'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు' | Telangana state formation in january, says Palvai Govardhan Reddy | Sakshi
Sakshi News home page

'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు'

Published Fri, Nov 29 2013 2:34 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు'

'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు'

కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఏమీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్రెడ్డి అభిప్రాయపడ్డారు.

కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఏమీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పని వ్యాఖ్యానించారు.

 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ట్రిబ్యునల్ ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జనవరిలో ఏర్పడుతుందని పాల్వాయి గోవర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని తెలిపారు. మూడు రోజులపాటు టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement