హెరిటేజ్ ప్రయోజనాల కోసం ఏపీ డెయిరీని మూయించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.
ఒకే నెలలో మూడు సార్లు పాల సేకరణ ధర తగ్గించడం దారుణమన్నారు. పాడి పరిశ్రమను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పని చేయొద్దని విశ్వేశ్వరరెడ్డి సూచించారు.