
'నిబంధనల మేరకే నీరు వాడుకుంటున్నాం'
హైదరాబాద్: నీటి పంకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నిబంధనలు ప్రకారమే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. నియమాలు ఉల్లంఘించింది ఏపీ ప్రభుత్వమేనని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే నీటిని వాడుకుంటున్నామని వివరించారు. మిగులు జలాలు, నికర జలాలు వాడుకున్న తర్వాత కూడా ఇంకా 136.9 టీఎంసీలు వాడుకునే హక్కు తమకుందని తెలిపారు. జీవో 233 గురించి ఆంధ్రా నాయకులు ఎందుకు మాట్లాడం లేదని హరీశ్రావు ప్రశ్నించారు.