
సాక్షి,అనంతపురం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.
తాజాగా, తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గూండాగిరికి దిగారు. పెద్దవడగూరు మండల కేంద్రంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త మధుసూదన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదురుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండగా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండిపోయారు. తమకేం పట్టనట్టుగా వారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
