visweswarareddy
-
సమస్యల ఏకరువు
- కొనసాగుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’ - తమ సాధక బాధలను చెప్పుకుంటున్న జనం – ప్రభుత్వంపై పోరాడాదమని ప్రజలకు నేతల భరోసా అనంతపురం: పింఛన్ రాలేదని ఓ అవ్వ ఆవేదన...రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటిపెద్దదిక్కును కోల్పోయామని ఓ చేనేత మహిళ రోదన. చిన్న ఇల్లు కట్టుకుందామంటే రెండేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేదని పేదల ఆరోపణ...ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక సమస్య. మూడున్నరేళ్ల్ల తర్వాత ప్రభుత్వ తీరుతో తాము ఎలా మోసపోతున్నామో జనం బహిరంగంగా గొంతెత్తి చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరితో అన్యాయానికి గురవుతున్నవారు, మోసపోయిన వారు తమ సమస్యలు చెప్పుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’ను వేదిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. బుధవారం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని ఉరవకొండ పట్టణం, రాయంపల్లి, చిన్న ముష్టూరు, పెద్దముష్టూరు, నింబగల్లు, రాకెట్ల, షెక్షానుపల్లి, లత్తవరం, బెళుగుప్ప మండలం బెళుగుప్ప తండాలో ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. ఉరవకొండ పట్టణం, రాయంపల్లిలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం రాజీవ్‌కాలనీ, పెనుకొండ మండలం నాగలూరుతో పాటు పరిగి, రొద్దం మండలాల్లో కార్యక్రమం జరిగింది. గుంతకల్లులోని 1, 15, 19, 34, 35 వార్డుల్లో కార్యక్రమం జరగగా...34, 35 వార్డుల్లో నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. రాయదుర్గం నియోజవర్గ పరిధిలోని రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అలాగే మెచ్చిరి, సదం, వీరాపురం, కొండాపురం, రాయంపల్లి, ఆవులదట్ల, హీరేహాల్ మండలం సోమలాపురం, లింగమనహళ్లి, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్, కొత్తూరు, కోనాపురం, దర్గాహొన్నూరు, కనేకల్ మండలం కలేకుర్తి, పూలచెర్ల, సోలాపురం, మాల్యం తదితర గ్రామాల్లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. శింగనమల నియోజకవర్గం సలకంచెరువు, శింగనమల, తరిమెల, పుట్లూరు మండలం రంగరాజుకుంట, జంగమరెడ్డిపేట, బుక్కరాయసముద్రం మండలం బుక్కరాయసముద్రం, చెన్నంపల్లి గ్రామాల్లో జరిగింది. బుక్కరాయసముద్రంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బహ్మ్రసముద్రం మండలం పోలేపల్లి, పడమటి కోడిపల్లితో పాటు మరో ఐదు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మడకశిర, కదిరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం జరిగింది. -
ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు
- పయ్యావుల సోదరుల కనుసన్నల్లో జూద కేంద్రం - నంద్యాలలో టీడీపీ అప్రజాస్వామిక గెలుపు - జగనన్న వస్తున్నాడని ప్రతి ఒక్కరికీ చెప్పండి - నవరత్నాల సభలో వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు ఉరవకొండ: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై బూత్‌లెవల్ కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఉరవకొండలోని శ్రీ వీరశైవ కల్యాణమండపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యాన ‘నవరత్నాల’ సభ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివచ్చారు. వజ్రకరూర్ మండల కన్వీనర్ జయేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. అధికారంలోకి రావడానికి గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హమీలు ఇచ్చారని, ఇందులో ఒక్కటీ నేరవేర్చలేక పోయారని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. హంద్రీ- నీవా ఆయకట్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయినా ఒక్క ఎకరాకు కుడా సాగునీరు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాల కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. కూడేరు మండలం కొర్రకోడు డ్యాం వద్ద ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు శీనప్పల అండదండలతో జూద కేంద్రం నడుస్తోందన్నారు. జూదకేంద్రం వద్దే మద్యం కూడా అందుబాటులో ఉంచారని, ఇక్కడ ఒక ఎస్ఐ కూడా కాపలా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూద కేంద్రం ద్వారా వచ్చే ఆదాయంలో పయ్యావుల సోదరులకు మామూళ్లు ముట్టజెబుతున్నారని ఆరోపించారు. గతంలో తాడిపత్రికి చెందిన ఒక వ్యక్తి జూదంలో రూ.లక్షలు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులను హతమార్చి, చివరకు తనూ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు జూదం, మద్యం మాఫియాను పెంచిపోషిస్తున్నారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తు కోట్లాది రూపాయలు గుమ్మరించి టీడీపీ అక్కడ గెలిచిందన్నారు. ఓటర్లను బెదిరించి, ప్రలోభ పెట్టి గెలవడం గొప్ప విషయం కాదన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన 20 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదికగా ప్రకటించిన నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, జగనన్న వస్తున్నాడని ఊరూవాడా చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు యువనేత వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, మాన్యం ప్రకాష్, కాకర్ల నాగేశ్వరావు, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ, నిర్మలమ్మ, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, చేనేత విభాగం జిల్లా కమిటీ సభ్యులు ఎంసీ నాగభూషణం, చెంగల మహేశ్వర తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో పీఏబీఆర్ నుంచి నీరు
కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకం నుంచి రెండు రోజుల్లో మండలంలోని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గతంలో ఆందోళనకు దిగినపుడు అధికారులు తేదీలు ప్రకటిస్తూ వచ్చారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని వెంటనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఏమీ చెప్పలేక అధికారులు లోలోపలే ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఉన్నతాధికారులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ కావడంతో బుధవారం నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా నియోజకవర్గ టీడీపీ నేత ఫోన్ చేసి ‘మళ్లీ నేను ఫోన్ చేస్తా.. అంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దు’ అని హుకుం జారీ చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
విశ్వాసం కోల్పోతున్న బాబు
- ఆయనది నియంతృత్వ, అణచివేత ధోరణి - దుష్టపాలనకు ప్రజలు సమాధి కట్టాలి - ఉరవకొండ ప్లీనరీలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు - సీఎం డ్యాష్ బోర్డులో కరువు కనిపించలేదా? - మాజీ ఎంపీ అనంత ధ్వజం అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ప్లీనరీ శుక్రవారం కూడేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నియంతృత్వ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. తన పాలన పట్ల, ఎమ్మెల్యేల పట్ల విశ్వాసం లేక ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. తద్వారా వైఎస్సార్సీపీలో అయోమయం సృష్టించాలని భావించారని, అయితే.. ప్రజలు పూర్తిగా అండగా నిలవడంతో చంద్రబాబు కుయుక్తులు పటాపంచలయ్యాయని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అత్యంత హేయం, దిగజారుడు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో 144 సెక్షన్, 30 యాక్ట్ లేకుండా పాలించలేని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ దుష్టపాలనకు సమాధి కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకే ప్లీనరీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పని చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో కొండంత అభిమానం ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఏమాత్రమూ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తోందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోనైతే పయ్యావుల సోదరులు చెప్పినట్లే అధికారులు వింటున్నారని మండిపడ్డారు. చివరకు ఇంట్లో అన్నదమ్ములు విడిపోయి భూముల పట్టాదారు పాసుపుస్తకాలు సపరేటుగా చేయించుకోవాలన్నా ముందుగా అధికార పార్టీ నేతలను ఒప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. మూడేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వరుస కరువులతో జిల్లా రైతులు అల్లాడుతున్నా సీఎం డ్యాష్‌బోర్డులో చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. జిల్లాకు హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు వచ్చాయంటే అది వైఎస్ ఘనతే అని పునరుద్ఘాటించారు. ఇప్పుడేమో తామే నీళ్లు తెప్పించామంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది జిల్లాకు 38 టీఎంసీలు నీళ్లొచ్చాయని చెబుతున్న పాలకులు 38 ఎకరాల సాగుకైనా అందించారా అని నిలదీశారు. దీనిపై జిల్లాలోని ఎంపీలు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబును అడిగే దమ్ము, ధైర్యం లేదన్నారు. పార్టీ మారితే సమస్యలు సమసిపోయినట్లేనా అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చురకలంటించారు. దోచుకోవడమే తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదు చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబు రాష్ట్రానికి శనిలా మారారన్నారు. తరచూ సింగపూర్, జపాన్ అంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో జిల్లా మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దోచుకుంటున్నారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా...మంత్రి సునీత రూ.1100 కోట్లతో అంచనాలు వేయిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆడిన రెయిన్గన్ల డ్రామాలో రూ. 300 కోట్లు దోపిడీ చేశారన్నారు. వాతావరణ బీమా కాకుండా పంటల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పగించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా తీర్పునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహమ్మద్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంతకల్లు సమన్వయకర్త వెంకటరామిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి ప్రణయ్‌కుమార్‌రెడ్డి, మునిరత్నం శీనా, పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలె జయరాంనాయక్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలే స్ఫూర్తిగా..
- నేడు కూడేరులో ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీ ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టాలల్సిన పోరాటాలే ప్రధాన లక్ష్యంగా కూడేరులో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ప్లీనరీ జరగనుంది. పోరాటాల యోధుడుగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఈ మూడేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి సాగించిన పోరాటాలు అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విశ్వేశ్వరరెడ్డి సాగించిన పోరాటాలు.. ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపాయి. అదే స్ఫూర్తితో శుక్రవారం చేపట్టని ప్లీనరీలోనూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారు. - ఉరవకొండ మూడేళ్లలో విశ్వ చేపట్టిన ఉద్యమాలు - హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీటి సాధన కోసం అఖిలపక్షాన్ని కలుపుకుని 2015 మార్చిలో భారీ రైతు సదస్సు - ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని 2015 జూన్ 20న 34 గంటల దీక్ష - హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ 2015 జూలైలో 24 గంటల పాటు జలజాగరణ ఉద్యమం - 2015 ఏఫ్రిల్ 12న ఉరవకొండలో పేదలకు ఇంటి పట్టాలకు 25 గంటల దీక్ష - 2015 జూలై 29న ఉరవకొండ పట్టణ సమస్యలతో పాటు స్వచ్చమైన తాగునీటి సరఫరా, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై వేలాది మందితో మహాధర్నా - 2016 ఫిబ్రవరి 20న పొట్టిపాడు వద్ద హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని జలజాగరణ - హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో 2016 ఆగస్టు 29న రాగులపాడు లిప్ట్ ముట్టడి - కూడేరులోని తాగునీటి పథకాన్ని ప్రారంభించాలంటూ గత నెల 13న వేలాది మందితో ముట్టడి -
రైతు క్షేమం పట్టని ప్రభుత్వం
- ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో అన్యాయం - పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం - ఉరవకొండ ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం ఉరవకొండ : జిల్లా రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక, రుణమాఫీ కాక అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నా వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఏ కోశానా లేదన్నారు. రైతాంగ సమస్యలతో పాటు చేనేత, ఉరవకొండ పట్టణ సమస్యలపై బుధవారం స్థానిక కవితా హోటల్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తీవ్ర కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా సర్కారు చోద్యం చూస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రూ.1,030 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.500 కోట్లు విడుదల చేసినా, రాష్ట్రవాటా రూ.500 కోట్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుండటంతో కూలీలు కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజల మట్టం పడిపోయిందని, 75వేల బోర్లు ఎండిపోయాయని వివరించారు. పశువులకు మేత, నీరు కూడా దొరకని దయనీయ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇంకుడు గుంతల్లో దోపిడీ జిల్లాలోని టీడీపీ నేతలకు ఇంకుడు గుంతల తవ్వకం పనులు కాసులు కురిపిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం పది లక్షల ఇంకుడు గుంతలు తవ్వాల్సి ఉండగా..ఇందులో 3.50 లక్షలు పూర్తి చేశారన్నారు. ఇంకా 7.50 లక్షలు తవ్వాల్సి ఉందని, వీటిలోనూ నిధులు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో రూ.1200 కోట్లతో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారని, ఇందులో సగానికి పైగా నిధులు స్వాహా చేశారని అన్నారు. మొక్కల పెంపకంలోనూ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, ఉపసర్పంచ్ జిలకరమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలకు నీరొచ్చేసింది
తన నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు పట్టువీడని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేసిన పోరాటాలు ఫలించాయి. తాగునీటి దగ్గర రాజకీయాలను సహించనని, 4వ తేదీలోపు నీటి పథకాన్ని ప్రారంభించకుంటే ప్రజలతో కలిసి తామే ఆ పని చేసుకుంటామని శనివారం ఆయన హెచ్చరించడంతో అధికారపార్టీ నాయకులు, అధికారుల్లో చలనం వచ్చింది. ఆదివారం ప్రాజెక్టును ప్రారంభించి గ్రామాలకు నీరు సరఫరా చేశారు. కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకాన్ని అధికారులు ఎట్టకేలకు ఆదివారం ప్రారంభించి గ్రామాలకు నీరు సరఫరా చేశారు. కూడేరు మండలమంతటికీ నీరందింది. నియోజవర్గంలోని కూడేరు, ఉరవకొండ, వజ్రకరూర్, విడపనకల్లు మండలాల్లోని 90 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు 2013 నవంబర్‌లో రూ.56 కోట్లతో ఈ పథకం పనులు ప్రారంభించారు. కానీ పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. నిబంధనల మేరకు 2015 నవంబర్‌తో గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. దీంతో గడువు మళ్లీ పొడిగించారు. తర్వాత కూడా పనులు వేగం పుంజుకోలేదు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పనులను పర్యవేక్షిస్తూ వచ్చారు. పలుమార్లు ఇరిగేషన్ అధికారులను కలిసి తాగునీటి సమస్య తీవ్రతను వివరించారు. స్పందించిన అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం పనులు పూర్తయ్యాయి. కానీ దాని ప్రారంభానికి అధికారపార్టీ నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. దీనిపై సాక్షి దినపత్రిక కొన్ని కథనాలను కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన నిలిచి పోరాటానికి దిగారు. మే 4వ తేదీ లోపు ప్రారంభించకుంటే ప్రజా ఉద్యమం చేపట్టి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తామే ప్రారంభించుకుంటామని శనివారం కూడేరులో చేపట్టిన ధర్నాలో డెడ్‌లైన్ పెట్టి హెచ్చరించారు. దీంతో ఇరిగేషన్ అధికారుల్లోనూ, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం వచ్చింది. ప్రాజెక్టును ప్రారంభించడంతో ప్రజల దాహార్తి తీరుతోంది. -
ఉద్రిక్తతగా మారిన ధర్నా
వజ్రకరూరు (ఉరవకొండ) : పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, బీమా మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారం ఉద్రిక్తతగా మారింది. వజ్రకరూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జయేంద్రరెడ్డి అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తనయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, పార్టీ రాష్ట్ర నేతలు, వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ప్రణయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమన్నారు. సీఎం చంద్రబాబుకు ప్రజాశ్రేయస్సు పట్టడం లేదన్నారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుంతోందన్నారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రతి పనినీ అడ్డుకుంటున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అనంతరం తహసీల్దార్ వెంటనే భయటకురావాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అక్కడికి ఎంపీడీఓ జాషువా చేరుకోగా ఉపాధి బిల్లులపై నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో ఎస్ఐ జనార్ధన్ నాయుడు, సిబ్బందితో వచ్చి సర్దిచెప్పారు. ఇంటి పట్టాల విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్య క్రమంలో వైఎస్సార్సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి వీరన్న, వైఎస్సార్సీపీౖ రెతువిభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మన్యం ప్రకాష్, వైఎస్సార్సీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయేం ద్రరెడ్డి, ఉస్మాన్, వైస్ ఎంపీపీ నారాయణప్ప, సర్పంచులు మన్యం హేమలత, రఘు, యోగా నంద, హనుమంతరాయుడు, సల్లా రమాదేవి, లక్ష్మీబాయి, వెంకటరత్నమ్మ, పాళ్యంలా వణ్య, ఎంపీటీసీ సభ్యులు రామాంజనేయులు, ఎస్తేరమ్మ, వెంకటేష్‌నాయక్, హంపీబాయి, మండల కోఆప్షన్ç సభ్యుడు పీర్‌బాషా, డైరెక్టర్ భరత్‌రెడ్డి, మహిళా కన్వీనర్ భూమా కమ లారెడ్డి, పార్టీనాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
24న అసెంబ్లీ ఎదుట ధర్నా
అనంతపురం అర్బన్ : బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన జిల్లా రైతులు అక్కడ అడుక్కుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ నెల 24న అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిపక్షం, వామపక్షాలు పాల్గొనాలని కోరారు. శుక్రవారం స్థానిక సిద్ధార్థ పంక్షన్ హాల్లో తరిమెల నాగిరెడ్డి శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సభ నిర్వహించారు. కమిటీ కన్వీనర్ డి.గోవిందరాజులు అధ్యక్షత వహించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజల జీవనం దయనీయంగా మారినా, ప్రభుత్వం పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతోందని విమర్శించారు. అధిక ఆదాయం కోసమే ప్రజలు వలస పోతున్నారని అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వాదనకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కరువును పారదోలామని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, కూలీలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకోని ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొంటే అధికార యంత్రాంగం వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తోందన్నారు. ఫారం పాండ్ల తవ్వకంతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందని కలెక్టర్ విశాఖపట్టణంలో ప్రజెంటేషన్ ఇవ్వడం సరికాదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లా మొత్తం ఖాళీ అవుతుందన్నారు. గత ఏడాది చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.5.27 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగా నిధులు సమకూర్చిందని మండిపడ్డారు. నీటి పారుదల రంగం నిపుణుడు పాణ్యం సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు కనీసం 10 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలన్నారు. సమావేశంలో తరిమెల నాగిరెడ్డి శత జయంతి కమిటీ సభ్యులు తరిమెల శరత్ చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం, నాయకులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేవీ రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, సలీమ్ మాలిక్, రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.కేశవరెడ్డి, టి.నారాయణస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పట్టభద్రులూ ఆలోచించి ఓటేయండి
- చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, భృతి కానీ ఇవ్వలేదు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు - ప్రభుత్వ వ్యతిరేకత తెలుపుతూ వెన్నపూసకు ఓటు వేయండి - పొరపాటు చేస్తే అధికారపార్టీ అరాచకాలు ఎక్కువవుతాయి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయని చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి తరుణమని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అనేది పట్టభద్రులు ఆలోచించాలన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పల్లవి పాడిన చంద్రబాబునాయుడు ఈరోజు ప్రత్యేకహోదా నినాదాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. ఈ మూడేళ్లలో అధికారపార్టీ నాయకులు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం పొరబాటు చేసినా టీడీపీ అరాచకాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తం కావాలని సూచించారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం తెలుసుకోవాలన్నా, వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి మరింత ఊతం ఇవ్వాలన్నా వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వం తమపై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి కాస్తోకూస్తో అయినా మంచి పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటును గోపాల్‌రెడ్డికి వేయాలని కోరారు. -
ప్రభుత్వ అవినీతిని ఎండగట్టండి
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూసను గెలిపించాలి – ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి – ప్రాధాన్యత ఓటు వైఎస్సార్సీపీకే వేయాలి – మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనంతపురం న్యూసిటీ : ‘సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారు. పరిశ్రమలు తెప్పించి ఉద్యోగం కల్పించడంతో పాటు భృతి కల్పిస్తామన్నారు. ఉద్యోగులు, అధికారులపై దాడులు మొదలుకుని, అవినీతిలో తారస్థాయికి చేరారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా తీసుకువస్తామని మోసం చేసింది. అలాగే అధికార పార్టీ చేసిన దారుణాలు, వంచనలను పట్టభద్రులకు తెలియజెప్పాలి’ అని ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ కన్వీనర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లాలో అధికార పార్టీకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సాక్షాత్తు సీఎం అసంతృప్తిగా ఉన్నారన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలను మభ్యపెట్టిన విధానాన్ని, అధికార దుర్వినియోగాన్ని పట్టభద్రులకు వివరించి, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమను తెలియజేయాలన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటూ చేసిన కార్యక్రమాలను వివరించాలన్నారు. రాష్ట్రంలో పశ్చిమ రాయలసీలో మాత్రమే వైఎస్సార్సీపీ అభ్యర్థి పోటీస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి అపార అనుభవం ఉందన్నారు. అతడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు స్పెషల్ స్టేటస్ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి, ఇవాల అవసరం లేదని ప్యాకేజ్ ఉంటే సరిపోతుందని మాట్లాడిన తీరును ఓటర్లకు వివరించాలన్నారు. ప్రాధాన్యత ఓటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి వేయాలని, ఇక మిగితా ఓట్లు ఎవరికీ వేయరాదన్న విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలన్నారు. పది రోజుల మాత్రమే సమయం ఉందని అన్ని డివిజన్ల కన్వీనర్లు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలు సమష్టిగా ప్రచారం చేయాలన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం మాట్లాడుతూ ప్రభుత్వానికి కళ్లునెత్తినెక్కి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మైనార్టీలు చాలా మంది పట్టభద్రులుగా ఉన్నారని, వారిని కలసి ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరాలన్నారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీను గెలిపించి టీడీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నేత కొర్రపాటు హుస్సేన్‌పీరా, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నగరాధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం నగరధ్యక్షురాలు శ్రీదేవి, విద్యార్థి విభాగం జిల్లా, నగర అధ్యక్షులు బండి పరుశురాం, జంగాలపల్లి రఫి, డివిజన్ కన్వీనర్లు చంద్రమోహన్‌రెడ్డి, రాధాకృష్ణ, చేపల హరి, పార్టీ నేతలు గోపాల్‌మోహన్, పసుపుల బాలకృష్ణారెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లివ్వకపోతే చూస్తూ ఊరుకోవాలా..?
- కళ్ల ముందు నీళ్లున్నా దొంగగా వాడుకోవాల్సిన దుస్థితేంటి? - హంద్రీనీటిని కుప్పంకు తరలిస్తే ఉద్యమిస్తాం - ఫిబ్రవరి 6న వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఉరవకొండలో మహాధర్నా - పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలిరావాలి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు వజ్రకరూరు : ‘‘ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకెన్నాళ్లు చూస్తూ ఊరుకోవాలి’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6వ తేదీ ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్సీపీ అ«ధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండలంలోని పీసీ.ప్యాపిలి, రాగులపాడు, పందికుంట గ్రామాల్లో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి మహాధర్నాను విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా అధికారికంగా సాగునీరు ఇవ్వాలని రైతులతో కలిసి జలజాగరణ, ధర్నాలు, నిరాహార దీక్షలు, పంప్ హౌస్ ముట్టడి తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కూడా నేరుగా కలిసి సమస్యను విన్నవిస్తే... మీ విధానం, మా విధానం వేరని మాట్లాడారన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదని విమర్శించారు. ఈప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు. జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీనీవా పనులు 95 శాతం పూర్తి చేస్తే మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా మాల్యాల నుంచి జీడిపల్లికి నీరు వస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దొంగగా వాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జిల్లాకు నీళ్లు వస్తున్నాయంటే అది వైఎస్సార్ పుణ్యమేనన్నారు. చంద్రబాబు సర్కార్ కేవలం చెరువులకు నీరిచ్చి అంతా తామే చేశామంటూ రైతులను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. 2016 ఆగస్టులో ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పడంతో పాటు డిస్ట్రిబ్యూటరీ లను పూర్తిచేస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. దీని వల్ల రైతులు నష్టపోయారన్నారు. అలాగే ఉరవకొండలో మహానేత వైఎస్ఆర్ హయాంలో కొనుగోలు చేసిన 89 ఎకరాల్లో ఇంతవరకు పేదలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. దీని కోసం ఆందోళన చేసినా స్పందించలేదన్నారు. రైతులు, ప్రజలకు జరుగు తున్న అన్యాయన్ని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 6న ఉరవకొండకు వస్తున్నారని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తిచేసి వెంటనే సాగునీరు ఇవ్వాలని, గుంతకల్ బ్రాంచ్‌కాలువ ఆధునీకరణ చేపట్టాలని, ఎకరాకు కనీసం రూ.15 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, చేనేత కార్మికులకు ప్రతినెలా నూలు కొనుగో లుపై రూ. 1000 సబ్సిడీ ఇవ్వాలని, రైతుల రుణమాఫీ ఓకే విడతలో ఇవ్వాలని, కూలీలు వలస వెళ్లకుండా పనులు కల్పించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టడం జరుగుతోందన్నారు. -
ఫలితం లేని ‘జన్మభూమి’ ఎందుకు?
– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు : ప్రజాసమస్యలు పరిష్కారం కానప్పుడు ‘జన్మభూమి’ కార్యక్రమం ఎందుకని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మండలంలోని కమలపాడులో సర్పంచు యోగానంద అధ్యక్షతన ‘జన్మభూమి – మాఊరు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు విడతల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు ఇచ్చిన వినతులే పరిష్కారానికి నోచుకోలేదు..తిరిగి నాల్గో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇల్లూ నిర్మించలేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మించినట్లు తెలిపారు. ప్రజలు కరువుకాటకాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ‘అంతా డిజిటల్ మయం’ అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జన్మభూమి -మాఊరు సభల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచు యోగానంద, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు కమలపాడు వెంకటరెడ్డి, మన్యంప్రకాష్, నారాయణరెడ్డి, మండలనా యకులు శివరామిరెడ్డి, ఉస్మాన్, రాజగో పాల్, కూర్మన్న, మాబుపీరా, సుంకన్న, రామాంజనేయులు , మనోహర్, పీరా, పూజారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ పెత్తనానికి వేదిక
- జన్మభూమి తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడేరు : ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలకు, ఘర్షణలకు వేదిక అయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కూడేరులో బుధవారం ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనపై దుమ్మెత్తి పోశారు. అర్హత ఉన్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు దక్కడం లేదని, అర్హులకు న్యాయం చేద్దామని అధికారులు భావించినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఒత్తిడి తెచ్చి వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయన్నారు. జన్మభూమిలో పింఛన్ అడిగిన వికలాంగులు, రేషన్‌కార్డు అడిగిన పేదలపై దాడులకు దిగడమే అందుకు నిదర్శనమన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతిని«ధులకు లబ్ధి చేకూర్చే విధంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించడం చాలా దారుణమన్నారు. పక్కాగృహాలు అరకొరగా మంజూరు చేసి, అవి కూడా టీడీపీ వారికే దక్కేలా చేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీల నియామకంతో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు, ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని, ఈ కమిటీలతో అర్హులకు తీరని అన్యాయం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. బాబు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని, చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ మహేశ్వరి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
అట్టహాసంగా అంధుల క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : దక్షిణ భారతదేశ అంధుల చదరంగం క్రీడా పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక రెవెన్యూ కమ్యూనిటీ హాలులో చదరంగం క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ క్రీడా పోటీల్లో 6 రాష్ట్రాలకు చెందిన అంధ క్రీడాకారులు పాల్గొన్నారు. రెండవ రోజు 4 రౌండ్లలో పోటీలు జరిగాయి. ఇందులో కేరళకు చెందిన క్రీడాకారులు ముందంజలో నిలిచారు. శశిధర్(కర్ణాటక), నౌషాద్(కేరళ), సుజీత్మున్ని(కేరళ), శైబు(కేరళ) క్రీడాకారులు రెండోరోజు లీడ్ సాధించారు. బుధవారం చదరంగం క్రీడా పోటీలు మిగిలిన 2 రౌండ్లు పూర్తి కాగానే విజేతలను ప్రకటించి బహుమతులను ప్రదానం చేయనున్నారు. ఈ టోర్నీలో మొదటి 25 స్థానాల్లో నిలిచిన వారు నేషనల్ బీ స్థాయికి అర్హత పొందుతారని నిర్వాహకులు తెలిపారు. అలాగే మొదటి 4 స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారు నేషనల్ ఏ స్థాయికి అర్హత సాధిస్తారని అంధుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పామయ్య, జిల్లా అ«ధ్యక్షుడు విజయ్‌భాస్కర్, కార్యదర్శి రవిలు తెలిపారు. జాతీయస్థాయి చదరంగం పోటీలు ఈ నెల 26 నుంచి 30 వరకు కలకత్తాలో జరుగుతాయన్నారు. దివ్యాంగుల ప్రతిభ అమోఘం క్రీడల్లో దివ్యాంగులు చూపుతున్న ప్రతిభ అమోఘమని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అంధుల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పోస్టులను భర్తీ చేయకుండా వారికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. వారి పోస్టులను భర్తీ పై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అనంతరం అంధుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక రెవెన్యూ కమ్యూనిటీ భవనంలో జరుగుతున్న దక్షిణ భారత అంధుల చదరంగం పోటీలను ఆయన పరిశీలించారు. అంధుల కోసం చదరంగం పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంధులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంధులకు క్రీడా పోటీలు రెండవ రోజు జిల్లాకు చెందిన అంధులకు స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించారు. వీటిలో పూర్తి స్థాయి అంధులకు, స్వల్ప స్థాయి అంధత్వం కలిగిన క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్‌పుట్, పరుగు పందెం, డిస్కస్ త్రో, టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలు వీరే పూర్తిస్థాయి అంధులు షాట్‌పుట్ పురుషుల విభాగంలో మారుతి ప్రసాద్, నాగరాజు, విష్ణు ప్రసాద్ మహిళల విభాగంలో లక్ష్మీనారాయణమ్మ, అనంతమ్మ, వరలక్ష్మీ పరుగు పందెం(పురుషులు)లో నజీర్, గంగాధర్, శివ మహిళల పరుగుపందెంలో అనిత, సునీత, షాజాబి డిస్కస్ త్రో (పురుషులు)ఽలో రామాంజినేయులు, రామాంజి, గోపాలకృష్ణ మహిళల్లో ముంతాజ్ బేగం, గంగమ్మ, సునీత పాక్షిక అంధత్వ కలిన వారికి నిర్వహించిన పోటీల్లో .. షాట్‌పుట్ (పురుషులు)లో అబ్దుల్ సలాం, హరిబాబు, అనిల్‌కుమార్ మహిళలల్లో మమత, రాణి, సల్మా పరుగు పందెంలో (పురుషులు) సుధాకర్, విశ్వనాథ్‌నాయుడు, అంకిరెడ్డి మహిళలల్లో మమత, రాణి, శ్వేత డిస్కస్ త్రో (పురుషులు)లో రెహమాన్, అశ్వర్థనారాయణ, బాలనాగయ్య. మహిళలల్లో పావని, నాగమణి, అంజినమ్మ టగ్‌ఆఫ్‌వార్ (పురుషుల విభాగం)లో.. రామాంజినేయులు, సుధాకర్, రెహమాన్, అబ్దుల్ సలామ్, వెంకటరమణ, మారుతీప్రసాద్, జయన్న, సూర్యనారాయణ విన్నర్స్‌గా నిలిచారు. రన్నర్స్‌గా విశ్వనాథ్, జలంధర్‌రెడ్డి, అశ్వర్థ నారాయణస్వామి, నరసింహులు, శ్రీనివాసరావు, బాలనాగయ్య, రామాంజినేయులు, అంకిరెడ్డిలు నిలిచారు. మహిళల విభాగంలో.. పెద్దక్క, సునీత, అనంతమ్మ, మంగమ్మ, సుజాతలు విన్నర్స్‌గా నిలిచారు. రన్నర్స్ఽగా అనిత, లక్ష్మీనారాయణమ్మ, సల్మా, పావని, రాణి నిలిచారు. -
ప్రభుత్వం మీనమేషాలు
వజ్రకరూరు : హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉరవకొండ మండల పరిధిలోని రేణుమాకులపల్లిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామంలోఇంటింటికీ వెళ్లి రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలను కలుసుకొని ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉరవకొండ ప్రాంతంలోని రేణుమాకులపల్లి, చీకలగురికి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆగస్టులో హంద్రీనీవా ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. హంద్రీనీవా ద్వార ఉరవ కొండ ప్రాంతంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనేక రోజులు డిమాండ్ చేస్తున్నా దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. హక్కుగా ఇవ్వాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం రైతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ , బెళుగుప్ప మండలాల్లో హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులు లక్షలాది రూపాయలు వ్యయం చేసి పంటలు సాగుచేశారన్నారు. ప్రస్తుతం పంటలు మధ్యదశలో ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి పైపులు ,మోటార్లు వెంటనే తీసివేయాలని లేని పక్షంలో స్వాదీనం చే సుకుంటామని హెచ్చ రించడం భాదకరమన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రబీ సీజన్లో రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. నగదు రహితలావాదేవీలంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. సమావేశంలో ఉపసర్పంచు పెద్ద ఆంజనేయ, మాజీ సర్పంచు వీరభద్రప్ప, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్రకార్యదర్శి రాకెట్ల అశోక్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న , వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
'అవి జనంలేని చైతన్య యాత్రలు'
కదిరి : 'తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా చేపట్టిన జనచైతన్య యాత్రలకు జనమెవ్వరూ హాజరు కావడం లేదు. వాటిని జనం లేని చైతన్యయాత్రలని పిలిస్తే బాగుంటుంది' అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు అధికారులు ఎందుకు హాజరవుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే..అన్నారు. కదిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూలై 8 నుంచి జరుగుతున్న 'గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలోనూ అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎన్నికలెప్పుడొస్తాయా.. చంద్రబాబును ఎప్పుడు ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియమించిన వ్యవసాయ కమిటీ కూడా తన నివేదికలో ఇదే పేర్కొందని తెలిపారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంతో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు. నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదు కానీ దాని మూలంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు 20 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి.సిద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
అరెస్టులతో ఆపలేరు
- సమçస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? - 80 శాతం ప్రజల్లో సంతృప్తి ఉంటే 30, 144 సెక్షన్లు ఎందుకు - పోలీసులు లేకుండా పాలించగలరా! - రాష్ట్ర ప్రభుత్వంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వ ఫైర్ అనంతపురం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఉరవకొండలో ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో హౌస్ అరెస్టులో ఉన్న ఆయన శనివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఉరవకొండ పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన చేస్తే బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. ఆపై విడుదల చేసినట్లే చేసి ఇంటికి వచ్చాక హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొనుగోలు చేసిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని రెండేళ్లుగా పోరాడుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రజల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. తమ పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతున్నారని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అదే నిజమైతే మరి రాష్ట్రమంతా 30 యాక్టు, 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారని, అంత అసాధారణ పరిస్థితి ఏమొచ్చిందని మండిపడ్డారు. పోలీసులు లేకుండా పరిపాలన సాగించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. తీరు మార్చకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రచార యావ తప్ప.. ప్రజల సమస్యలు పట్టవు ముఖ్యమంత్రికి కేవలం ప్రచార యావ తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యే పోరాటాలు చేస్తుంటే స్పందించకపోగా, అక్రమ కేసులు బనాయిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. పేదల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ సమావేశలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి పాల్గొన్నారు. -
గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేద్దాం
ఉరవకొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఆయన విజయం కోసం సైనికుల్లా పని చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. అందులో ఎమ్మెల్యే వూట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు భృతి ఇస్తావుని చెప్పి, దాన్ని అవులు చేÄýæుకుండా చంద్రబాబు Äýæుువతను మోసగించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు ఉండేదన్నారు. హోదా కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పోరాటాలు కుడా చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు హోదా కోసం కాకుండా ప్యాకేజీ కోసం పాకులాడటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం అయిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి వూట్లాడుతూ గతంలో తాను ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉత్తవు సేవలు అందించానన్నారు. పట్టభద్రులు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే చట్టసభల్లో Äýæుువత కోసం వురింత కష్టపడి పని చేస్తానన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, బసవరాజు, జెడ్పీటీసీ తిప్పÄýæ్యు, జిల్లా సర్పంచ్ల సంఘం వూజీ అధ్యక్షుడు సత్యనారాÄýæుణరెడ్డి, వుండల, పట్టణ కన్వీనర్లు నరసింహులు, తిమ్మప్ప, ఉపసర్పంచ్ జిలకరమోహన్, విద్యావేత్త ఎర్రిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు వడ్డే ఆంజినేÄýæుులు, నిరంజన్‌గౌడ్, తిరుపాల్‌శెట్టి, వార్డు సభ్యులు ఈడిగప్రసాద్, సోమశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
బెళుగుప్ప : రైతు సమస్యలపై ఈ నెల ఆఖరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం ఏమీ పట్టలేదన్నారు. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరందించి ఉంటే ఉరవకొండ నియోజకవర్గం సస్యశ్యామ లం అయి ఉండేదన్నారు. ఈ యేడాది ఆగస్టు 30 నాటికే నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ హామీని నిలుపులేకపోయిందని విమర్శించారు. వేరుశనగ పంటలు ఎండుతుంటే రక్షక తడులంటూ మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతులు ఇంత నష్టపోతున్నా ఇన్పుట్ సబ్సిడీని మిగిల్చామని గొప్పలు చెప్పుకునే విధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాస్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాకెట్ల అశోక్, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నేడు రాగులపాడు లిఫ్ట్ ముట్టడి
ఉరవకొండ: హంద్రీనీవా మొదటి దశ కింద నిర్దేశించిన ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలని డివూండ్ చేస్తూ నేడు హంద్రీనీవా ఆÄýæుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే రాగులపాడు లిఫ్ట్ వుుట్టడికి జిల్లా వ్యాప్తంగా ఆÄýæుకట్టు రైతులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధవువ#తున్నారు. హంద్రీనీవా ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ గతంలో దీక్షలు, ధర్నాలు చేసి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించిన స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వురోసారి సాగునీటి సాధన కోసం ఉద్యవూన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ నిరసన కార్యక్రవుంతో ప్రభుత్వం వజ్రకరూర్ వుండలం ధర్మపురి, చాబాల వద్ద గత రెండు రోజుల నుంచి డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అయితే మొదటి దశ కింద 10 శాతం మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే వరకు ఉద్యవుం కొనసాగిస్తావుని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వానికి ఇది వరకే హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసుల భారీ బందోబస్తు రాగులపాడు లిఫ్ట్ వుుట్టడికి తరలి వస్తున్న రైతులను, వైఎస్సార్ సీపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వుుఖ్య నాÄýæుకులను బైండోవర్, హౌస్ అరెస్ట్ చేÄýæుడానికి సిద్ధమైనట్లు విశ్వసనీÄýæు సవూచారం. -
రాగులపాడు లిఫ్ట్ ముట్టడికి తరలిరండి
విడపనకల్లు/ఉరవకొండ : హంద్రీ నీవా ఆయుకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆయుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో వే లాది మంది రైతులతో కలిసి ఈ నెల 29న వజ్రకరూరు మండలంలోని రాగులపాడు లిప్్టను ముట్టడిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రైతులు, రైతు కూలీలు భారీగా తరలివచ్చి విజÄýæయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపుని చ్చారు. గురువారం మండల పరిధిలోని చీకులగురికి గ్రామం లో హంద్రీ నీవా ఆయుకట్టు సాధన సమితి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నిరసన కార్యక్రవూన్ని విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అంతకుముందు ఆయన చిన్న ముషూ్టరు గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా మన ప్రాంతానికి వస్తున్నా రైతులు ఆ నీళ్లను పొలాలకు మళ్ళించుకోలేని దుస్ధితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందలేదన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. -
ఆ ముగ్గురూ ‘ప్రత్యేక’ ద్రోహులు
– ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీది అలుపెరుగని పోరాటం – ఆగస్టు 2న బంద్‌ను విజయవంతం చేయండి – పార్టీ నేతలు శంకరనారాయణ, విశ్వ, గురునాథరెడ్డి అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్కొన్నారు. ఆ ముగ్గురినీ ‘ప్రత్యేక’ ద్రోహులుగా అభివర్ణించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కన్నారు. ఈ విషయంలో ముందు నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అధోగతి పడుతోందన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో టీడీపీ ఎంపీలు బీజేపీని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరు సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. జిల్లాలోని మేధావులు, యువకులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి పడుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏ విధంగా జనం రోడ్లమీదకొచ్చారో ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఎర్రిస్వామిరెడ్డి, బుర్రా సురేష్‌బాబు, మహమ్మద్ గౌస్, వలిపిరెడ్డి శివారెడ్డి, గోపాల్‌మోహన్, చింతకుంట మధు, మారుతీనాయుడు, బాల నరసింహారెడ్డి, పాలే జయరాం నాయక్, కొర్రపాడు హుస్సేన్ పీరా, వెంకటరామిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ మైనుద్దీన్, శివశంకర్, వాయల శీన, పసులూరి శీన తదితరులు పాల్గొన్నారు. 2న విద్యా సంస్థల బంద్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఆగస్టు 2న చేపట్టిన రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం తెలిపారు. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు. -
పాల్తూరు ఎస్ఐ వీరంగం
టీడీపీ నాయకులు ఎంత చెబితే అంత..! రైతును లాఠీలతో కుళ్లపొడిచిన వైనం ఎస్ఐ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ విడపనకల్లు : పాల్తూరు ఎస్ఐ ఖాన్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ అమాయక రైతులను, వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో పాల్తూరు గ్రామానికి చెందిన రైతు తారాపురం బసవరాజును స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పి లాఠీలతో కుళ్లబొడిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తన సొంత పొలంలోకి పై నుంచి వర్షపు నీరు అధికంగా వస్తూ తన పొలం పాడవుతోందని వర్షపు నీరు బయటికి వెళ్లే విధంగా చిన్న కాలువ (కెనాల్) తవ్వించానని బాధితుడు చెప్పాడు. అధికార పార్టీ నాయకుల మాటలు విని తవ్విన కెనాల్‌ను పూడ్చకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడన్నారు. నా సొంత పొలంలో కెనాల్ తవ్వించుకున్నానని చెప్పినా వినకుండా స్టేషన్‌కు పిలిపించి టీడీపీ నాయకుల ఎదుట బట్టలు ఊడదీయించి లాఠీలతో కుళ్ల పొడిచాడని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు ఎలాంటి తప్పు లేకున్నా అమాయక రైతులపైన, వైఎస్సార్ సీపీ నాయకులపైన ఎస్ఐ ఖాన్ దుర్మార్గంగా దాడి చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ నాయకులు రైతు బసవరాజు, అక్కంగారి ఈశ్వర్,ఫకృద్దీన్,శ్రీనివాస గౌడ్,షన్ముఖ గౌడ్లు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాల్తూరు ఎస్ఐ ఖాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో పని చేస్తున్నారా ...? లేక ప్రజల కోసం పని చేస్తున్నారా...? అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా రైతు బసవరాజును ఎస్ఐ ఖాన్ లాఠీలతో కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయక రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్న ఎస్ఐ ఖాన్ తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. ఎస్ఐ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.