
చంద్రబాబుతో ముగిసిన పన్నీర్‌సెల్వం చర్చలు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం చర్చలు ముగిశాయి. చెన్నై నగరానికి తెలుగుగంగ నుంచి మంచినీటిని సరఫరా చేసే విషయమై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఆయన అమరావతికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా చెన్నైకి రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు, ఈ విషయమై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. త్వరలో రెండు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది.