చంద్రబాబుపై మండిపడ్డ విశ్వేశ్వర్‌ రెడ్డి | Vishweshwar Reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై మండిపడ్డ విశ్వేశ్వర్‌ రెడ్డి

Published Thu, Mar 22 2018 2:34 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

Vishweshwar Reddy fires on Chandrababu - Sakshi

ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి(పాత చిత్రం)

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ..పార్లమెంటులో వైస్సార్సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై రాష్టానికి జరిగిన అన్యాయానికి ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.

చంద్రబాబుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడటం అలవాటని విమర్శించారు. మొన్నటి దాకా ప్రత్యేక ప్యాకేజీ నాటకమాడి రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదాన్ని ఎత్తుకున్నాడని చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement