శ్రీగిరి..భక్తజన ఝరి!
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో శనివారం రాత్రి శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వద్ద వందలాది మంది భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద కళాకారులు ప్రదర్శించిన.. పార్వతీ కల్యాణం, భక్తకన్నప్ప తదితర నృత్యరూపకాలు అలరించాయి.