Telugu Ganga
-
సుజల సీమ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి దుర్భిక్ష రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తుండటంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోతలను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు రెండో టన్నెల్‌ను పూర్తి చేసి గాలేరు–నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు మూడు టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి నాడు నెలకొంది. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఉత్పన్నమైంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్) నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను సీఎం పూర్తి చేశారు. దీంతో 2019 నుంచి వరుసగా ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021–22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ► అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్ (పెలుసుమట్టి)లో పనులను చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక టన్నెల్లో కాలువ (లూప్)తో సరిపుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోకపోవడంతో నాడు కేవలం నాలుగైదు టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించకకుండా, ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు 10వేల క్యూసెక్కులను తరలించేలా సిద్ధం చేశారు. రెండో సొరంగం ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా చేస్తున్నారు. అవుకు మూడో సొరంగం పూర్తి కావస్తోంది. వెయ్యి కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను మూడేళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (6టీఎంసీలు), వామికొండసాగర్(1.6టీఎంసీలు), సర్వారాయసాగర్ (3.06 టీఎంసీలు)లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేçస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. ► దివంగత వైఎస్సార్ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను చేపట్టారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరిని అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు. హక్కుల పరిరక్షణ ► విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నాగార్జున సాగర్ స్పిల్‌వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశం ఇచ్చారు. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చేపట్టారు. ఇది పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజామద్దతు పెరిగి రాజకీయంగా తనకు నష్టం చేకూర్చుతుందనే ఆందోళనతో బాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడ్డారు. సీఎం ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తూ పనులను శరవేగంగా పరుగులెత్తిస్తున్నారు. -
చెన్నైకి తెలుగుగంగ జలాలు
రాపూరు/తిరుపతి అర్బన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెలుగు గంగలో ప్రధాన భాగమైన కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి సోమవారం చెన్నై నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు జలాలను విడుదల చేశారు. తెలుగు గంగ చీఫ్ ఇంజినీర్ హరినారాయణరెడ్డి కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి మూడో గేట్‌ను ఎత్తి నీటిని వదిలారు. అనంతరం హరినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నై నగర వాసులకు నీటిని విడుదల చేస్తున్నామని, సెప్టెంబర్ వరకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. జలాశయం నుంచి మొదటిసారిగా రెండో పంటకు నీరు విడుదల చేసినట్టు తెలిపారు. సుమారు రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు 20 టీఎంసీలు విడుదల చేస్తున్నామన్నారు. సోమశిల నుంచి కండలేరుకు వచ్చే నీటి కాలువ వెడల్పు పెంచే పనులు ప్రారంభమయ్యాయని, మూడేళ్లలో ఇవి పూర్తవుతాయని హరినారాయణరెడ్డి వివరించారు. -
రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్
-
సీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నేలటూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్టు తెలిపారు. దువ్వురు నుంచి బ్రహ్మంసాగర్ నీటి తరలింపుతో తెలుగుగంగా ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని అన్నారు. బ్రహ్మంసాగర్ కింద 90 వేల ఎకరాలను నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. (మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్) సభలో సీఎం ప్రసంగిస్తూ.. ‘బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీ లు పూర్తి సామర్థ్యం వైఎస్సార్ హయాంలో జరిగింది. గతంలో భారీ వరదలు వచ్చినా డ్యాంలు నిండలేదు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు కింద 90 వేల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల కేటాయింపు చేస్తాం. 2008లో వైఎస్సార్ జారీ చేసిన 224 జీవోపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. కుందూ నదిపై చేపట్టిన మూడు ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు మేలు జరుగుతుంది. రూ.2300 కోట్ల తో ఈ పనులు చేపడుతున్నాం. ఈ ఏడాది భారీ వరదలు రావడంతో.. శ్రీశైలం గేట్లు ఎనిమిది సార్లు ఎత్తాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. వరద నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రధాన ప్రాజెక్టు కాలువలను వెడల్పు చేయలేదు. అందుకే వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. రాయలసీమ ఇరిగేషన్ కాలువల సామర్థ్యం చంద్రబాబు పెంచి ఉంటే వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే వాళ్లం. రూ.23000 కోట్ల రూపాయలతో సీమలోని అన్ని సాగునీటి కాలువ సామర్థ్యం పెంచుతున్నాం. మొత్తం 60 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడుతున్నాం. గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్తోంది. కృష్ణ, గోదావరి జలాలతో ఏపీని సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు’ అని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా జోలరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టి.. వరద సమయంలో 8 టీఎంసీ ల నీటిని దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే కేసీ, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2234 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. దీంతో రాయలసీమకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పచ్చ నేత చెరవీడిన తెలుగు గంగ స్థలం
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధికారంలో ఉండగా నేతలు దర్జాగా ఆక్రమించిన స్థలాలను అధికారులు స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. సత్యవేడులో మూడు కోట్ల విలువైన తెలుగుగంగ స్థలాన్ని పచ్చపార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ మస్తాన్ యాదవ్ గతంలో ఆక్రమించిచాడు. తెలుగు గంగ అధికారులు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా మస్తాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా పోలీసుల పహారాలో ప్రహరీ గోడను అధికారులు శనివారం కూల్చివేశారు. -
నీరు పుష్కలం.. ప్రాజెక్టు నిష్ఫలం
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుగంగ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు విడుదల చేసినా.. బద్వేలు, మైదుకూరు నియోకవర్గాల్లోని ఆయకట్టుకు సక్రమంగా నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం అట్లూరు, పోరుమామిళ్ల, కలసపాడు, గోపవరం ప్రాంతాల్లోని ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు తదితర పనులకు కేవలం రూ. 50 కోట్లు కూడా విడుదల చేయలేదు. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుగంగ ›ప్రాజెక్టులో అంతర్భాగమైన 2.133 టీఎంసీల సామర్థ్యం కలిగిన అనుబంధ రిజర్వాయర్(ఎస్ఆర్–1), 2.444 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్ఆర్–2ల తో పాటు 17.730 టీఎంసీల సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌ను నీటితో నింపాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పెండింగ్ పనులు పూర్తి కాకపోడంతో ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారిందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ మొండిచేయి రూ. 50 కోట్ల ఖర్చుతో పూర్తి చేయాల్సిన ప్రధాన కాలువతోపాటు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు పనులను టీడీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మైదుకూరు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో 30వ కిలోమీటరు నుండి 45వ కిలోమీటరు వరకు స్ట్రక్చర్స్, పిల్ల కాలువలు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. కాశినాయన మండలంలో ఎనిమిది పిల్లకాలువల్లో కంపచెట్లు పెరిగాయి. పోరుమామిళ్ల చెరువునుండి ఎడమకాలువను కలిపే అప్రోచ్ కెనాల్ పనులు నిలిచి పోయాయి. పోరుమామిళ్ల బ్లాక్–9 పరిధిలో 9ఏకు సంబంధించి 3.7 కిలోమీటర్లు, చింతలపల్లి నుంచి మార్కాపురం మీదుగా ముద్దంవారిపల్లె వరకు జరగాల్సిన 1.7 కిలోమీటర్ల పనులు మొదలు కాలేదు. 9–బి బ్లాక్ పరిధిలో 2.5 కిలోమీటర్లు, చింతలపల్లి కాలువ కట్ట మీదుగా కట్టకిందపల్లి వరకు 2.5 కిలోమీటర్లు కాలువ పనులకుగాను 1.8 కిలోమీటర్లు పనులు జరగాల్సిఉంది. 9–బి బ్లాక్ పరిధిలో దమ్మనపల్లె నుంచి వీధుళ్లపల్లె మీదుగా రెడ్డికొట్టాల వరకు 7.8 కిలోమీటర్ల కాలువ పనులకు గాను 3.2 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 9–ఎఫ్ పరిధిలో రామాయపల్లెవద్ద 8.5 కిలోమీటర్ల కాలువ పనులు జరగాల్సి ఉండగా ఏడు కిలోమీటర్ల మేర పనులు వెక్కిరిస్తున్నాయి. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాల్సి ఉన్నా అర్ధంతరంగా వదిలేశారు. కలసపాడు మండలం అక్కివారిపల్లె వద్ద కంపచెట్లతో నిండిపోయిన కాలువ నీళ్లొచ్చినా ఆయకట్టుకు అందని దుస్థితి ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు నిండి తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కొన్ని రోజుల్లో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరుతుంది. అయితే పనులు పూర్తికాక పోవడంతో వైఎస్ హయాంలో పూర్తి చేసిన పనుల పరిధిలో 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పనులు పూర్తి చేసిఉంటే బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నదాతలు చెబుతున్నారు. రూ.300 కోట్లతో నీళ్లందించిన వైఎస్సార్ బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే దృక్పథంతో 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. వెంటనే రూ. 300 కోట్లతో ప్రధాన పనులను పూర్తిచేసి మూడోవంతు భూమికి సాగునీరందించి రైతుల్లో ఆనందం నింపారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రయోజనం సున్నా తెలుగుగంగ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కాలువకు నీళ్లు వదులుతున్నా పొలాలకు మాత్రం నీరు రావడం లేదు. ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలే అవకాశమున్నా పిల్లకాలువలను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. దీంతో రైతుల పొలాలకు నీళ్లు అందే అవకాశం లేదు. – వెంకటనారాయణ రెడ్డి, మిద్దెల, కాశినాయన మండలం పిల్లకాలువలు అధ్వానంగా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో పిల్ల కాలువలు నిర్మించలేదు. కొన్ని చోట్ల నిర్మించినా కంపచెట్లు పెరిగి అధ్వానంగా మారాయి. నీళ్లు వదిలినా పొలాలకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఐదారేళ్లుగా ప్రధాన కాలువలకు నీళ్లు వదులుతున్నా చాలా తక్కువగా వస్తున్నాయి. – మునిరెడ్డి, మామిళ్లపల్లె, కలసపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
కృష్ణా వరదను ఒడిసిపట్టి..!
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ముంపు ముప్పు తగ్గడంతోపాటు ప్రాణ నష్టం తప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను నింపుతూనే అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తరలించి తెలుగుగంగలో భాగమైన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, గాలేరు–నగరిలో భాగమైన గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లకు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువన కృష్ణా వరద ఉధృతిని నియంత్రించడం వల్లే ప్రకాశం బ్యారేజీపై పెద్దగా ప్రభావం పడలేదని విశ్లేషిస్తున్నారు. బ్యారేజీలోకి వచ్చిన వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేశారు. ఈనెల 17న బ్యారేజీకి గరిష్టంగా 7.49 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల నది సహజ ప్రవాహానికి అడ్డంకులు తలెత్తాయి. ఫలితంగా బ్యారేజీ ఎగువన వరద నీటి మట్టం పెరిగి కొండవీటి వాగులోకి వరద ఎగదన్ని పెనుమాక, ఎర్రబాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అక్రమ కట్టడాలను తొలగిస్తే వరద ప్రవాహం ఎగదన్నేదే కాదని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సమర్థంగా వరదను నియంత్రించకుంటే 2009 కంటే అధికంగా నష్టం వాటిల్లేదని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. గోదావరి వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు సాధారణంగా అందించే సహాయ ప్యాకేజికి అదనంగా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం తెలిసిందే. బాధితులకు తక్షణమే నిత్యావసరాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్వాసితులను పునరావాస ప్రాంతాలకు తరలించడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంది. హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటి తరలింపు కృష్ణా వరద ఈనెల 1న శ్రీశైలానికి చేరింది. భారీ ప్రవాహం వస్తుండటంతో ఈనెల 6 నుంచే హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు జలాలను తరలించే ప్రక్రియ చేపట్టారు. ఆగస్టు 7 నాటికి శ్రీశైలంలో నీటి మట్టం 870.9 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలింపు మొదలైంది. అదే రోజు కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 10న శ్రీశైలం గేట్లు ఎత్తేశారు. కనీస మట్టం చేరగానే సాగర్ ఆయకట్టుకు విడుదల.. నాగార్జునసాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ఈనెల 8 నాటికి 513.3 అడుగులకు చేరుకోవడంతో కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్‌లో నీటి మట్టం కనీస స్థాయికి చేరుకున్న వెంటనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈనెల 13న సాగర్ 26 గేట్లు ఎత్తేసి దిగువకు వరదను విడుదల చేశారు. అప్పటికి సాగర్‌లో 260.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీపై భారం పడకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా సాగర్ పూర్తి స్థాయిలో నిండకుండానే దిగువకు వరదను విడుదల చేశారు. ఆ తర్వాత వస్తున్న వరదతో సాగర్‌లో ఖాళీని భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని నియంత్రించారు. పులిచింతల ముంపు గ్రామాలను కూడా ముందే ఖాళీ చేయించి ప్రాజెక్టులో గరిష్టంగా 36 టీఎంసీలు నిల్వ చేశారు. -
చెన్నైకు తాగునీరివ్వండి
సాక్షి, అమరావతి : చెన్నై నగరవాసుల తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదేశాల మేరకు తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి, మత్స్య శాఖ, పాలనా సంస్కరణల మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తాగునీరు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని మంత్రులు చెప్పగా.. వైఎస్ జగన్ వెంటనే స్పందించి చెన్నైకి తాగునీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో అన్నారు. కష్టాల్లో పాలు పంచుకోవాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరముందని సీఎం జగన్ వివరించారు. -
నదుల అనుసంధానం బీజేపీ చొరవే: వీర్రాజు
సాక్షి, అమరావతి: కేంద్రం చొరవతోనే రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ పథకం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం శాసన మండలిలో తెలిపారు. గురువారం మండలిలో ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నదుల అనుసంధానం మొదటగా బీజేపీయే ప్రవేశ పెట్టిందని అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1998లోనే నదుల అనుసంధానం కోసం సురేష్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశరని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగానే కాలువలు తవ్వించారని వీర్రాజు పేర్కొన్నారు. పోలవరం మాదిరిగానే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఓ వారం కేటాయించాలని సూచించారు. ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి కారణం బీజేపీయేనని వీర్రాజు తెలిపారు. ఆ మండలాలను ఆంధ్రలో కలపకుంటే కేసీఆర్ పోలవరానికి అడ్డుపడేవాడని ఆయన అన్నారు. -
నీటి కోసం గొడవ
రుద్రవరం: తెలుగుగంగ ప్రధాన కాల్వకు నీటి విడుదల నిలిపి వేయడంతో తుండ్లవాగు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటికోసం పలు గ్రామాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. రుద్రవరం సమీపంలోని తుండ్లవాగు రిజర్వాయర్ వెనక వైపు 21, 22 బ్లాక్ చానల్స్ నుంచి నీరు ప్రవహిస్తుంది. 22వ బ్లాక్ చానల్ కింద టి. లింగందిన్నె, ఆర్. నాగులవరం, తువ్వపల్లె తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుంది. అలాగే 21వ బ్లాక్ చానల్ ద్వారా ఆర్. నాగులవరం, రెడ్డిపల్లె, తువ్వపల్లె, రుద్రవరం, నక్కలదిన్నె, మందలూరు తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. నీటి కోసం రైతులు గొడవలు పడుతూ పోలీసు స్టేషన్లలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి 21వ బ్లాక్ చానల్ ద్వారా రిజర్వాయర్ నీటిని మదంలూరు, నక్కల దిన్నె గ్రామాలకు అందించాలని తెలుగుగంగ అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేసేందుకు సిబ్బంది గేట్లు ఎత్తేప్రయత్నం చేయగా.. రుద్రవరం గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఆదివారం తెలుగుగంగ అధికారులు.. పోలీసుల సహకారంతో గేట్లు ఎత్తే ప్రయత్నం చేయగా..రుద్రవరం రైతులు అడ్డుకున్నారు. అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినుకోలేదు. రుద్రవరం రైతులు.. పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఎస్ఐ హనుమంతయ్య వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే మందలూరు, నక్కలదిన్నె గ్రామాల రైతులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించి వేశారు. -
వీబీఆర్ నుంచి నీటి విడుదల బంద్
వెలుగోడు: జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేసినట్లు తెలుగు గంగ డీఈ రాఘరామిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రస్తుతం వీబీఆర్‌లో 5.974 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీబీఆర్ నుంచి వన్ ఆర్, వన్ ఎల్, చెన్నై కాల్వకు అవుట్ ప్లో నిలిపేసినట్లు డీఈ తెలిపారు. కలెక్టర్ అనుమతితోనే మళ్లీ నీటిని విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. -
చంద్రబాబుతో ముగిసిన పన్నీర్‌సెల్వం చర్చలు
-
చంద్రబాబుతో ముగిసిన పన్నీర్‌సెల్వం చర్చలు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం చర్చలు ముగిశాయి. చెన్నై నగరానికి తెలుగుగంగ నుంచి మంచినీటిని సరఫరా చేసే విషయమై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చెన్నైకి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు, ఈ విషయమై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. త్వరలో రెండు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. -
గన్నవరంలో పన్నీర్‌కు ఘనస్వాగతం
గన్నవరం: తమిళనాడు ముఖ్యమంత్రి ఒ. పన్నీర్ సెల్వానికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయనకు మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పన్నీర్ సెల్వం భేటి కానున్నారు. మద్రాసు నగరానికి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో తెలుగు గంగ నుంచి నీటిని విడుదల విషయమై చర్చించటానికి పన్నీర్ సెల్వం ఏపీకి వచ్చారు. -
నేడు బాబును కలవనున్న పన్నీర్ సెల్వం
సాక్షి, అమరావతి : తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరేందుకు ఆయన వస్తున్నారు. -
తెలుగుగంగ నీటి కోసం రైతుల ఆందోళన
వెంకటగిరి : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెం వద్ద వెంకటగిరి - గూడూరు ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. వరి పంటకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరుతూ అమ్మపాలెం, కందనాలాపాడు, పాతమాందాపురం గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రైతులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను సముదాయిస్తున్నారు. -
ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల
బానకచెర్ల (పాములపాడు) : మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఇందులో తెలుగుగంగకు 300, కేసీసీకి 400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
కనుల పండువగా జ్యోతి ఆరాధన
బండిఆత్మకూరు: కాశినాయన 21వ ఆరాధన ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. సోమవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీపాలతో నడుచుకుంటూ కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చేరుకునా్నరు. అక్కడ ఆశ్రమంలో పెంచిన గుర్రంపై కాశినాయన చిత్రపటాన్ని పెట్టి ఊరేగించారు. రాత్రి 12గంటల సమయంలో గాయత్రిదేవి ఆలయం సమీపంలో జ్యోతిని వెలిగించారు. ఆ తర్వాత కూర్మగిరి క్షేత్రంలోనూ ఇదే విధంగా జ్యోతిని పూజారులు పూజలు నిర్వహించి వెలిగించారు. తొలిసారిగా ఓంకార క్షేత్రం ఆవరణలో ఉన్న కాశినాయన ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ జ్యోతి ఉత్సవాలను తిలకించడానికి జనం భారీగా తరలివచ్చారు. -
నీటి వృథా సరికాదు
– ఎస్ఈ చంద్రశేఖర్‌రావు సూచన – నిరంతరం పర్యవేక్షణ – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం రుద్రవరం: సాగునీటి వృథాకు కారణమయ్యే అధికారులను ఉపేక్షించబోమని ఎస్ఈ చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రుద్రవరం మండల పరిధిలోని తెలుగుగంగ ప్రధాన కాల్వను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రధాన కాల్వపై ఏర్పాటు చేసిన గండ్లేరు రిజర్వాయర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ప్లో పూర్తిగా తగ్గిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగుగంగ ప్రధాన కాల్వ ద్వారా కడప జిల్లాకు తాగు, సాగు నీటిని అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా బ్రహ్మసాగర్‌కు నీరు చేర్చేందుకు కాల్వ వెంట రెవెన్యూ అధికారుల సాయం పొందుతున్నామన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు నుంచి వెలుగోడు రిజర్వాయర్‌కు చేరుతోందన్నారు. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్‌లో 12.4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. తెలుగుగంగ అధికారులపై ఆగ్రహం.. గండ్లేరు రిజర్వాయర్ గేట్ల నుంచి ఆలమూరు పరిసర ప్రాంతాలకు దొడ్ల వాగుద్వారా అందించే నీరు వథా అవుతున్నట్లు తెలుసుకున్న ఎస్ఈ.. ఆళ్లగడ్డ డివిజన్ ఈఈ మాధవరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దరాజు చెరువు ప్రాంతంలో నీటి ప్రవాహన్ని పరిశీలించిన ఆయన నీటి వథాను అరకట్టాలని నంద్యాల డివిజన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట నంద్యాల డివిజన్ ఈఈ పురుషోత్తం రెడ్డి, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ రామశేషు, ఆళ్లగడ్డ డివిజన్ డిఈలు సుబ్బారెడ్డి, నరసింహారావు, ఏఈ గణేష్‌రెడ్డి ఉన్నారు. -
ఆయకట్టు..కనికట్టు
అభివృద్ధి పేరిట ప్రభుత్వం హడావుడి చేయడం.. అందుకు తగినట్లుగా అధికారులు అంకెల గారడీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవ విషయానికొస్తే.. కాగితాల్లో చూపిన లెక్కలేవీ కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇదేమంటే ప్రభుత్వం ఏమి చేస్తారంటే నివేదిక రూపంలో పంపామని.. అమలు తమ చేతుల్లో లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి ఈ కోవకే చెందుతుంది. కర్నూలు సిటీ: కరువు నేలపై కన్నీళ్లు పారించయినా ఈ ఏడాది అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు జల వనరుల శాఖ అధికారులు జిల్లా వాస్తవ పరిస్థితి తెలిసీ.. రెండంకెల అభివృద్ధి పేరిట సాగునీటి ప్రాజెక్టుల కింద అదనపు ఆయకట్టు అభివృద్ధికి గత జూన్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ కాలువ కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేస్తామని అందులో వెల్లడించారు. ఇందులో ఎస్ఆర్బీసీ కింద 1,703 ఎకరాలు, తెలుగుగంగ కింద 39,160, హంద్రీనీవా కింద 73వేలు, గురురాఘవేంద్ర కింద 37వేలు, సిద్ధాపురం ఎత్తిపోతల కింద 21,300, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 20వేల ఎకరాలను అదనంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే జిల్లాలో వివిధ కాల్వల కింద మొత్తం 7,79,136 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో గత ఏడాది వివిధ కారణాలతో 4.28 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. మిగిలిన ఆయకట్టును అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులు సక్రమంగా చేపట్టకపోవడమే అందుకు కారణమైంది. అలాంటప్పుడు అదనపు ఆయకట్టు అభివృద్ధి ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకమైంది. ఈనెల 13న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం(ఐఏబీ)లోనూ అదనపు ఆయకట్టు ఊసే కరువైంది. ప్రభుత్వానికి ప్రతిపాదించిన విధంగా అదనపు ఆయకట్టు ప్రస్తావనే లేకుండా సమావేశం సాగింది. సగం ఆయకట్టుకే గతి లేదు.. తుంగభద్ర దిగువ కాల్వ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,134 ఎకరాలు. ఇందులో రెండు సీజన్లకు కలిపి 60వేల ఎకరాలకు మించి నీరివ్వలేకపోతున్నారు. కాల్వను పూర్తి స్థాయిలో ఆధునీకరించకపోవడం, కన్నడిగుల జలచౌర్యాన్ని నిలువరించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కేసీ కాల్వ కింద జిల్లాలో 1,84,209 ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1వ బ్లాక్ నుంచి 16 బ్లాకుల వరకు 1,53,936 ఎకరాల ఆయకట్టు ఉం డగా.. గతేడాది ఖరీఫ్‌లో 1వ బ్లాకు నుంచి 11 బ్లాకు వరకు 81879 ఎకరాలు, 12 నుంచి 16 వరకున్న బ్లాకులకు 33,150 ఎకరాల ఆయకట్టు సాగయింది. ప్రస్తుతం ఈ కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ పనులు పూర్తయితే తప్ప.. పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందని పరిస్థితి. తెలుగుగంగా కాల్వ కింద మొత్తం 1,14,500 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో 75,340 ఎకరాల ఆయకట్టు మాత్రమే యేటా సాగవుతోంది. కెనాల్‌కు డిస్ట్రిబ్యూటరీ ఉన్నా.. పిల్ల కాలువలు లేకపోవడంతో 39,160 ఎకరాలకు నీరు కరువైంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్, పిల్ల కాలువలు లేకపోవడం, ఇందుకు అవసరమైన భూములను సేకరించకపోవడంతో గతేడాది ప్రతిపాదించిన 14,500 ఎకరాలను ఈ ఏడాది కూడా ప్రతిపాదించడంతో సరిపెట్టారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా.. ప్రాజెక్టు కింద చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి కాకపోవడంతో 13వేల ఎకరాలకే పరిమితమవుతోంది. చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 84వేల ఎకరాలు గాను, 40 వేలకు మించి సాగు కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు వల్ల 16వేల ఎకరాలు అదనంగా ఆయకట్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వర్షాలు కురిస్తేనే అదనపు ఆయకట్టు వర్షాలు సమృద్ధిగా కురిసి జలశయాలు నిండితేనే అదనపు ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది. ఒక్క కాల్వల ద్వారానే కాకుండా చెక్‌డ్యాంలు, ఫారంపాండ్స్, చెరవుల ద్వారా భూగర్భ జలాలు పెరిగితే ఆయకట్టు మెరుగవుతుంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే అదనపు ఆయకట్టు అబివృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆయకట్టు అభివృద్ధికి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్ -
'తిరుమలకు తెలుగుగంగా నీటిని తరలిస్తాం'
హైదరాబాద్: తిరుమలలో తాగునీటి సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. అందులోభాగంగా తెలుగుగంగా నీటిని తిరుమలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమలలో శ్రీవారిని దేవినేని ఉమా దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శేషాచల కొండల్లో ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ఎర్రచందనాన్ని రెండు నెలలో వేలం వేస్తామని దేవినేని ఉమా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఇచ్చిన హమీలను తమ తప్పక నెరవేరుస్తుందని తెలిపారు. -
ఈ సారైనా ‘సాగు’తుందా!
కర్నూలు రూరల్/ఆదోని, న్యూస్‌లైన్ : కాలువల కింద పంటలు సాగు చేసే జిల్లా రైతాంగానికి ప్రతి ఏడాదీ నిరాశే మిగులుతోంది. జలాశయాల పరిధిలో కేటాయించిన మేరకు కాలువలకు ఏనాడూ సాగునీరు సరఫరా కావడం లేదు. అదీ చాలదన్నట్టు వచ్చే కొద్దిపాటి నీటినీ ఇతర రాష్ట్రాల రైతులు దౌర్జన్యంగా తరలించుకుపోతున్నారు. కాలువలకు గండ్లు, ఆవిరి రూపంలో పోతున్న నీరు మొత్తం జిల్లా వాటాలోనే లెక్కిస్తుండడంతో నష్టం వాటిల్లుతోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సైతం ఈ నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఆయకట్టుసాగు ప్రశ్నార్థకంగా మా రుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ భవనంలో నిర్వహించనున్న సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ ఏడాది రబీలోనైనా సక్రమంగా నీటిని విడుదల చేయించి ఆదుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. ఎల్లెల్సీ వాటాలో కర్ణాటక దౌర్జన్యం తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) కర్ణాటకతోపాటు జిల్లాలో విస్తరించి ఉంది. మొత్తం కాలువ నిడివిలో 250 కిలోమీటర్ల వరకు తుంగభద్ర బోర్డు నిర్వహణలో ఉంది. పరిమితి మేరకు నీటిని సరఫరా చేస్తే రాష్ట్ర సరిహద్దు చింతకుంట(153 కి.మీ.) వద్ద రాష్ర్ట వాటా కింద 725 క్యూసెక్కులు, బోర్డు సరిహద్దు హనువాళు (250 కి.మీ.) వద్ద 650 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉండాలి. అయితే కర్ణాటక రైతుల అక్రమాలు ఏడాదికేడాదికీ అధికమవుతున్నాయి. మోటార్లు, నీటికి అడ్డుకట్టలు వేసి జలచౌర్యానికి పాల్పడుతున్నారు. దానికితోడు కాలువలు దెబ్బతినడం.. ఆవిరైన నీటిని మొత్తం జిల్లా వాటాలోనే చూపుతున్నారు. దీంతో ఎప్పుడూ ప్రవాహం 450 క్యూసెక్కులు మించలేదు. కర్ణాటకలో నీటి అవసరం ఎక్కువగా ఉన్న సమయంతో ప్రవాహం 200 క్యూసెక్కులకు పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో 192 గ్రామాలు ఎల్లెల్సీ నీటిపై ఆధారపడ్డాయి. దీని కింద ఖరీఫ్ సీజన్లో 43,519 వేల ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. బచావత్ ట్రిబునల్ ప్రకారం 24 టీఎంసీల నీటిని జిల్లాకు ఇవ్వాల్సి ఉంది. పూడిక చేరడంతో ఏటేటా వాటా నీరు తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది 16.32 టీఎంసీల నీరు కేటాయిస్తే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ఇప్పటికి 8.34 టీఎంసీలు వినియోగించారు. వాటాలో మిగిలిన 7.98 టీఎంసీల నీటిని రబీలో సాగుకు విడుదల చేయాల్సి ఉంది. కనీసం ఈ ఏడాదైనా నీటి సక్రమంగా జిల్లాకు చేరేలా చూడాలని రైతులు అధికారులు, నాయకులను కోరుతున్నారు. అందులో సగం తాగునీటి అవసరాలకు పోయినా, మిగిలిన వాటాతో దాదాపు 50 వేల ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆ‘కేసీ’ చూడడమే లేదు సుంకేసుల జలాశయంపై ఆధారపడి ఉన్న కర్నూలు-కడప కాలువ పరిస్థితి ఏటేటా దారుణంగా తయారవుతోంది. సెప్టెంబర్, అక్టోబరు నెలలో కురిసిన భారీ వర్షాలకు 90 కి.మీ, 156, 171, 189 కి.మీల దగ్గర కాలువలకు గండ్లు పడ్డాయి. వాటి శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజురు చేయడం లేదు. కర్నూలు, కడప జిల్లాల్లో 2,65,628 ఎకరాలకు సాగు నీరు అందించేది. సాగు నీటి కొరత వల్ల 1.70 వేల ఎకరాలకే నీరిచ్చే స్థితికి చేరుకుంది. ఈ కాలువకి టీబీ డ్యాంలో కేటాయించిన 10 టీఎంసీల వాటాకుగాను 7 టీఎంసీలు మాత్రమే ఈ ఏడాది మంజూరు చేశారు. అందులో నుంచి కూడా 2 టీఎంసీల నీరు కర్నూలు నగర ప్రజల తాగునీటికి వినియోగిస్తున్నారు. 2.5 టీఎంసీ అనంతపురానికి తరలిస్తారు. మిగిలిన 2.5 నీటిని కేసీ ఆయకట్టుకు నీటిని అందించడం సాధ్యం కాదు. అందుకే 10 ఏళ్లుగా ఈ కాలువ కింద రెండో పంటకు నీరు అందనే లేదు. నీటి వాటాను పెంచేందుకు కృషి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. తెలుగు గంగా.. తీరని బెంగ శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీరు ఉన్నప్పుడు మాత్రమే నీటిని వినియోగించుకోవాలనే నిబంధన ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల కాంప్లెక్సు ద్వారా తెలుగు గంగా, శ్రీశైలం కుడి కాలువ, కె.సి కెనాల్ ఎస్కేప్ చానల్ ద్వారా వినియోగించే నీటితో సుమారు 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ కాలువ కింద సాగు చేసే ఏ ఆయకట్టుని ఇంత వరకు స్థిరీకరించలేదు. దీంతో తెలుగు గంగాతో పాటు మిగతా కాలువల కింద ఏ మేరకు పంటలు సాగు అవుతున్నాయే కూడా అధికారులు ఖచ్చితమైన లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఏబీసీ కింద ఏళ్లుగా బీడే తుంగభద్ర ఎగువ కాలువ పరిధిలో 28వ కి.మీ. వద్ద ఉన్న ఆలూరు బ్రాంచ్ కాలువ కింద 14,255 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువకి పదేళ్లుగా సాగు నీరు అందడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నగరడోణ రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నా భూ సేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో నీటి వనరులు సంవృద్ధిగా ఉన్నా వినియోగించుకునేందకు అవకాశం లేక, అందుబాటులో ఉన్న వనరులకు ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించాలి ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, కలెక్టర్, సాగు నీటి శాఖ ఎస్ఈ, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. అయితే కర్ణాటకలో ఎల్లెల్సీ నీటి దోపిడీని అరికట్టేందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మంగళవారం నిర్వహించే సమావేశంలో అయినా దోపిడీపై సమీక్షించి నివారణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
చెరగని తీపిగుర్తు ‘తెలుగు గంగ’
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: సత్యసాయిబాబాను తిరువళ్లూరు ప్రజలు తమ అరాద్యదైవంగా స్మరించుకుంటారు. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. శనివారం ఆయన జయంతి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ.. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య 1977లో జల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా 15 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ మేరకు ప్రతి ఏటా ఆంధ్రా నుంచి కృష్ణా జలాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరువళ్లూరు జిల్లా పూండి రిజర్వాయర్‌ను 35 అడుగుల నీటి సామర్థ్యం నిల్వ ఉండేలా నిర్మించారు. కృష్ణా జలాలను పూండికి తరలించడానికి కండలేరు-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఊత్తుకోట జీరో పాయింట్ వరకు 160 కిలోమీటర్ దూరంలోనూ, జీరోపాయింట్ నుంచి పూండి వరకు 25 కిలోమీటర్ వరకు కాలువలను నిర్మించారు. తర్వాత 1996లో కండలేరు నుంచి నీటిని విడుదల చేశారు. కొంత కాలం పాటు నీరు పూండికి చేరిన తర్వాత కాలువ పూర్తిగా కుంగిపోయింది. దాని మరమ్మతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిది సత్యసాయి ట్రస్టును ఆశ్రయిం చారు. కాలువ మరమ్మతుల కోసం సాయం అందించాలని సాయి బాబాను అభ్యర్థించారు. స్పందించిన బాబా రూ.150 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో పూండి కాలువను పూర్తిగా మరమ్మతు చేశారు. ఆయన కృషిని చెన్నై ప్రజలు నెటికీ స్మరించుకుంటున్నారు. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. -
‘చెన్నైకు తెలుగుగంగను ఆపితే సహించం’
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విభజనకు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కారణంగా చూపుతూ చెన్నైకి తెలుగుగంగ జలాలను నిలిపివేస్తే సహించేది లేదని తెలుగు సంఘాలు హెచ్చరించాయి. 7న చెన్నైకి తెలుగుగంగ కాలువలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటామని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ శ్రీకాళహస్తిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆస్కా అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, తెలుగు సంఘాల అధ్యక్షులు డా. సీఎంకే రెడ్డి, కె.నరసారెడ్డి, టి.రామకృష్ణ, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంవీ నారాయణగుప్తా, రంగనాయకులు శుక్రవారమిక్కడ మీడియూతో మాట్లాడారు. తెలుగుగంగను అడ్డుకుంటే తెలుగువారికి, తమిళులకు మధ్య అగాధాన్ని సృష్టిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. -
తెలుగుగంగలో దంపతుల గల్లంతు
మహానంది, న్యూస్‌లైన్: దుస్తులు ఉతుకునేందుకు వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాల్వలో గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బసవాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శిరివెళ్లకు చెందిన ఖాజాహుసేన్(35) బసవాపురం గ్రామానికి చెందిన మాబున్నీ(29)తో వివాహమైంది. వీరికి ఇజాస్, హుసేన్ బాషా ఇద్దరు కుమారులు. అలాగే సమీప బంధువు కుమార్తె సమ్రీనాను పెంచుకుంటున్నారు. గౌండా పని చేసే ఖాజా భార్య గ్రామానికి చేరుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం దుస్తులు ఉతుక్కునేందుకు సమీపంలోని తెలుగు గంగ కాల్వ వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం కాల్వ గట్టుపై దుస్తులు ఉండటం, అక్కడ ఎవరూ లేకపోవడంతో అటుగా ఇంటికి వస్తున్న కూలీలు అనుమానం పడ్డారు. గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాల్వకు వెళ్లిన తమ తల్లిదండ్రులు రాలేదని ఖాజా హుసేన్ కుమారులు చెప్పడంతో గ్రామస్తులు కాల్వ వెంట గాలించారు. నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో కొట్టుకుని పోయి ఉంటారని చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ కనిపించలేదని సాగునీటి సంఘం అధ్యక్షుడు రామేశ్వరుడు, పీఎన్ఎస్ రాయుడు తెలిపారు.