కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కొనసాగుతున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. గురువారం ఉదయానికి 37వేల క్యూసెక్కులు (3.36 టీఎంసీలు)గా నమోదైన ప్రవాహం సాయంత్రానికి 1.93లక్షల క్యూసెక్కులకు (17.54 టీఎంసీలు) పెరిగింది.