కర్నూలు(న్యూసిటీ): కృష్ణా పుష్కరాల్లో విధులను నిర్వహించటానికి దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ.. 124 మందిని నియమించారు. ఈ మేరకు కర్నూలులోని కష్ణానగర్‌లో ఉన్న దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆగస్టు 12 నుంచి కష్ణానది పురష్కరాలు నిర్వహించనుఆన్నరు. దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యనిర్వహణాధికారులు, మినిస్ట్రీరియల్ సిబ్బంది, ఇన్‌స్పెక్టర్లు కలిసి 99 మందిని, అదనంగా మరో 25 మందిని కూడా నియమించామని ఉప కమిషనర్ గాయత్రిదేవి తెలిపారు. శ్రీశైలం, సంగమేశ్వరం, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో కష్ణానదీ పుష్కర ఘాట్లలో వీరు పని చేస్తారని పేర్కొన్నారు. అలాగే పుష్కరాలలో భక్తులతో పూజలు, పిండ ప్రదాన కార్యక్రమాలకు గాను 447 మంది అర్చకులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు.