
నేడు బాబును కలవనున్న పన్నీర్ సెల్వం
సాక్షి, అమరావతి : తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరేందుకు ఆయన వస్తున్నారు.