అట్టహాసంగా అంధుల క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : దక్షిణ భారతదేశ అంధుల చదరంగం క్రీడా పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక రెవెన్యూ కమ్యూనిటీ హాలులో చదరంగం క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ క్రీడా పోటీల్లో 6 రాష్ట్రాలకు చెందిన అంధ క్రీడాకారులు పాల్గొన్నారు. రెండవ రోజు 4 రౌండ్లలో పోటీలు జరిగాయి. ఇందులో కేరళకు చెందిన క్రీడాకారులు ముందంజలో నిలిచారు. శశిధర్(కర్ణాటక), నౌషాద్(కేరళ), సుజీత్‌మున్ని(కేరళ), శైబు(కేరళ) క్రీడాకారులు రెండోరోజు లీడ్ సాధించారు. బుధవారం చదరంగం క్రీడా పోటీలు మిగిలిన 2 రౌండ్లు పూర్తి కాగానే విజేతలను ప్రకటించి బహుమతులను ప్రదానం చేయనున్నారు. ఈ టోర్నీలో మొదటి 25 స్థానాల్లో నిలిచిన వారు నేషనల్ బీ స్థాయికి అర్హత పొందుతారని నిర్వాహకులు తెలిపారు. అలాగే మొదటి 4 స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారు నేషనల్ ఏ స్థాయికి అర్హత సాధిస్తారని అంధుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పామయ్య, జిల్లా అ«ధ్యక్షుడు విజయ్‌భాస్కర్, కార్యదర్శి రవిలు తెలిపారు. జాతీయస్థాయి చదరంగం పోటీలు ఈ నెల 26 నుంచి 30 వరకు కలకత్తాలో జరుగుతాయన్నారు.
దివ్యాంగుల ప్రతిభ అమోఘం
క్రీడల్లో దివ్యాంగులు చూపుతున్న ప్రతిభ అమోఘమని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అంధుల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పోస్టులను భర్తీ చేయకుండా వారికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. వారి పోస్టులను భర్తీ పై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అనంతరం అంధుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. అనంతరం స్థానిక రెవెన్యూ కమ్యూనిటీ భవనంలో జరుగుతున్న దక్షిణ భారత అంధుల చదరంగం పోటీలను ఆయన పరిశీలించారు. అంధుల కోసం చదరంగం పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంధులకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంధులకు క్రీడా పోటీలు
రెండవ రోజు జిల్లాకు చెందిన అంధులకు స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించారు. వీటిలో పూర్తి స్థాయి అంధులకు, స్వల్ప స్థాయి అంధత్వం కలిగిన క్రీడాకారులు పాల్గొన్నారు. షాట్‌పుట్, పరుగు పందెం, డిస్కస్ త్రో, టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీలను నిర్వహించారు.
విజేతలు వీరే
పూర్తిస్థాయి అంధులు
షాట్‌పుట్ పురుషుల విభాగంలో మారుతి ప్రసాద్, నాగరాజు, విష్ణు ప్రసాద్
మహిళల విభాగంలో లక్ష్మీనారాయణమ్మ, అనంతమ్మ, వరలక్ష్మీ
పరుగు పందెం(పురుషులు)లో నజీర్, గంగాధర్, శివ
మహిళల పరుగుపందెంలో అనిత, సునీత, షాజాబి
డిస్కస్ త్రో (పురుషులు)ఽలో రామాంజినేయులు, రామాంజి, గోపాలకృష్ణ
మహిళల్లో ముంతాజ్ బేగం, గంగమ్మ, సునీత
పాక్షిక అంధత్వ కలిన వారికి నిర్వహించిన పోటీల్లో ..
షాట్‌పుట్ (పురుషులు)లో అబ్దుల్ సలాం, హరిబాబు, అనిల్‌కుమార్
మహిళలల్లో మమత, రాణి, సల్మా
పరుగు పందెంలో (పురుషులు) సుధాకర్, విశ్వనాథ్‌నాయుడు, అంకిరెడ్డి
మహిళలల్లో మమత, రాణి, శ్వేత
డిస్కస్ త్రో (పురుషులు)లో రెహమాన్, అశ్వర్థనారాయణ, బాలనాగయ్య.
మహిళలల్లో పావని, నాగమణి, అంజినమ్మ
టగ్‌ఆఫ్‌వార్ (పురుషుల విభాగం)లో..
రామాంజినేయులు, సుధాకర్, రెహమాన్, అబ్దుల్ సలామ్, వెంకటరమణ, మారుతీప్రసాద్, జయన్న, సూర్యనారాయణ విన్నర్స్‌గా నిలిచారు.
రన్నర్స్‌గా విశ్వనాథ్, జలంధర్‌రెడ్డి, అశ్వర్థ నారాయణస్వామి, నరసింహులు, శ్రీనివాసరావు, బాలనాగయ్య, రామాంజినేయులు, అంకిరెడ్డిలు నిలిచారు.
మహిళల విభాగంలో..
పెద్దక్క, సునీత, అనంతమ్మ, మంగమ్మ, సుజాతలు విన్నర్స్‌గా నిలిచారు.
రన్నర్స్‌ఽగా అనిత, లక్ష్మీనారాయణమ్మ, సల్మా, పావని, రాణి నిలిచారు.