సాక్షి, కాకినాడ: హైదరాబాద్‌లో కూర్చుని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే..
►కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ఎక్కడో కూర్చుని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారు.
►విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన అత్యంత దురదృష్టకరం. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు?
►దేశమంతా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలను, ఆయన పనితీరును ప్రశంసించి అనుకరిస్తుంటే చంద్రబాబు మాత్రం రోజూ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.
►చంద్రబాబు తీరు మారకపోతే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యం.
►సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?
Published Wed, Aug 12 2020 7:59 AM | Last Updated on Wed, Aug 12 2020 7:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment