సాక్షి, ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదటి సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 80 నుంచి 90 శాతం దాకా అమలుపరుస్తూ, అనేక బిల్లులను ఆమోదించారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఆలోచించడం మాని ఇంకా తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇక ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పెద్ద అవినీతి తిమింగళమని హంద్రీనీవా, డ్రిప్ పథకాలు తదితర వాటిలో అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. చంద్రబాబు పయ్యావులకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే బదులు లూటీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసి ఉంటే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment