5 నుంచి పురోహితులకు శిక్షణ
Published Mon, Aug 1 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
పాత గుంటూరు : కృష్ణా పుష్కరాల్లో పాల్గొనే పురోహితులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఈ నెల 5, 6 తేదీల్లో గుంటూరు, తెనాలి, గురజాల ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ డైరెక్టర్ సి.విజయరాఘవాచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులతో పాటు, పురోహితులకు గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. పుష్కరాల్లో పిండప్రదానం కోసం దరఖాస్తు చేసుకున్న పురోహితులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని సూచించారు. రెండు గంటలసేపు శిక్షణ పొంది ఐడెంటిటీ కార్డులు పొందాలని కోరారు. ఈ నెల 5 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గుంటూరు టీటీడీ కల్యాణమండపంలో, సాయంత్రం తెనాలి వైకుంఠపురం లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో, 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గురజాలలోని శ్రీపాతపాటేశ్వరి అమ్మవారి కల్యాణ మండపం లో శిక్షణ తరగతులుంటాయని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లోని పురోహితులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
Advertisement