
'లంచం ఇవ్వజూపి ఏపీ పరువు మంటగలిపారు'
అనంతపురం: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపి, దానిని కప్పిపుచ్చుకునేందుకు కుట్రలకు పాల్పడున్నారని, అసలు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాల అంశం ఎక్కడుందని నిలదీశారు.
బాబు కుటిల చర్యలు ఏపీ పరువును మంటగలపడంతోపాటు ప్రయోజనాలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని విమర్శించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని తెలుగు ప్రజల మధ్య ఉద్రక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా 'ఆడియో టేపుల్లో వాయిస్ నాది కాదు' అని చంద్రబాబు చెప్పలేకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.