sreesailam
-
శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం
-
బుడ్డా గారి.. చెడ్డ మాటలు
-
శ్రీశైలంలో తెలంగాణ భక్తులపై పచ్చ సైకోల దాడి
-
శిఖరేశ్వరంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన ఎలుగుబంటి
-
శ్రీశైలానికి జలకళ
-
ఒక్క రోజు 12 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కొనసాగుతున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. గురువారం ఉదయానికి 37వేల క్యూసెక్కులు (3.36 టీఎంసీలు)గా నమోదైన ప్రవాహం సాయంత్రానికి 1.93లక్షల క్యూసెక్కులకు (17.54 టీఎంసీలు) పెరిగింది. 24 గంటల వ్యవధిలో ప్రాజెక్లులోకి ఏకంగా 12 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. వచ్చి చేరుతున్న వరదతో ప్రాజెక్టులో నిల్వ 215 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. గోదావరిలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలానికి జలకళ పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఏకంగా 1.60లక్షల క్యూసెక్కుల (14.54 టీఎంసీలు) ప్రవాహం వస్తుండటంతో అక్కడి నుంచి 2.13లక్షల క్యూసెక్కుల (19.36 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా నారాయణపూర్‌కు చేరుతుండగా, అక్కడి నుంచి 1.94లక్షల క్యూసెక్కుల (17.63 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు 1.85లక్షల క్యూసెక్కుల (16.81టీఎంసీలు) మేర ప్రవాహం వస్తోంది. దీంతో జూరాల నుంచి 24 గేట్ల ద్వారా 1,57,185 క్యూసెక్కులు (14.28 టీఎంసీలు), విద్యుదుత్పత్తి ద్వారా 26,238 క్యూసెక్కులు (2.38 టీఎంసీలు) నదిలో వదులుతున్నారు. ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ 315 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాల్వలకు 1,900 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి దిగువసు వస్తున్న నీరంతా శ్రీశైలానికి చేరుతోంది. గురువారం సాయంత్రం శ్రీశైలానికి 1.93లక్షల క్యూసెక్కుల (17.54టీఎంసీలు) ప్రవాహం వస్తోంది. బుధవారం ఉదయం కేవలం 804 అడుగుల మట్టంలో 31టీఎంసీల మేర నీటి నిల్వలుండగా, అది ఒక్క రోజులోనే 822 అడుగులకు పెరిగి నిల్వ 43 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులో 12 టీఎంసీల కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 158 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 115 టీఎంసీల మేర తక్కువగా నిల్వ ఉంది. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటం, ఈ వరద మరో పది రోజుల పాటు కొనసాగినా ప్రాజెక్టులో నీటినిల్వలు భారీగా పెరగనున్నాయి. -
కరువుదీర... జీవధార
సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు, పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి వరదలై పారుతున్నాయి. ఈ నీరంతా ఆయా పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి చేరుతుండటంతో జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల మేర వరదను దిగువకు వదలడంతో మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండడంతో విద్యుదుత్పత్తి ద్వారా, 17 గేట్లు ఎత్తి 1.65 లక్షల క్యూసెక్కుల (15 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా గురువారం శ్రీశైలం జలాశయానికి చేరనుంది. కృష్ణాలో తగ్గని వరద ఉధృతి మహాబలేశ్వర్, పశ్చిమకనుమల్లో విపరీతంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏకంగా 2లక్షల17 వేల క్యూసెక్కుల(19.72 టీఎంసీలు) మేర వరద ఆల్మట్టిలోకి పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండడంతో 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)) మేర నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారడంతో మరో 2 లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) నీటిని అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరుతోంది. దీంతో బుధవారం సాయం త్రానికి జూరాలకు 1.70 లక్షల క్యూసెక్కుల (15.45 టీఎంసీలు) మేర నీటిప్రవాహం నమోదైంది. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 9.65 టీఎంసీ లు కాగా, 5.8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా 1,300, కోయిల్‌సాగర్ 325, జూరాల కుడి, ఎడమకాల్వలకు 1,800 క్యూసెక్కుల నీటిని పంపించేస్తున్నారు. మరో 20 వేల క్యూసెక్కుల (1.8 టీఎంసీలు)ను విద్యుదుత్పత్తి ద్వారా 1.40 లక్షల క్యూసెక్కుల (12.72 టీఎంసీలు)ను గేట్ల ద్వారా శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ నీరంతా గురువారం ఉదయానికల్లా శ్రీశైలం చేరే అవకాశం ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 32 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. గోదా‘వరదే’ గోదావరి నదిలోనూ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ వద్ద బుధవారం 2 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం నమోదు కాగా, బ్యారేజీలోని 30గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 6.15టీఎంసీలు, అన్నారంలో 5.13టీఎంసీలు, సుందిళ్లలో 6టీఎంసీల నీటి నిల్వలున్నాయి. మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లను పూర్తిగా నిలిపివేయగా, సుందిళ్లలో ఒక మోటారుకు బుధవారం వెట్‌రన్ నిర్వహించారు. ఇక, ఎల్లంపల్లిలోకి సైతం నీటి ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎగువ కడెం, స్థానిక పరివాహకం నుం చి బుధవారం ఉదయం 20వేల క్యూసెక్కుల (1.8 టీఎంసీలు) నీరు రాగా, మధ్యాహ్నం 13వేల క్యూసెక్కులు (1.18 టీఎంసీలు), సాయంత్రం 8 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. మొత్తం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి కూడా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్/గద్వాల టౌన్: ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా కృష్ణా నదీ జలాలు దిగువకు వస్తుండటంతో జూరాల నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ఏకంగా ఎగువ నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతుండటంతో సాయంత్రం ఏడు గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగాను 5.5 టీఎంసీలకు చేరింది. ఎగువ ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసె క్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని దిగువ నా రాయణపూర్కు వదులుతున్నారు. నారాయణపూర్ సైతం ఇప్పటికే నిండటంతో 20 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరి నిల్వ పెరగడంతో జూరాల నుంచి నీటి విడుదల మొదలైంది. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1 ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ద్వారా 315 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా కుడి, ఎడమ కాల్వలకు 900 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. దీంతోపాటు జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం దిశగా పరుగులు తీస్తోంది. జూరాల నుంచి విడుదలైన జలాలు గురువారం ఉదయానికి శ్రీశైలం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 31 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇక్కడ నీటి నిల్వ 854 అడుగులకు చేరిన వెంటనే తెలంగాణ, ఏపీ నీటి వినియోగం మొదలు పెట్టనున్నాయి. ఇప్పటికే కల్వకుర్తి ద్వారా నీటి ఎత్తిపోతలకు పంపులు సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. గతేడాదితో పోలిస్తే జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి 10 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. -
అది క్షుద్ర పూజ కాదు.. చండీ హోమం మాత్రమే!
శ్రీశైలం: తాను శ్రీశైలం దేవస్థానం పరిధిలో క్షుద్ర, తాంత్రిక పూజలు చేశానని ఒప్పకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను వేద పండితుడు గంటి రాధాకృష్ణ శర్మ ఖండించారు. తన చేత బ్రాహణ సంఘం నేతలు బలవంతంగా వివరణ లేఖపై సంతకం పెట్టించారని రాధాకృష్ణ ఆరోపించారు. తన నివాసంలో చేసింది కేవలం చండీ హోమం మాత్రమేనని స్పష్టం చేశారు. క్షుద్ర పూజలు చేశానంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పడానికే మీడియా ముందుకొచ్చానని రాధాకృష్ణ తెలిపారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆలయం వేద పండితుడు రాధాకృష్ణ శర్మ తన ఇంటి వద్ద తాంత్రిక పూజలు చేశారన్న వ్యవహారం ఇటీవల వెలుగుచూసింది. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. దీంతో ఆయన హైకోర్టు, హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా విచారణ కమిటీ నియమించింది. ఈ నేపథ్యంలో తాంత్రిక పూజలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు వార్తలు వెలుగుచూశాయి. దానిపై స్పందించిన రాధాకృష్ణ శర్మ... క్షద్ర పూజలు చేశానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
ఒకే ఒక్కడు..రూ. వంద కోట్లు
శ్రీశైల క్షేత్రంలో మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా చేపట్టిన రూ. కోట్ల అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలు కాంట్రాక్ట్ ఇంజినీర్లకు అప్పగింతలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్ర పరిధిలో దాదాపు రూ. 150 కోట్ల పనులు చేపట్టగా ఒక ఏఈఈకి రూ. వంద కోట్ల పనుల బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే ఏదో రహస్యం దాగి ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఓ రాజకీయ నేత, రాష్ట్ర స్థాయి అధికారి అండదండలతో ఆయన ఇంజినీర్ విభాగంలోనే కీలకంగా మారారు. పనుల నాణ్యత గాలికొదిలేసి..కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ అక్రమార్జనకుపక్కా ప్లాన్ గీశారు. శ్రీశైలం టెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ విభాగం కీలకం. ఇంజినీంగ్ విభాగంలో ఈఈ, డీఈ ఏఈఈలు ఉండగా ప్రధానంగా ఏఈఈ (అస్టిసెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్)లు పనుల పర్యవేక్షణ చేస్తుంటారు. పనులకు సంబంధించి వీరు ప్లాన్ రూపొందించడం నుంచి కొలతలు, ఎస్టిమేషన్, డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. శ్రీశైల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా 8 మంది కాంట్రాక్ట్ ఏఈఈలను దేవదాయ శాఖ నియామకం చేసింది. వీరిలో ఏడుగురు దాదాపు రూ. 50 కోట్ల పనులు పర్యవేక్షిస్తుండగా, ఒక ఏఈఈ మాత్రం రూ.వంద కోట్ల పనులు పర్యవేక్షిస్తుండటంతో పలు అనుమానాలకు తావ్విస్తోంది. గుంటూరు జిల్లా నరసారావు పేటకు చెందిన ఆయనకు ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత సిఫారసు మేరకు ఇక్కడ ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో నరసారావుపేట మున్సిపాల్టీలో పని చేసే సమయంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. శ్రీశైల క్షేత్ర పరిధిలో చేపట్టిన పనుల్లో అధికార పార్టీ నేతకు చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ భారీ పనిని దక్కించుకుంది. ఆ పనిని పర్యవేక్షించడానికి ఆ ఉద్యోగికే బాధ్యతలు అప్పగించారు. ఇలా క్షేత్రంలో జరిగే పనుల్లో అధిక శాతం ఆయనకు అప్పగించడం వెనుక దేవస్థానం ఉన్నతాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు అనర్హులు? 2013 మార్చిలో అప్పటి ఈఓ ఆజాద్ సమయంలో ఐదుగురు ఒప్పంద ఏఈఈలను తీసుకున్నారు. వారి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో కోర్టును ఆశ్రయించారు. దేవస్థానంలో ఏఈఈలుగా అవసరం ఉంటే వారికి ప్రా«ధాన్యత కల్పించాలని కోర్టు సూచించినా దేవదాయ శాఖ పట్టించుకోలేదు. 2017 మార్చి నెలల్లో భవన్‌కుమార్, రాజారామ్, ప్రణయ్, విష్ణుబాబు, ఆనంద్, సురేష్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, ప్రవళికను కాంట్రాక్ట్ పద్ధతిపై ఐదేళ్ల కాల పరిమితితో తీసుకున్నారు. కాగా వీరిలో ముగ్గురు పరీక్షలో ఉత్తీర్ణత కాకపోయినా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. పనులపై పర్యవేక్షణ తప్పనిసరి శ్రీశైల క్షేత్రపరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ ఉంది. పనుల్లో నాణ్యత ఉండేలా చూస్తున్నాం. దేవస్థానం పరిధిలో 8 మంది ఏఈఈలు, ఇద్దరు డీఈలు, ఈఈ రామిరెడ్డి పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. ఒక ఏఈఈకి రూ.100 కోట్ల పనులు అప్పగించడం పై స్థాయి అధికారుల నిర్ణయం మేరకే జరిగింది. – శ్రీనివాసరెడ్డి, డీఈ, శ్రీశైల దేవస్థానం -
పోటెత్తిన శ్రీశైలం
కర్నూలు , శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీశైలం డ్యాం గేట్లను తీయడంతో భక్తుల తాకిడి పెరిగింది. దీనికి తోడు వారాంతపు వరుస సెలవుదినాలు కలిసి రావడంతో ఉభయరాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి శనివారం రాత్రికే శ్రీశైలానికి లక్షమందికి పైగా భక్తులు చేరుకున్నారు. ఆదివారం ఉదయానికి మరింత పెరగడంతో ఆలయ పుర వీధులు మొదలుకొని ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈఓ భరత్‌గుప్త ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, 3గంటలకు సుప్రభాతం, 4 గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత, శీఘ్ర దర్శన, క్యూలలో వేకువజాము నుంచే నిలుచున్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అభిషేక సేవాకర్తలకు మాత్రం గర్భాలయంలోకి నిర్ణీత సమయంలో అనుమతించారు. 800లకు పైగా అభిషేకాలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉచిత దర్శన క్యూల ద్వారా దర్శించుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టగా, రూ.150 ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఉచిత ప్రత్యేక దర్శనం క్యూలలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దీంతో పాటు మంచినీరు, పిల్లలకు, వృద్ధులకు బిస్కెట్లు, సాంబారన్నం మొదలైన వాటిని అందజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉం చుకుని అన్నపూర్ణభవన్‌లో ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు నిరంతరంగా భోజన వితరణ జరిగేలా ఈఓ భరత్‌గుప్త ఏర్పాట్లు చేశారు. కాగా సాక్షిగణపతి, హఠకేశ్వరం తదితరప్రదేశాల వద్ద ట్రాఫిక్‌జామ్ తలెత్తింది. -
శ్రీగిరి..భక్తజన ఝరి!
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో శనివారం రాత్రి శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వద్ద వందలాది మంది భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద కళాకారులు ప్రదర్శించిన.. పార్వతీ కల్యాణం, భక్తకన్నప్ప తదితర నృత్యరూపకాలు అలరించాయి. -
కట్టలు తెగిన అవినీతి
– బయటపడుతున్న శ్రీశైలం మాజీ ఈవో అక్రమాలు – కర్నూలులో లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు – రూ. 40,47,500 నగదు, ముప్పావు కిలో వెండి స్వాధీనం – గుంటూరులో మూడో లాకర్ తెరుస్తామన్న ఏసీబీ డీఎస్పీ కర్నూలు(టౌన్): శ్రీశైలం మాజీ ఈవో కంచర్ల సాగర్‌బాబు అక్రమ ఆస్తులు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. గురువారం విజయవాడలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆధికారులు శుక్రవారం కూడా కొనసాగించారు. కర్నూలు బీక్యాంపు విజ్ఞాన మందిరం ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో లాకర్‌ను తెరవగా అక్రమ ఆస్తులు వెలుగుచూసాయి. ఏసీబీ ప్రత్యేక బందానికి చెందిన డీఎస్పీ రమాదేవి నేతత్వంలో ఇద్దరు ఎస్ఐలు, సిబ్బంది, శ్రీశైలం మాజీ ఈవో సాగర్‌బాబుతో కలిసి మధ్యాహ్నం 2.50 గంటలకు బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ సుబ్రమణ్యాన్ని కలిసి అకౌంట్, లాకర్ వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకులో సాగర్‌బాబు తన భార్యపేరు మీద జాయింట్ అకౌంట్‌తో లాకర్ ఉంచారు. దాన్ని తెరువగా వెయ్యి, ఐదువందల నోట్ల కట్టలు కనిపించాయి. ట్రేలలో తెచ్చి ఎంచేందుకు వీలు కాకపోవడంతో మనీ కౌంటింగ్ మిషన్ ద్వారా వాటిని లెక్క కట్టారు. రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం రూ. 40,47,500 నగదు బయట పడింది. అలాగే వెండి భరిణిలు, కప్పులు ఉన్నాయి. వీటి బరువు ముప్పావు కిలో ఉంది. వీటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో మూడో లాకర్ తెరుస్తాం: ఏసీబీ డీఎస్పీ రమాదేవి సాగర్‌బాబుకు సంబంధించి ఇప్పటి వరకు రెండు లాకర్లు తెరిచాం. శనివారం గుంటూరులో ఉన్న మూడో లాకర్‌ను తెరుస్తాం. సాగర్‌బాబు ఆస్తులకు సంబంధించి ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ మాలకొండయ్య ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నాం. విజయవాడ ఆంధ్రా బ్యాంకులో రూ. 49,30,000 నగదు, 36 తులాల బంగారం బయట పడింది. రెండు లాకర్ల ద్వారా ఇప్పటి వరకు రూ. 89,50,000 నగదును సీజ్ చేశాం. మూడో లాకర్ సాగర్‌బాబుకు బినామీగా వ్యవహరిస్తున్న శ్రీశైలం ఉద్యోగి శ్రీనివాసరావు పేరు మీద ఉంది. నగదు కాకుండా ఆరు ప్లాట్లు, జిప్లస్ 1 ఇల్లు, స్కార్పియో, ఇండికా కార్లు, నాలుగు ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించాం. సాగర్‌బాబు అవినీతికి సంబంధించి ఏవైనా వివరాలు ఉంటే నిర్భయంగా ఇవ్వవచ్చు. పేర్లు గోప్యంగా ఉంచుతాం. -
అవినీతి ‘సాగర’ం
శ్రీశైలం మాజీ ఈఓ సాగర్‌బాబు ఇంటిపై ఏసీబీ దాడులు – గతంలో పలు అవినీతి ఆరోపణలు – బినామీగా జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్? – దాడుల సమాచారంతో పరారీ – అంతకు ముందు బ్యాంకు లాకర్ తెరవడంపై అనుమానాలు శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్‌గా, ఆ తర్వాత రీజినల్ జాయింట్ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ఈఓ సాగర్‌బాబు అవినీతి ఎట్టకేలకు బట్టబయలైంది. గురువారం విజయవాడలోని ఈ మాజీ ఈఓ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించడం శ్రీశైలంలో కలకలం రేపింది. అక్కడ లభించిన నగదు, బంగారం, డాక్యుమెంట్లు చూసి భక్తుల గుండె అదురుతోంది. ఆగస్టు 15, 2014లో శ్రీశైలం దేవస్థానం ఈఓగా సాగర్‌బాబు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని మామూళ్లకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగితో పాటు ముగ్గురు కిందిస్థాయి ఉద్యోగులు ఆయనకు సహాయ సహకారాలు అందించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు ఆయనకు అండగా నిలిచినట్లు చర్చ జరుగుతోంది. శ్రీశైలం దేవస్థానం అభివద్ధిలో భాగంగా సుమారు రూ.137 కోట్ల వ్యయంతో చేపట్టిన మాస్టర్‌ప్లాన్ పనుల నిర్వహణలో అడ్డగోలుగా బిల్లులు చెల్లిస్తూ దేవస్థానం ఖజానాకు గండి కొట్టారనే ఆరోపణలను సాగర్‌బాబు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం పలుమార్లు తనిఖీలు చేసి నివేదిక సిద్ధం చేసినా.. ఆ తర్వాత విచారించి వదిలేసినట్లు సమాచారం. అవినీతి మరకలు కొన్ని.. – పాతాళగంగ వద్ద స్నానఘాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, కంట్రోల్ రూమ్ నిర్మాణానికి రూ.5కోట్లతో టెండర్లు పిలువగా.. పనులు పూర్తి కాకుండానే రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు. – స్నాన ఘాట్లకు వెళ్లే దారిలో కొండను తొలగించాలని సొంత నిర్ణయం తీసుకొని సుమారు రూ.3కోట్ల దుర్వినియోగం. – రెండేళ్ల వ్యవధిలో మాస్టర్ ప్లాన్ పనుల్లో ఒక్కటీ పూర్తి చేయలేకపోవడం. – రింగ్ రోడ్డు, అంతర్గత రహదారులకు గ్రావెల్ తరలింపులో ఇష్టారాజ్యం. – దేవస్థానంలో వసతి సౌకర్యాల కొరత ఉండడంతో క్వార్టర్స్ కేటాయింపు విషయంలో ఒక్కో గృహం కేటాయింపునకు రూ.లక్ష వరకు లబ్ధి. – కల్యాణ కట్ట వద్ద 50 మందికి పైగా క్షురకుల నియామకానికి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకు పైగా వసూలు. – శానిటేషన్ విభాగంలో 10 మంది ఔట్ సోర్సింగ్ స్వీపర్ల నుంచి రూ.లక్ష వరకు వసూలు. – రూ.14.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పిలిగ్రిం షెడ్ల నిర్మాణంలో పనులు పూర్తి కాకపోయినా బిల్లుల చెల్లింపుతో నిధుల స్వాహా. అర్చక, పరిచారక నియామకాల్లో.. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో పనిచేయడానికి అర్చక, పరిచారక నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే చర్చ జరిగింది. ఈ విషయంపై కేసు పెండింగ్‌లో ఉండగానే కమిషనర్ అనుమతి తీసుకోకుండానే వారిని రెగ్యులర్ ప్రాతిపదికపై నియమించారు. ఒక్కో అర్చకుడు, పరిచారకుడి నుంచి రూ.లక్ష మొదలు రూ. 2లక్షల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016 మార్చి నెలలో నూతన అర్చకులను గర్భాలయంలో విధులు నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చినందుకు రూ.4లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. అప్పటికే ఆలయంలో ఉన్న వారు ముడుపులు ఇచ్చుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్గత బదిలీల్లోనూ చేతివాతం అంతర్గత బదిలీల్లోనూ ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. అర్హత లేని టెక్నికల్ ఉద్యోగులలో ఇద్దరికి అర్హతను ఆపాదించి వారి చేత రూ.కోట్లలో బిల్లులు చెల్లించిన విషయమై విచారణ కూడా జరుగుతోంది. అన్నదాన విభాగంలో ఒక వ్యక్తిని తొలగంచి ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు రూ.4లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీగా మారిన జూనియర్ అసిస్టెంట్ కన్సాలిడేటెడ్ పే కింద కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిన వ్యక్తి అనంతర కాలంలో జూనియర్ అసిస్టెంట్‌గా పదొన్నతి పొందాడు. అతడిని బినామీగా మార్చుకుని దేవస్థానం గోశాలలో పేపర్ ప్రకటన ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఐదు పోస్టులను సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల వరకు జూనియర్ అసిస్టెంట్ ద్వారా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాగర్‌బాబు ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు.. శ్రీశైలంలోని బినామీ వ్యవహారం తెలిసి ఇక్కడికి రాగా శ్రీనివాస్ తెలివిగా తప్పించుకున్నట్లు సమాచారం. విషయం ముందుగానే తెలుసుకున్న ఆ వ్యక్తి శ్రీశైలం ఆంధ్రా బ్యాంక్‌లోని లాకర్‌ను గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు తెరచి విలువైన డాక్యుమెంట్లను తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. -
ఉత్సవ ‘జలధి’ తరంగ
-
కృష్ణ..కృష్ణా!
భద్రత గాలికి.. – స్వయంగా ఎస్పీ సూచనలూ మినిట్స్‌లో చేరని వైనం – పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పరిస్థితి – ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీఎస్ఐ టీం – రక్షణ గోడ, ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని అభిప్రాయం? – త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతను గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. స్వయంగా జిల్లా పోలీస్ బాస్(ఎస్పీ) చేసిన సూచనలను, ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో చేపడుతున్న పనులతో పాటు ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యాలు.. ఏదైనా అనుకోని ఘటన జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఆయన చేసిన సూచనలను విస్మరించినట్లు సమాచారం. ఫలితంగా ఇప్పటికే కొండచరియలు విరిగిపడి అదష్టవశాత్తూ ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు కానీ.. రానున్న రోజుల్లోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగితే మాత్రం పుష్కర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు స్వయంగా ఎస్పీ చేసిన సూచనలను కూడా సమావేశపు వివరాల నమోదు ప్రక్రియ(మినిట్స్)లో చోటు కల్పించలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ చేసిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. మరోవైపు కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని డీఐజీ కూడా మంగళవారం సందర్శించారు. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నుంచి కూడా ప్రత్యేకంగా ఒక నిపుణుల బందం వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించింది. రక్షణగోడను నిర్మించాల్సిందే.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నుంచి కూడా నిపుణులతో కూడిన ఒక టీం వచ్చి శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని మంగళవారం సందర్శించింది. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి? ఏం చేయాలని అంశాలపై వెంటనే నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఈ కొండ చరియల ప్రాంతంలో కొద్ది భాగం వరకు రక్షిత గోడను(వాల్) నిర్మించాలని.. మరికొద్ది ప్రాంతం వరకు ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని జీఎస్ఐ టీం కూడా ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు సమాచారం. లేనిపక్షంలో ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్ఐ ప్రతినిధి బృందం కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా ఆగస్టులో జరిగే పుష్కరాల సందర్భంగా భారీ వర్షాలు వస్తే కొండచరియలు విరిగేపడే ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే రక్షణగోడ నిర్మాణంతో పాటు ఐరన్‌మెష్ ఏర్పాటు పనులను ప్రారంభించాలని సూచించనున్నట్టు సమాచారం. ఎస్పీ సూచనలు కొన్ని.. వాస్తవానికి పుష్కరాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుమారు 25 అంశాలను పలు సమావేశాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ) ఆకే రవికష్ణ పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా.. – కొండచరియలు విరిగిపడకుండా రక్షణగోడ, ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలి. – పాతాళగంగకు వెళ్లేందుకు ఉపయోగించే రోప్‌వే కండిషన్లో ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం ఏపీ టూరిజం అధికారులకు లేఖ రాసి కండిషన్లో ఉన్నట్టు ఒక లేఖను పొందాలి. – పాతాళగంగ వద్ద అత్యవసరంగా ఎవరైనా భక్తుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా అక్కడ రెండు అంబులెన్సులను ఏర్పాటు చేయాలి. – ఏదైనా అనుకోని ఘటన జరిగి ప్రమాదం సంభవిస్తే అత్యవసర వైద్యానికి తరలించేందుకు వీలుగా హెలీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయాలి. – ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. అందువల్ల ఎక్స్–రే బ్యాగేజీని ఏర్పాటు చేసుకోవాలి. – అదేవిధంగా ఆలయానికి సమీపంలోనే సామాన్లు భద్రత పరిచే గది ఉంది. దీనిని దూరంగా ఏర్పాటు చేయాలి. – ఘాట్ల వద్ద పనులను వెంటనే పూర్తి చేసి పోలీసులకు అప్పగించాలి. తద్వారా అక్కడ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పూర్తిచేస్తాం. – శ్రీశైలంలో ఏర్పాటు చేసే 30 పడకల ఆసుపత్రిలో సర్జరీ చేసే సదుపాయంతో పాటు నిపుణులైన డాక్టర్లను ఏర్పాటు చేయాలి. అధికారుల నిర్లక్ష్యం భద్రత విషయంలో ఎస్పీ చేసిన అనేక సూచనలను కనీసం సమావేశపు మినిట్స్‌లోనూ సంబంధిత అధికారులు పేర్కొనలేదంటే భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాను సూచించిన అంశాలను మినిట్స్‌లో ఎందుకు పేర్కొనలేదో వివరణ ఇవ్వాలని శ్రీశైలంలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రవికృష్ణ సీరియస్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పుష్కర భక్తుల భద్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పుష్కర విధులకు 124 మంది అధికారులు
కర్నూలు(న్యూసిటీ): కృష్ణా పుష్కరాల్లో విధులను నిర్వహించటానికి దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ.. 124 మందిని నియమించారు. ఈ మేరకు కర్నూలులోని కష్ణానగర్‌లో ఉన్న దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆగస్టు 12 నుంచి కష్ణానది పురష్కరాలు నిర్వహించనుఆన్నరు. దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యనిర్వహణాధికారులు, మినిస్ట్రీరియల్ సిబ్బంది, ఇన్స్పెక్టర్లు కలిసి 99 మందిని, అదనంగా మరో 25 మందిని కూడా నియమించామని ఉప కమిషనర్ గాయత్రిదేవి తెలిపారు. శ్రీశైలం, సంగమేశ్వరం, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో కష్ణానదీ పుష్కర ఘాట్లలో వీరు పని చేస్తారని పేర్కొన్నారు. అలాగే పుష్కరాలలో భక్తులతో పూజలు, పిండ ప్రదాన కార్యక్రమాలకు గాను 447 మంది అర్చకులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. -
కలెక్టర్ సీరియస్
– ఉదయం 8 గంటలకే పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్న కలెక్టర్ – ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసంతప్తి – కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం శ్రీశైలం : కృష్ణా పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండటంతో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, తహసీల్దార్ విజయుడుతో కలిసి ఆయన గురువారం ఉదయం 8 గంటలకు రోప్‌వే ద్వారా పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఏమాత్రం పనులు జరగక పోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచి సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు. ఇలా వ్యవహరిస్తే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కర పనులకు కేటాయించిన కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తుండడంతో అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించాల్సిందిగా సూచించారు. అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించినా రాకపోవడంతో సదరు కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాన ని హెచ్చరించారు. రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్ల పనులను పూర్తి చేస్తున్నారని అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులను అడుగగా, వారు తెల్ల మోహం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి లింగాలగట్టు వద్ద జరుగుతున్న ఘాట్ల నిర్మాణపు పనులను పరిశీలించారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో కలెక్టర్‌కే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అనంతరం టెలీకాన్ఫరెన్స్ ఉండడంతో తహసీల్దార్ కార్యాలయం చేరుకుని అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలానికి వస్తామని పనులు వేగవంతం చేసి డైలీ రిపోర్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.