
'మా జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలి'
అనంతపురం: గుంటూరు-విజయవాడ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అనడం మంచిదికాదని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడానికే గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని టీడీపీ నేతలు ప్రకటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నిపుణుల కమిటీ నివేదించక ముందే ఇలాంటి ప్రకటనలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. వెనుకబడిన తమ జిల్లాకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.