‘ఆ ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది’ | YSRCP Leader Visweswara Reddy Fires On Payyavula Keshav | Sakshi
Sakshi News home page

‘ఆ ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది’

Published Fri, Feb 15 2019 3:47 PM | Last Updated on Fri, Feb 15 2019 5:01 PM

YSRCP Leader Visweswara Reddy Fires On Payyavula Keshav - Sakshi

సాక్షి, అనంతపురం: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని, నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఉరవకొండలో పేదల కాలనీకి పయ్యావుల కేశవ్ పేరు పెట్టడంపై శుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉరవకొండలో పేదల కోసం 88 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కతుందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక్క ఎకరా భూమి కూడా అదనంగా కేటాయించలేదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పేదలకు ఏ పని చేయకపోయినా కాలనీకి తన పేరు పెట్టించుకోవటం.. పయ్యావుల కేశవ్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమంటూ మండిపడ్డారు. ఉరవకొండ రెవెన్యూ కార్యాలయాలను టీడీపీ ఆఫీసుగా మార్చేయటం దురదృష్టకరమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement