్యం చేసుకున్నా దిగువ రాష్ట్రాలకు సకాలంలో కాసింత నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సీవూంధ్ర సకాలంలో నీటి విడుదలకోసం వుహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తెలంగాణపై కొత్తగా ఆధారపడాల్సిన స్థితి వస్తుంది. -
జలాల పంపిణీపై స్పష్టత: సురవరం డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: నదీ జలాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన అనివార్యమని తేలిపోయాక నదీ జలాలు, విద్య, వైద్యం, విద్యుత్ ఉత్పత్తి, ఆస్తుల పంపిణీ తదితర కీలక అంశాలపై చర్చ జరగాలన్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన కార్యాలయాలను సీమాంధ్రకు తరలిస్తే వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆ ప్రాంతాభివృద్ధికి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఢిల్లీలో తాము నిర్వహించిన మతోన్మాద వ్యతిరేక సదస్సు విజయవంతమైందని చెప్పారు. సంఘ్‌పరివార్ మతం పేరుతో ప్రజలను విభజించడానికి యత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీతో సీపీఐ కలిసివెళుతుందా అని అడగ్గా.. ఆ పార్టీతో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీలతో కూడా మాట్లాడామన్నారు. కొన్ని పార్టీలు సమైక్యాన్ని, మరికొన్ని తెలంగాణవాదంపైపు ఉన్నాయన్నారు. తుపాను, అల్పపీడనం వల్ల రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందని, ఏపీ, ఒడిశాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తమ పార్టీ తీర్మానం చేసినట్లు చెప్పారు. -
ఇవిగో సాగునీటి లెక్కలు!
* కేటాయింపులు, వాడకంపై ముగిసిన అధికారుల కసరత్తు * కేంద్రానికి ప్రత్యేక నివేదిక సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ఏ ప్రాంతానికి ఎంతెంత నీటి కేటాయింపులు ఉన్నాయనే విషయంలో అధికారులు సాగించిన కసరత్తు పూర్తయింది. ప్రాంతాల వారీగా నీటి కేటాయింపులు, వాడకంపై గత వారం రోజులుగా అధికారులు రూపొందిస్తున్న నివేదిక తుది రూపం దాల్చింది. ఈ నివేదికను కేంద్రానికి పంపించనున్నారు. బచావత్ అవార్డు ప్రకారం చేసిన కేటాయింపులనే నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాంతాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, వరద నీటిపై ఆధారపడిన ప్రాజెక్టుల వివరాలను పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు, వాటికి కావాల్సిన నీటి కేటాయింపుల వంటి సమాచారాన్ని పొందుపరిచారు. కృష్ణానదిలో రాష్ట్రానికి మొత్తం 811 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఆంధ్ర ప్రాంతానికి 367.34 టీఎంసీలు, రాయలసీమకు 144.70 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయించినట్టు పేర్కొన్నారు. అలాగే మిగులు జలాలపై ఆధారపడిన నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు. కృష్ణా డెల్టాకు 181 టీఎంసీల నీటి కేటాయింపు ఉండగా, ఇప్పటివరకు వాడకం ఎక్కువగా ఉన్నట్టు వివరించారు. అయితే డెల్టా ఆధునీకరణ వల్ల పొదుపయ్యే నీటిలో 20 టీఎంసీలను మహబూబ్‌నగర్‌లోని బీమాకు, మరో 9 టీఎంసీలను సాగర్ దిగువన నిర్మిస్తున్న పులిచింతలకు కేటాయించినట్టు తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురిసి వరదనీరు వచ్చిన సమయంలో డెల్టా ఆయకట్టులో రెండవ పంటను సాగు చేస్తున్నట్టు నివేదికలో పొందుపరిచారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు 280 టీఎంసీల కేటాయింపు ఉన్నట్టు పేర్కొన్నారు. -
విభజన సరే! వీటిమాటేమిటి?
-
కొత్త రాష్ట్రాల ఏర్పాట్లు, నదీ జలాల సమస్య పై బిగ్ స్టోరీ
-
బ్రిజేశ్ చేతిలో భవితవ్యం
కృష్ణా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తి తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ బ్రజేశ్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నది నీటి కేటాయింపులపై జస్టిస్ బ్రజేశ్‌కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘంగా సాగిన వాదనలు శుక్రవారం ముగిసాయి. వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్ చేస్తున్నామని జస్టిస్ బ్రజేశ్‌కుమార్ ప్రకటించారు. మూడు రాష్ట్రాలకు సమాచారమిచ్చి తీర్పును వెల్లడిస్తామని చెప్పారు. దీంతో ట్రిబ్యునల్ గతంలో వెలువరించిన తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని... ప్రస్తుత తీర్పుతోనైనా సరిదిద్దుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఇప్పటివరకు మూడు రాష్ట్రాలతో ముడిపడిన నీటి కేటాయింపుల వివాదం, భవిష్యత్తులో నాలుగు రాష్ట్రాలకు విస్తరిస్తే తలెత్తే పరిణామాలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పులోనూ న్యాయం జరగకుంటే రాష్ట్రానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. జస్టిస్ బ్రజేష్‌కుమార్ సారథిగా, జస్టిస్ దిలీప్‌కుమార్ సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న ఈ ట్రిబ్యునల్ కాలపరిమితి సెప్టెంబర్ ఆఖరుకల్లా పూర్తికానుంది. అందువల్ల ఆలోగానే తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. కానిపక్షంలో ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగింపునకు చైర్మన్ అనుమతి కోరాల్సి ఉంటుంది. ఈ నెల 26న మొదలైన తుది విడత విచారణ షెడ్యూలు ప్రకారం చివరి రోజైన శుక్రవారమే ఒక కొలిక్కిరావడం గమనార్హం. శుక్రవారం తొలుత మన రాష్ట్రం కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించి తుది వాదనను వినిపించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రతిపాదనలతో పాటు ఇతర అంశాలను పొందుపరిచిన నోట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించింది. అనంతరం కర్ణాటక, మహారాష్ట్రలు ఎప్పటిమాదిరిగానే రాష్ట్రానికొచ్చే జలాలకు గండికొట్టే యత్నాలను కొనసాగిస్తూ వాదనలు విన్పించాయి. దిగువ రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నీటిని కూడా హరించే ఎత్తుగడతో వితండవాదాన్ని వినిపించాయి. ఎగువ రాష్ట్రాల వాదనలను తిప్పికొట్టిన రాష్ట్రం జస్టిస్ బ్రజే శ్‌కుమార్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఆలస్యంగా రావడంతో ఉదయం 11 గంటలకు మొదలవ్వాల్సిన విచారణలో 20 నిమిషాల జాప్యం జరిగింది. తొలుత రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి తుది వాదనను వినిపించారు. రెండురోజుల క్రితం కర్ణాటక ట్రిబ్యునల్‌కు అందించిన నోట్లోని అంశాలను ఆయన తప్పుపట్టారు. జలాల వినియోగంపై కర్ణాటక సూచించిన పద్ధతి సరైంది కాదన్నారు. ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక వెలిబుచ్చుతున్న ఆందోళనలకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, ఇవేవీ అధ్యయనాల ఆధారితమైనవి కాదని చెప్పారు. మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, చేస్తున్న వాదన ల్లో కూడా పస లేదన్నారు. జలాల పంపిణీ, వాడకం పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటైనా సరే తమకు అన్యాయం జరుగుతుందని, ఎగువ రాష్ట్రాలు రెండైతే కిందనున్నది తామొక్కరమేనని తెలిపారు. అందువల్ల బోర్డుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు. దిగువ రాష్ట్రం హక్కుల పరిరక్షణ బాధ్యత నుంచి ఎగువ రాష్ట్రాలు తప్పించుకోజాలవన్నారు. నీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రతిపాదనలతోపాటు కొన్ని ఇతర అంశాలనూ సూచిస్తూ నాలుగు పేజీల నోట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించారు. మళ్లీ ఎగువ రాష్ట్రాల వితండవాదం.. విచారణ పూర్తికావొస్తున్న తరుణంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను దెబ్బతీసే లక్ష్యంతోనే ఎగువరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వ్యవహరించాయి. గతంలో అనేక సందర్భాల్లో వినిపించిన వితండవాదాన్నే చివరిరోజునా ఆ రెండు రాష్ట్రాలు కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ వాదన పూర్తయ్యాక కర్ణాటక తరఫున ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ వాదిస్తూ, జస్టిస్ బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని పట్టికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికస్థాయిలో నీటి లభ్యత ఉన్న మూడు సంవత్సరాల వివరాలను ప్రస్తావించారు. నీటి లభ్యత భిన్నంగా ఉంటున్నందున కింది రాష్ట్రానికి ఏప్రాతిపదికన నీరు విడుదల చేయాలని ప్రశ్నించారు. కింది రాష్ట్రం నీటిని వాడుకునేవరకూ తమను అదనపు కేటాయింపుల జోలికి వెళ్లొద్దంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఆయన వాదనను జస్టిస్ బ్రజేశ్‌కుమార్, జస్టిస్ దిలీప్‌కుమార్ సేఠ్ తోసిపుచ్చారు. మీరు ఆందోళన చెందుతున్నట్టుగా సమస్యలేవీ రాబోవని, తాము ప్రతిపాదించిన పరిష్కారంలో సమస్యను జటిలం చేసే అంశాలేవీ లేవని, అయినా మరోసారి పరిశీలించి అవసరమనుకుంటే మార్గదర్శకాలను సైతం ఇస్తామని చెప్పారు. చివరగా మహారాష్ట్ర సీనియర్ న్యాయవాది అంద్యార్జున వాదిస్తూ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమ వాటా జలాలను వినియోగించుకునేవరకూ తాము అదనపు జలాల జోలికి వెళ్లరాదనడం సరికాదన్నారు. అదనపు జలాల వినియోగానికి ‘‘నీటి వినియోగం’’ ఎంత మాత్రం ప్రాతిపదిక కారాదని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి సాగిన ట్రిబ్యునల్ విచారణ ఆఖరికి పూర్తికావడంతో మూడు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, న్యాయవాదులు ఊపిరి పీల్చుకున్నారు. నోట్లోని ముఖ్యాంశాలు.. 75 శాతం నీటిలభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా నది నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు క్యారీఓవర్ కింద 150 టీఎంసీలను కేటాయించింది. ఇంతకుమించి ఏ రాష్ట్రమూ నీటిని వాడకూడదు. ఆ తర్వాత..65 శాతం డిపెండబులిటీ ఆధారంగా బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గుర్తించిన 448 టీఎంసీల (ఆంధ్రప్రదేశ్ 190, మహారాష్ట్ర 81, కర్ణాటక 177 టీఎంసీల చొప్పున) మిగులు జలాలను దామాషాకు లోబడి మూడు రాష్ట్రాలూ వినియోగించుకోవాలి. కర్ణాటక 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు వాడటంతో పాటు 190 టీఎంసీల క్యారీ ఓవర్‌ను నిల్వ చేసుకున్న తర్వాతే మహారాష్ట్ర తమ వాస్తవ కేటాయింపులైన 585 టీఎంసీల పరిధిని దాటి అదనపు కోటా అయిన 81 టీఎంసీలను వాడుకోవాలి. అదనపు కోటా వాడుకునేటప్పుడూ 81 టీఎంసీలకే పరిమితం కావాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు వాడటంతోపాటు 150 టీఎంసీల క్యారీ ఓవర్‌ను నిల్వచేసుకున్నాకే కర్ణాటక తమ వాస్తవ కేటాయింపులైన 734 టీఎంసీల పరిధిని దాటి 177 టీఎంసీలను వాడుకోవాలి. అదనపు కోటా వాడకంలో 177కే పరిమితం కావాలి. ఈ ప్రతిపాదనతో పాటు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 2130 టీఎంసీల జలాలను వాడుకున్న తర్వాత 65 శాతం లభ్యత ఆధారంగా బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన నీటిని వాడుకోవడంపైనా రాష్ట్రం ప్రత్యామ్నాయ ప్రతిపాదన నోట్లో పేర్కొంది. నీటి వాడకం నిర్వచనంలో ‘వాడకం’ అంటే వినియోగించిన జలాలు లేదా మళ్లించిన జలాలతోపాటు ఒక జల సంవత్సరంలో ఏ రాష్ట్రమైనా నిల్వ చేసుకున్న మొత్తం నీరు అని మార్చాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ క్యారీ ఓవర్ నిల్వలను వినియోగించిన జలాలుగా పరిగణించరాదని తెలిపింది. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మళ్లించిన నీటినీ వినియోగ జలాలుగానే లెక్కించాలని పేర్కొంది. -
నీటి కేటాయింపుల్లో అన్యాయం: వాసిరెడ్డి పద్మ
తెలుగుజాతి మధ్య అంతర్యుద్ధం కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలకు మేలు జరుగుతుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర విభజనతో కర్ణాటక, మహారాష్ట్ర భారీగా లాభం పొందబోతున్నాయని పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారంగా రూ. 30వేలకోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ నీటికోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. మిగులు జలాల్లో 350 టీఎంసీలకు గాను 190 పెంచాలని కర్ణాటక, మహారాష్ట్రలు అంటున్నాయని తెలిపారు. నికర జలాల్లో రావాల్సిన 811 టీఎంసీల్లో 450మాత్రమే పొందుతున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మొత్తం 710 టీఎంసీలపై హక్కు ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. కిరణ్, బొత్సలు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కిరణ్, బొత్సలు గుర్తించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలనుంచి రావాల్సిన నీటి వాటాకోసం పోరాడాలని సూచించారు. -
పోలవరం పంపకాలు ఎలా?
* రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరపైకి మరో నీటి వివాదం! * పోలవరం నుంచి 80 టీఎంసీలను కృష్ణాలోకి తరలించాలి * ఈ 80లో 45 టీఎంసీలు మన రాష్ర్ట అవసరాలకు * ఈ 45 టీఎంసీల పంపకం చేపట్టేది ఎలా? * నీటి కోసం మూడు ప్రాంతాల్లో డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో నీటి పంపకానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోకి తీసుకువచ్చే 80 టీఎంసీల నీటిలో మనరాష్ర్టం వాడుకునే నీటి కోటాపై ఈ వివాదం తలెత్తనుంది. ఈ నీటిపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఆధారపడి ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ 80 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు (మహారాష్ట్ర, కర్ణాటక) వాడుకునే కోటా విషయంలో స్పష్టత ఉన్నా... మన రాష్ర్ట విభజన నేపథ్యంలో ఈ నీటిని కూడా పంచాల్సిన అవసరం ఉంది. గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కూడా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి అందించనున్నారు. అలాగే విశాఖపట్టణం అవసరాలకు 23 టీఎంసీలను సరఫరా చేయనున్నారు. 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వీటన్నింటితోపాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ 80 టీఎంసీల నీటిలో మన రాష్ట్ర అవసరాలకు 45 టీఎంసీలు, ఎగువన ఉన్న కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించారు. పోలవరం పూర్తయిన తర్వాత గోదావరి నది నీటిని కృష్ణాలోకి తరలించిన తర్వాత ఈ నీటి పంపకాలు అమల్లోకి రానున్నాయి. అంటే కృష్ణా దిగువ భాగంలో గోదావరి నుంచి వచ్చే 80 టీఎంసీలను మనరాష్ట్రం వాడుకుంటే.. ఎగువ ప్రాంతంలోని కృష్ణా నీటిలో ఆ రెండు రాష్ట్రాలు అదనంగా 35 టీఎంసీలను ఉపయోగించుకుంటాయి. దాంతో దిగువకు వచ్చే 35 టీఎంసీలు తగ్గిపోతాయి. నాడు ఎలాంటి ప్రాజెక్టులు లేవు.. మన రాష్ట్రానికి కేటాయించిన 45 టీఎంసీల వాడకంపైనే ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొంది. రాష్ర్ట విభజన అంశం తెరపైకి రావడంతో ఈ నీటి పంపకం ఎలా అన్న విషయం అధికారులకు అర్థం కావడం లేదు. అయితే ఈ నీటి వాడకానికి సంబంధించి గతంలో ఒక అవగాహన కుదిరింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 1985లో దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోకి వచ్చే 45 టీఎంసీల నీటిలో 30 టీఎంసీలను ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు, మిగిలిన 15 టీఎంసీల నీటిని తెలుగుగంగకు ఉపయోగించాలనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితి వేరు. కృష్ణా బేసిన్లో వరద నీటి ఆధారంగా పలు కొత్త ప్రాజెక్టులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. అందులో ముఖ్యంగా నెట్టెంపాడు, కల్వకుర్తి, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటివి ఉన్నాయి. ఎస్ఎల్బీసీ, తెలుగుగంగతో పాటు ఈ ప్రాజెక్టులకు కూడా నికర జల కేటాయింపు లేదు. ఇవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ దశలో రాష్ర్ట విభజన జరిగితే ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు ఇబ్బందిగా మారనుంది. దాంతో పోలవరం నుంచి మన రాష్ర్ట వాటాగా వచ్చే 45 టీఎంసీల కోసం ఈ ప్రాజెక్టుల ప్రాంతాల వారు కూడా పట్టుపట్టే అవకాశం ఉంది. 1985లో ఈ ప్రాజెక్టులు నిర్మాణంలో లేవు కాబట్టి వాటికి నీటి కోటా కోసం ఎలాంటి ప్రస్తావన రాలేదు. అయితే ప్రస్తుతం వాటి భవిష్యత్తుపై ఆందోళన నెలకొని ఉంది. దాంతో పాటు కొత్త ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి వచ్చే నీటి కోటా తగ్గిపోనుంది. అలాగే సాగర్, కృష్ణా డెల్టా ప్రాంతానికి కూడా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం నీటి కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రైతులు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. -
నీటి పంపకాలపై సీఎం ఆరా!
రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నీటి పంపకాలకు సంబంధించిన సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. మంగళవారం రోజంతా ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇతర సీనియర్ ఇంజనీర్లతో క్యాంప్ కార్యాలయంలో చర్చలు కొనసాగించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. కృష్ణా నది నీటి పంపకాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ నదిపై కల్వకుర్తి, నెట్టెంపాడు, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. దాంతో సరైన వర్షాలు కురవని సమయాల్లో ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు కష్టంగా మారనుంది. అప్పుడు ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనే విషయంపై సీఎం అధికారులతో చర్చించినట్టు సమాచారం.