
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, హిందూపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు.
విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు..ఇప్పుడు మైనార్టీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment