కనుల పండువగా జ్యోతి ఆరాధన | 21st kasireddynayana aaradhanochavalu | Sakshi
Sakshi News home page

కనుల పండువగా జ్యోతి ఆరాధన

Published Tue, Dec 13 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

కాశినాయన చిత్రపటాన్ని గుర్రంపై ఊరేగిస్తున్న దృశ్యం

కాశినాయన చిత్రపటాన్ని గుర్రంపై ఊరేగిస్తున్న దృశ్యం

బండిఆత్మకూరు: కాశినాయన 21వ ఆరాధన ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించారు.  సోమవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దీపాలతో నడుచుకుంటూ కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చేరుకునా​‍్నరు.  అక్కడ ఆశ్రమంలో పెంచిన గుర్రంపై కాశినాయన చిత్రపటాన్ని  పెట్టి ఊరేగించారు. రాత్రి 12గంటల సమయంలో గాయత్రిదేవి ఆలయం సమీపంలో జ్యోతిని వెలిగించారు. ఆ తర్వాత కూర్మగిరి క్షేత్రంలోనూ ఇదే విధంగా జ్యోతిని పూజారులు పూజలు నిర్వహించి వెలిగించారు. తొలిసారిగా ఓంకార క్షేత్రం ఆవరణలో ఉన్న కాశినాయన ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ జ్యోతి ఉత్సవాలను తిలకించడానికి జనం భారీగా తరలివచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement