రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడికి తరలిరండి | visweswarareddy statement on ragulapadu lift | Sakshi
Sakshi News home page

రాగులపాడు లిఫ్ట్‌ ముట్టడికి తరలిరండి

Published Fri, Aug 26 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

visweswarareddy statement on ragulapadu lift

విడపనకల్లు/ఉరవకొండ : హంద్రీ నీవా ఆయుకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆయుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో వే లాది మంది రైతులతో కలిసి ఈ నెల 29న వజ్రకరూరు మండలంలోని రాగులపాడు లిప్‌్టను ముట్టడిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రైతులు, రైతు కూలీలు భారీగా తరలివచ్చి విజÄýæయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపుని చ్చారు. గురువారం మండల పరిధిలోని చీకులగురికి గ్రామం లో హంద్రీ నీవా ఆయుకట్టు సాధన సమితి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నిరసన కార్యక్రవూన్ని విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం చేపట్టారు.


అంతకుముందు ఆయన చిన్న ముషూ్టరు గ్రామంలో గడప గడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  నాలుగేళ్లుగా కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా మన ప్రాంతానికి వస్తున్నా రైతులు ఆ నీళ్లను పొలాలకు మళ్ళించుకోలేని దుస్ధితిలో ఉన్నారని అన్నారు.  ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందలేదన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని  ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement