
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, తాజాగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణం. రాష్ట్రంలో మహిళలను, మహిళా వాలంటీర్లను పవన్ అవమానించాడు. మహిళలందరికీ పవన్ క్షమాపణ చెప్పాలి. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందింది. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారు. పవన్‌కు ప్రజలు క్షమించరు. కచ్చితంగా జనాగ్రహానికి గురికావాల్సిందే.
మరోవైపు, ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పవన్ వీధి కుక్కలా తయారయ్యాడు. ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా ప్రమాదం. ప్రజలు రెండు చోట్లా ఓడించినా బుద్ధి రాలేదా?. పవన్ టీడీపీ ఆఫీసు బాయ్‌లా పనిచేస్తున్నాడు. బిస్కెట్ల కోసం పవన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పవన్‌ది సైకోయిజం, శాడిజం అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతోంది. కరోనా సమయంలో పవన్ ఫాంహౌస్‌లో పడుకున్నాడు. వాలంటీర్ల మాదిరిగా పవన్ ప్రజలకు సేవ చేయలేదు. వాలంటీర్లలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. మహిళలంటే పవన్‌కు గౌరవం లేదు. వాలంటీర్లకు పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా?. గడ్డి తినేవాళ్లు మాత్రమే వాలంటీర్లపై నోరు పారేసుకుంటారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారు. పవన్‌కు రాష్ట్రం మీద అవగాహన లేదు.
ఇది కూడా చదవండి: వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్