Puskara
-
పుష్కరాలకు మంచి ఆతిథ్యాన్నిద్దాం
విజయవాడ(వన్‌టౌన్) : కృష్ణా పుష్కరాలకు మంచి ఆతిథ్యాన్నిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆధునికీకరించిన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. సుమారు ఎనిమిది కోట్లతో కళాక్షేత్రం ప్రాంగణాన్ని ప్రభుత్వం ఆధునికీకరించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ పన్నెండు రోజులూ పుష్కరాలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పుష్కర స్నానం చేసేందుకు నగరానికి వచ్చే భక్తులకు ప్రజలందరూ ఆత్మీయ స్వాగతం పలకాలన్నారు. ఇటువంటి వేదికలు మరిన్ని రావాల్సి ఉందన్నారు. నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించేందుకు ఒక మంచి వేదిక అన్నారు. శుక్రవారం నుంచి పన్నెండు రోజుల పాటు రాష్ట్రానికి దశ, దిశ నిరే్ధశం చేసే 12 అంశాలపై చర్చా గోషు్ఠలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ధరలు పెంచితే చర్యలు పుష్కరాలు అవకాశంగా తీసుకొని కొంత మంది వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హుదూద్ తుఫాన్ సందర్భంగా విశాఖ నగరంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించగా దానిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. విజయవాడ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీ నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని, నగర మేయర్ కోనేరు శ్రీధర్ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియాన్ పాల్గొన్నారు. -
జిల్లాలో పుష్కర శోభ
ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద ఏర్పాట్లు పూర్తి విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న నగరం ఆకట్టుకున్న శోభా యాత్ర నేటి ఉదయం నుంచే పుణ్య స్నానాలు సాక్షి, అమరావతి : జిల్లా పుష్కర శోభ సంతరించుకొంది. శుక్రవారం ఉదయం నుంచి ఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారులు ఘాట్లను, తుది ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని ఘాట్లలో మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకాధికారులు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అన్ని ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు, ఫైర్, శానిటేషన్, విద్యుత్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూస్, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేసి ఉంచారు. పుష్కరనగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద పటిష్ట బందోబస్తును గురువారం రాత్రి నుంచే సిద్ధం చేసి ఉంచారు. గుంటూరు జిల్లాలో నదితీరం వెంబడి ఘాట్ పరిసర ప్రాంతాలు కొత్త కాంతులతో వెలుగొందుతున్నాయి. ఘాట్ల వద్దకు శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా జలాలు పుష్కలంగా చేరుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజి వద్ద కృష్ణమ్మకు అడ్డుకట్ట వేయడంతో కింది ప్రాంతంలో ఉన్న ఘాట్లకు నీటి సమస్య తలత్తే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ను పోలీసులు ఎక్కడికక్కడ క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరనగర్‌లో పార్కింగ్ ప్రదేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. పుష్కర నగర్లలో భక్తులకు ఉచిత అన్న ప్రసాదం శుక్రవారం ఉదయం నుంచే అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ మూడు ఘాట్లపైనే ఫోకస్... జిల్లాలో అమరావతి, సీతానగరం, పెనుమూడి ఘాట్లపైనే దృష్టి పెట్టారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ఘాట్లను పలుమార్లు పరిశీలించి అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ ఘాట్ల ఏర్పాట్లపై ఆరాతీసినట్లు సమాచారం. సీఎం అమరావతి ఘాట్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎక్కువ శాతం భక్తులు ఈ ఘాట్లలో స్నానాలు చేసేందుకు వస్తారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. దీనికితోడు తాళ్ళాయపాలెం ఘాట్‌కు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుదని అంచనా వేస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్‌వైపు కృష్ణవేణి ఘాట్‌కు భక్తుల తాకిడి ఉంటుందని అ«ధికారులు పేర్కొన్నారు. కళాకారులతో శోభా యాత్ర... జిల్లాలో పుష్కరాల సన్నాహకాలలో భాగంగా గుంటూరు నగరంలో గురువారం శోభా యాత్ర నిర్వహించారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విభిన్న వేషదారణలతో వందలాదిమంది కళాకారులు శోభాయాత్రలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ, డప్పు వాయిద్యాలతో కళాకారులు సందడి చేశారు. చెక్కభజన, విద్యార్థుల సాంస ్కతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. నగరంలో విద్యుత్ కాంతులకు తోడు కళాకారుల ప్రదర్శనలు పుష్కర శోభను తెచ్చాయి. -
పుష్కర శోభా యాత్ర
-
5 నుంచి పురోహితులకు శిక్షణ
పాత గుంటూరు : కృష్ణా పుష్కరాల్లో పాల్గొనే పురోహితులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఈ నెల 5, 6 తేదీల్లో గుంటూరు, తెనాలి, గురజాల ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ డైరెక్టర్ సి.విజయరాఘవాచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులతో పాటు, పురోహితులకు గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. పుష్కరాల్లో పిండప్రదానం కోసం దరఖాస్తు చేసుకున్న పురోహితులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని సూచించారు. రెండు గంటలసేపు శిక్షణ పొంది ఐడెంటిటీ కార్డులు పొందాలని కోరారు. ఈ నెల 5 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గుంటూరు టీటీడీ కల్యాణమండపంలో, సాయంత్రం తెనాలి వైకుంఠపురం లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో, 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గురజాలలోని శ్రీపాతపాటేశ్వరి అమ్మవారి కల్యాణ మండపం లో శిక్షణ తరగతులుంటాయని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లోని పురోహితులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. -
పుష్కరాల ముసుగులో దోపిడీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు పెనుమూడి (రేపల్లె) : పుష్కరాల ముసుగులో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు దోపిడీకి తెగబడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. మండలంలోని పెనుమూడి పుష్కర ఘాట్ పనులను సోమవారం ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. నామినేషన్ పద్ధతిపై పుష్కరాల పనులకు కేటాయించిన వందల రూ. కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శించారు. పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమౌతాయో ముందుగానే తెలిసినప్పటికీ పథకం ప్రకారం పనుల కేటాయింపులో తాత్సారం చేసి హడావుడి పనులతో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లపాటు మన్నికగా ఉండాల్సిన పనులను నాణ్యతా లోపాలతో నిర్మించడంతో గోదావరి పుష్కరాల సమయంలో నిర్వహించిన వందల కోట్ల రూపాయల పనులు వృథాగా మారాయన్నారు. బినామీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి కోట్లాది రూపాయలను పాలకపార్టీ నాయకులు అడ్డదారిలో దోపిడీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కళ్లు తెరచి పుష్కర పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హితవు పలికారు. -
పుష్కర విధులకు 124 మంది అధికారులు
కర్నూలు(న్యూసిటీ): కృష్ణా పుష్కరాల్లో విధులను నిర్వహించటానికి దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ.. 124 మందిని నియమించారు. ఈ మేరకు కర్నూలులోని కష్ణానగర్‌లో ఉన్న దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆగస్టు 12 నుంచి కష్ణానది పురష్కరాలు నిర్వహించనుఆన్నరు. దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యనిర్వహణాధికారులు, మినిస్ట్రీరియల్ సిబ్బంది, ఇన్స్పెక్టర్లు కలిసి 99 మందిని, అదనంగా మరో 25 మందిని కూడా నియమించామని ఉప కమిషనర్ గాయత్రిదేవి తెలిపారు. శ్రీశైలం, సంగమేశ్వరం, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో కష్ణానదీ పుష్కర ఘాట్లలో వీరు పని చేస్తారని పేర్కొన్నారు. అలాగే పుష్కరాలలో భక్తులతో పూజలు, పిండ ప్రదాన కార్యక్రమాలకు గాను 447 మంది అర్చకులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. -
పుష్కరాల రోజుల్లో సీఎం రూటు ఎటో?
ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కరాలు జరిగే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే మార్గంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉంటున్న విషయం విదితమే. ఆగస్టు 12వ తేదీ నుంచి పుష్కరాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. పుష్కరాల రోజుల్లో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ, సీతానగరం ప్రాంతంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సీఎం నివాసం నుంచి ప్రస్తుతం ఆయన ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం అయితే లక్షలాది మంది భక్తుల మధ్య సీఎం ప్రయాణం చేయడం ఆయన భద్రతకే ప్రమాదమని పలువురు అధికారులు భావిస్తున్నారు. మరి తాడేపల్లి బైపాస్ రోడ్డుకు వెళ్లాలంటే ఉన్న రెండు మార్గాలు కూడా పూర్తి కాలేదు. మొదట అధికారులు పుష్కరాలు ప్రారంభం అయితే ఉండవల్లి సీఎం నివాసం వద్ద నుంచి ఉండవల్లి, ఉండవల్లి సెంటర్, స్క్రూబ్రిడ్జి, ఎన్టీఆర్ కట్ట మీదుగా బైపాస్ రోడ్డుకు వెళ్లి విజయవాడ క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ కరకట్ట విస్తరణ పనులు ఆఘమేఘాలపై చేపట్టారు. పనులు చేస్తుండగానే సీఎం నివాసం నుంచి క్యాంపు ఆఫీసు వరకు తాడేపల్లిలోని సేఫ్టీ హౌస్, ఓ కార్పొరేట్ ఆసుపత్రి వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎన్టీఆర్ కరకట్ట ఎర్త్ వర్క్‌లే జరుగుతున్నాయి. దాదాపుగా రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రహదారి నిర్మాణం మరో 18 రోజుల్లో పూర్తి అవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క రోజు వర్షం కురిసినా, నాలుగైదు రోజుల పనులకు అంతరాయం కలుగుతోంది. ఇదిలాఉంటే తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి కొత్తూరు మీదుగా పశువుల ఆసుపత్రి బ్రిడ్జి దాటి బైపాస్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంది. ఈ రహదారిలో తాడేపల్లి, కష్ణా కెనాల్, కొలనుకొండ ప్యారీ కంపెనీలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ నుంచి భక్తులు ఈ ప్రాంతం గుండానే ప్రయాణం సాగించాల్సి ఉంది. అటు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద, ఇటు సీతానగరం వద్ద, కొత్తూరులో భక్తులను సీఎం వచ్చే సమయంలో ఆపితే వేలాది మంది భక్తులకు అసౌకర్యం ఏర్పడుతుంది. ప్రకాశం బ్యారేజి దగ్గర నుంచి విజయవాడ వెళ్లే సమయంలో అర్ధగంట ట్రాఫిక్ ఆపితేనే ప్రస్తుతం వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. పుష్కరాల సమయంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపితే, తోపులాట జరిగి రాజమండ్రి లాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే రానున్న పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూటు ఎటో అర్థం కాక భద్రత సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. -
పనులు వేగంగా పూర్తి చేయండి
విజయపురి సౌత్: పుష్కరఘాట్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. విజయపురి సౌత్‌లోని దేశాలమ్మ గుడి, కృష్ణవేణి ఘాట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. ఈ మేరకు డీఈ Ðð ంకటేశ్వరరావును పనులపై ప్రశ్నించారు. భక్తులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని కోరారు. -
పుష్కరాలకు ఐదు లాంచీలు సిద్ధం
విజయపురిసౌత్: మండలంలోని ఎత్తిపోతల, విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్‌ను పర్యాటక అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. అనంతరం లాంచీస్టేషన్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ పుష్కరాలలోపు ఐదు లాంచీలను పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. లాంచీలకు నాగసిరి ఇంటీరియర్ డెకరేషన్, పెయింటింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎత్తిపోతల వసతి గృహాల్లో ఏసీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటర్‌ఫాల్స్ వద్ద మరమ్మతులకు గురైన లైటింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం మేకలగొందిలో లాంచీలను పరిశీలించారు. ఆయన వెంట పర్యాటక అభివృద్ధి సంస్థ డీవీఎం శ్యాంప్రసాద్, లాంచీ యూనిట్æమేనేజర్ వీ సూర్యచందర్‌రావు, ఎత్తిపోతల మేనేజర్ దత్తు ఉన్నారు.