రాయలసీమ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత | Tension At rayalaseema thermal power plant | Sakshi
Sakshi News home page

రాయలసీమ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత

Published Tue, Nov 26 2024 1:03 PM | Last Updated on Tue, Nov 26 2024 2:53 PM

Tension At rayalaseema thermal power plant

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాయలసీమ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్లై యాష్‌ కాంట్రాక్టు కోసం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తన నియోజకవర్గంలో జేసీ ప్రమేయంపై ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో తాడిపత్రి సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళ్లే ఫ్లై యాష్‌ టిప్పర్లను ఆది వర్గీయులు అడ్డుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్లై యాష్‌ తీసుకెళ్తామంటూ జేసీ వర్గీయులు భారీ వాహనాలతో బయలు దేరారు. దీంతో ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. భారీగా మోహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement