స్కాడా వెబ్‌సైట్ ఆవిష్కరణ
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ద్వారా అందించే రక్షిత తాగునీటి సరఫరాను ఆ¯ŒSలై¯ŒS ద్వారా ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేసిన స్కాడా వెబ్‌సైట్(స్మార్ట్‌వాటర్ డిస్టిబ్య్రూష¯ŒS మోనిటరింగ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. స్కాడా వెబ్‌సైట్ పనితీరును మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియ¯ŒS సీఎంకు వివరించారు. రిజర్వాయర్‌లలో నీటి నిల్వ, వినియోగం, హెడ్‌వాటర్ వర్కŠస్ నుంచి రిజర్వాయర్‌కు ఎంతనీరు ఎన్ని గంటల్లో చేరుతోందనే వివరాలను వెబ్‌సైట్‌ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తద్వారా నీటి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు లీకేజీలను అరికట్టవచ్చన్నారు. నగర పరిధిలో 63 రిజర్వాయర్లు ఉండగా, 52 రిజర్వాయర్లను స్కాడాకు అనుసంధానం చేశామని, త్వరలోనే మిగితావి అనుసంధానం చేస్తామని కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్షి్మ, పబ్లిక్‌హెల్త్ సీఈ మోజేస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.