అనంతపురం: ప్రత్యేక హోదా అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.
- ఉరవకొండ మండలం పునుగుప్పలో దుద్దేకుంట రామాంజనేయులు ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షకు దిగారు.
- జననేత దీక్షకు మద్దతుగా హిందూపురంలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
- అనంతపురం తంతి తపాలా కార్యలయం వద్ద ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి, 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
- తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మారో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
- యాడికిలో వైఎస్ఆర్ సీపీ నేత బొంబాయి రమేశ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు.
- ఎస్కేయూలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు సీఎం చంద్రబాబు శవయాత్ర నిర్వహించారు.