
తీవ్ర నిరాశ !
నీటి పంపకాలపై లభించని స్పష్టత
ముగ్గురు సీఎంలు చర్చించుకుని తన వద్దకు రావాలని
{పధాని సూచన
బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రాంతానికి సాగు నీటిని అందించే మహదాయి నదీ నీటి పంపకం విషయంలో పొరుగు రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రాలతో ఏర్పడుతున్న సమస్యలను పరి ష్కరించే విషయమై ప్రధాని నరేంద్రమో దీ నుంచి రాష్ట్ర అఖిల పక్షానికి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో రా ష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో పాటు వివిధ మఠాధిపతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మహదాయి నీటి పంపకం విషయంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల మధ్య ఏర్పడిన వివాదాన్ని తొలగించాల్సిందిగా కో రుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృ త్వంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, వివిధ మఠాధిపతులు ప్రధాని నరేం ద్రమోదీతో సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 45 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం జేడీఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేందరమోదీ సమాధానం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా భేటీలో జరిగిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మహదాయి నదీ నీటి పంపకాలు సరిగా జరగక పోవడం వల్ల ఏడాదికి 100 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మీరు కలుగజేసుకుంటే వృథా నీటిని అడ్డుకట్టు వేయడానికి వీలవుతుంది. దీని వల్ల వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రావడమే కాకుండా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడవచ్చు.’ అని అఖిల పక్షం నాయకులు ప్రధానికి విజ్ఞప్తి చేశాం. ఇందుకు ప్రతిస్పందించిన ప్రధానమంత్రి మొదట మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడండి. అటుపై నా దగ్గరకు రండి. ఈ విషయంలో నేను ఏం చేయగలను.’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సమాధానం తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని బసవరాజ్‌హొరట్టి తెలిపారు. ప్రజలు రైతులు సాగు, తాగు నీటి కోసం అలమటిస్తుంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమావేశంలో పాల్గొన్న వివిధ మఠాలకు చెందిన అధిపతులు కూడా మీడియా ముందు నరేంద్రమోదీ వ్యవహరించిన తీరు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.