
'రూపాయికి కిలో బియ్యం కాదు... జలాలు కావాలి'
అనంతపురం : అనంతపురం జిల్లా వాసులకు కావాల్సింది ఒక్క రూపాయికి కిలో బియ్యం కాదు... నికర జలాలు కావాలని స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలోని మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... అనంతపురంలో అన్నంలేక ఎవరూ చనిపోవడం లేదని పేర్కొన్నారు.
ఒకప్పుడు ఎన్టీఆర్, హంద్రీ - నీవా ప్రాజెక్టులను విమర్శించాను.. కానీ నేడు ఆ ప్రాజెక్టు కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉందని జేసీ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయ్యేదాకా ప్రతిపక్షాలు ఓపిక పట్టాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.