archakas
-
రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం
రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా ఎంపిక అయిన అర్చక అభ్యర్థులు బుధవారం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరికీ నేటి నుంచి అంటే గురువారం నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఈ ఆరు నెలల శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులకు శ్రీరామ జన్మభూమి ఆలయంతో పాటు ఇతర దేవాలయాలలో అర్చకులుగా నియమించనున్నారు. మరోవైపు శిక్షణ కార్యక్రమాలకు వచ్చిన అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తమకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ సమయంలో ప్రతి అర్చక అభ్యర్థికి నెలకు రూ. 2,000 ఇవ్వనున్నారు. అర్చక శిక్షణకు వచ్చిన అభిషేక్ పాండే మాట్లాడుతూ శ్రీరాముని ఆరాధనా విధానం, పూజలు మొదలైన వాటిపై తమకు శిక్షణ అందిస్తున్నారన్నారు. కాగా అర్చక అభ్యర్థులకు శిక్షణ సమయంలో అర్హత కలిగిన ఆచార్యుల దగ్గర సమస్త ఆచార వ్యవహారాలు నేర్పించనున్నారు. అయోధ్యలో రామాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
బ్రహ్మణేతర అర్చకులు.. స్టాలిన్ సర్కార్‌కు నోటీసులు
ఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా.. నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, బ్రహ్మణేతరులను ఆలయ అర్చుకులుగా నియమించడం లాంటి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్ వేశారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన. ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అయితే.. ఈ నియామకాలపై బీజేపీ నేత స్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తండ్రి కరుణానిధిలాగే.. తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ‘‘స్టాలిన్.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్ 2014లో సభనాయాగర్ నటరాజ్ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదీ చదవండి: ఇంటి నుంచి వెళ్లగొట్టారు.. ఆజాద్ ఆవేదన -
1,840 ఆలయాలకు ధూప దీప నైవేద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,840 దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమల్లో ఉన్న 1,805 దేవాలయాలతోపాటు మరో 3 వేల ఆలయాల్లో అమలు చేయాల్సి ఉందని, తొలిదశలో భాగంగా 1,840 దేవాలయాలకు వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధూప, దీప, నైవేద్య పథకం కింద చేసే ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోకపోతే ఆ గుడికి ఎప్పుడైనా సాయా న్ని నిలిపేస్తామన్నారు. ధూప దీప నైవేద్య పథకాన్ని సెప్టెంబర్ నుంచే వర్తింపజేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే దేవాలయాలకు పునర్వైభవం వచ్చి ందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 66 బంజారా దేవాలయాల్లోని పూజారులు, బావోజీలు, సాధు సంతులకు చోటు కల్పించినట్లు వెల్లడించారు. విశ్వకర్మల, మార్కండేయ దేవాలయా ల్లోని అర్చకులకూ గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పా రు. కొత్తగా ఇచ్చిన 1,840 ఆలయాలకు ఏడాదికి రూ.14.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 3,645 ఆలయాల అర్చకులకు ఏడాదికి రూ.27.5 కోట్లను గౌరవవేతనం ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 కొత్త ఆలయాల నిర్మాణంతోపాటు జీర్ణోధరణకు సర్వ శ్రేయో నిధి నుంచి రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. -
5 నుంచి పురోహితులకు శిక్షణ
పాత గుంటూరు : కృష్ణా పుష్కరాల్లో పాల్గొనే పురోహితులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఈ నెల 5, 6 తేదీల్లో గుంటూరు, తెనాలి, గురజాల ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ డైరెక్టర్ సి.విజయరాఘవాచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులతో పాటు, పురోహితులకు గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. పుష్కరాల్లో పిండప్రదానం కోసం దరఖాస్తు చేసుకున్న పురోహితులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని సూచించారు. రెండు గంటలసేపు శిక్షణ పొంది ఐడెంటిటీ కార్డులు పొందాలని కోరారు. ఈ నెల 5 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గుంటూరు టీటీడీ కల్యాణమండపంలో, సాయంత్రం తెనాలి వైకుంఠపురం లక్ష్మీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో, 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గురజాలలోని శ్రీపాతపాటేశ్వరి అమ్మవారి కల్యాణ మండపం లో శిక్షణ తరగతులుంటాయని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లోని పురోహితులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.