వైఎస్ జగన్ దీక్ష భగ్నం చేయడం సరికాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
అనంతపురం : వైఎస్ జగన్ దీక్ష భగ్నం చేయడం సరికాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ దీక్ష భగ్నంపై మంగళవారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. జగన్ దీక్షను ఉపయోగించుకుని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ప్రత్యేక హోదా తేవాలని వై. విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబును డిమాండ్ చేశారు.