venu gopal krishna
-
‘కరోనా టైమ్‌లో ఎక్కడున్నావ్.. ఫాంహౌస్‌లో పడుకున్నావ్ కదా పవన్’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణం. రాష్ట్రంలో మహిళలను, మహిళా వాలంటీర్లను పవన్ అవమానించాడు. మహిళలందరికీ పవన్ క్షమాపణ చెప్పాలి. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందింది. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారు. పవన్‌కు ప్రజలు క్షమించరు. కచ్చితంగా జనాగ్రహానికి గురికావాల్సిందే. మరోవైపు, ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పవన్ వీధి కుక్కలా తయారయ్యాడు. ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా ప్రమాదం. ప్రజలు రెండు చోట్లా ఓడించినా బుద్ధి రాలేదా?. పవన్ టీడీపీ ఆఫీసు బాయ్‌లా పనిచేస్తున్నాడు. బిస్కెట్ల కోసం పవన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పవన్‌ది సైకోయిజం, శాడిజం అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతోంది. కరోనా సమయంలో పవన్ ఫాంహౌస్‌లో పడుకున్నాడు. వాలంటీర్ల మాదిరిగా పవన్ ప్రజలకు సేవ చేయలేదు. వాలంటీర్లలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. మహిళలంటే పవన్‌కు గౌరవం లేదు. వాలంటీర్లకు పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా?. గడ్డి తినేవాళ్లు మాత్రమే వాలంటీర్లపై నోరు పారేసుకుంటారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారు. పవన్‌కు రాష్ట్రం మీద అవగాహన లేదు. ఇది కూడా చదవండి: వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్ -
పట్టాభి మాదకద్రవ్యాలు తీసుకోని మాట్లాడాడు : మంత్రి వేణుగోపాల కృష్ణ
-
ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..
సాక్షి, తాడేపల్లి: తండ్రి ఆశయాల కోసం.. మహానేత ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తున్న తరుణంలో వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల సమస్యలను విని వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరికీ ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కు ఇచ్చారని తెలిపారు. పాదయాత్రలో చూసిన కష్టాలను సీఎం జగన్ పథకాలుగా మలిచారని చెప్పారు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా.. వైఎస్ జగన్ ఉక్కు సంకల్పంతో పాలన ప్రారంభించారని తెలిపారు. ‘‘ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారు. దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ ఒక్కరికే దక్కుతుంది. ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతిపక్షాల దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.(చదవండి: జనం మద్దతే జగన్ బలం) ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘ జగన్ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.14 నెలలు ప్రజలతో మమేకం అయ్యారు. అక్రమ కేసులు పెట్టినా బెదరకుండా జనంలోనే ఉన్నారు. ప్రజల్లో ఆదరణ ఓర్వలేక ప్రాణాలు కూడా తీయ్యాలని కూడా ప్రయత్నించారు. జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నారు. జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేశారు. ప్రజలు ఆశీర్వదించి 51 శాతం ఓట్లతో 151 సీట్లు కట్టబెట్టారు. ప్రజల నుండి తీసుకున్న అజెండానే తన అజెండాగా తీసుకున్నారు. 16 నెలల్లో రాష్ట్ర దిశను మార్చిన నేత సీఎం జగన్. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టామని’’ ఆయన పేర్కొన్నారు.10 రోజుల పాటు పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలని పిలుపు నిచ్చామని చెప్పారు. ఇది ప్రజల పండగగా జరపాలని పిలుపునిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. (చదవండి:.వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు) ఎన్ని కష్టాలు వచ్చినా సంకల్పం వదల్లేదు.. సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. చంద్రబాబు అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు.14 నెలలు ఎన్నికష్టాలు వచ్చినా సంకల్పం వదలలేదని, ఏడాదిన్నరలోనే సీఎం జగన్ 90 శాతం హామీలు అమలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తామని వేణుగోపాల కృష్ణ తెలిపారు. -
పోలీస్‌లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
-
విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?
సాక్షి, కాకినాడ: హైదరాబాద్‌లో కూర్చుని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే.. ►కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ఎక్కడో కూర్చుని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ►విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన అత్యంత దురదృష్టకరం. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు? ►దేశమంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలను, ఆయన పనితీరును ప్రశంసించి అనుకరిస్తుంటే చంద్రబాబు మాత్రం రోజూ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ►చంద్రబాబు తీరు మారకపోతే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యం. ►సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
రేపే ‘వైఎస్సార్ చేయూత’ పథకం ప్రారంభం: మంత్రి
సాక్షి, తూర్పు గోదావరి: రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపు(బుధవారం) ‘వైఎస్సార్ చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అంటే నాలుగేళ్ళలో 75 వేల రూపాయలు వారికి ఆర్థిక సహయం అందనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా.. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని, చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అవలంభిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. -
మూడు రాజధానులు కావాల్సిందే
సాక్షి, ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్): రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు ఉండాల్సిందేనంటూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో సుమారు 2 వేల మంది మహిళలు, విద్యార్థినులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ముక్త కంఠంతో మూడు రాజధానుల అవసరాన్ని ఎలుగెత్తి చాటుతుంటే, చంద్రబాబు, ఆయన అనుయాయులు మాత్రం తమ రియల్ ఎస్టేట్ ఆశలు ఆవిరి అయిపోతున్నాయని ప్రజల్లో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఏం చేసినా ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తారనే దృఢమైన నిర్ణయం ప్రజల్లో ఉందని, అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం నూరు శాతం కరెక్ట్ తాళ్లరేవు: అమరావతి విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జీపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ఒక రాష్ట్రం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. సదుపాయాలు అందరికీ సమానంగా ఉండాలంటే ప్రతి జిల్లాలో అభివృద్ధి జరగాలని చెప్పారు. సంబంధిత వార్తలు చంద్రబాబును అడ్డుకుంటాం వారిలో సమాజ హితం లేదు అలా చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? జగన్ అంటే చంద్రబాబుకు ద్వేషం: పోసాని -
'బాబు పాలనంతా అవినీతిమయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ పోర్టు ఏర్పాటు చేసేందుకు చైనా వారికి అనుమతి ఇస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్క దేశాల్లో తాకట్టు పెడతారా ? అని చంద్రబాబును వేణుగోపాలకృష్ణ నిలదీశారు. ఇది అంతర్గత భద్రతకు ముప్పు కాదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఏపీలోని సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబుకు వేణుగోపాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనల వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని చంద్రబాబును వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అంటు వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన చైనా పర్యటనపై శుక్రవారం సాయంత్రం విజయవాడలో మాట్లాడిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని వేణుగోపాలకృష్ణ అన్నారు.