ఉద్రిక్తతగా మారిన ధర్నా
వజ్రకరూరు (ఉరవకొండ) : పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, బీమా మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారం ఉద్రిక్తతగా మారింది. వజ్రకరూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జయేంద్రరెడ్డి అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తనయుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, పార్టీ రాష్ట్ర నేతలు, వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అనంతరం ప్రణయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమన్నారు. సీఎం చంద్రబాబుకు ప్రజాశ్రేయస్సు పట్టడం లేదన్నారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుంతోందన్నారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రతి పనినీ అడ్డుకుంటున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అనంతరం తహసీల్దార్ వెంటనే భయటకురావాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అక్కడికి ఎంపీడీఓ జాషువా చేరుకోగా ఉపాధి బిల్లులపై నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో ఎస్‌ఐ జనార్ధన్ నాయుడు, సిబ్బందితో వచ్చి సర్దిచెప్పారు. ఇంటి పట్టాల విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్య క్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి వీరన్న, వైఎస్సార్‌సీపీౖ రెతువిభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మన్యం ప్రకాష్, వైఎస్సార్‌సీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయేం ద్రరెడ్డి, ఉస్మాన్, వైస్ ఎంపీపీ నారాయణప్ప, సర్పంచులు మన్యం హేమలత, రఘు, యోగా నంద, హనుమంతరాయుడు, సల్లా రమాదేవి, లక్ష్మీబాయి, వెంకటరత్నమ్మ, పాళ్యంలా వణ్య, ఎంపీటీసీ సభ్యులు రామాంజనేయులు, ఎస్తేరమ్మ, వెంకటేష్‌నాయక్, హంపీబాయి, మండల కోఆప్షన్ç సభ్యుడు పీర్‌బాషా, డైరెక్టర్ భరత్‌రెడ్డి, మహిళా కన్వీనర్ భూమా కమ లారెడ్డి, పార్టీనాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.