► పచ్చ నేతలకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగింత
► స్మార్ట్ పల్స్ సర్వేను వెంటనే నిలిపివేయాలి
► ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: రాష్ట్రంలో సాగుతున్న దోపిడి దందాకు ఉదాహరణగా కృష్ణా పుష్కర ఏర్పాట్లు నిలుస్తాయుని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కోట్లు దోపిడి చేయుడం కోసం టెండర్లు పిలవడంలో జాప్యం చేసి నామినేషన్ పద్ధతిలో తనకు అనూకులమైన వారికి పనులను చంద్రబాబు కేటాయిస్తూ కోట్లు దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన గోదావరి పుష్కరాల్లో మొదటి రోజే పుష్కారాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమై 29 వుంది అవూయుకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడంతో పాటు 51 వుంది గాయపడటానికి కారుకులైయ్యారు. వురోసారి అదే తరహాలో సీఎం చంద్రబాబు తానే ధర్మకర్త అన్న రీతిలో వ్యవహరిస్తారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయూలన్న సాకుతో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే పనులు చేపడుతున్నారని తెలిపారు.
స్మార్ట్ పల్స్ సర్వేను వెంటనే నిలిపివేయాలి:
స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను స్మార్ట్‌గా మోసగించడానికి సిద్ధమైరుుందని ఎమ్మెల్యే తెలిపారు. సర్వే పై ప్రజల్లో అనేక అనువూనాలు ఉన్నాయుని, బైక్, సెల్‌ఫోన్, ఫ్రిజ్ తదితర వస్తువులు వినియోగిస్తే వారికి బియ్యుం, ఇంటి స్థలాలు కూడా రాకుండా చూడాలని కుట్ర పన్నుతున్నారని సూచించారు. సర్వే ప్రారంభించినప్పటి నుంచి వుండల కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సవూవేశంలో పార్టీ జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, జోగి సంఘం రాష్ట్ర నాయుకులు జోగి వెంకటేష్, సుబ్బయ్యు, జడ్పీటీసీలు లలితవ్ము , తిప్పయ్యు తదితరులు పాల్గొన్నారు.
పుష్కర పనుల్లో రూ.కోట్ల దోపిడీ
Published Sat, Jul 16 2016 6:26 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement