పోరాటాలే స్ఫూర్తిగా.. | today ysrcp pleanery in kuderu | Sakshi
Sakshi News home page

పోరాటాలే స్ఫూర్తిగా..

Published Thu, Jun 1 2017 11:14 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

today ysrcp pleanery in kuderu

- నేడు కూడేరులో ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ
ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టాలల్సిన పోరాటాలే ప్రధాన లక్ష్యంగా కూడేరులో శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ప్లీనరీ జరగనుంది. పోరాటాల యోధుడుగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఈ మూడేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి సాగించిన పోరాటాలు అధికారపార్టీ ‍ప్రజా ప్రతినిధులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విశ్వేశ్వరరెడ్డి సాగించిన పోరాటాలు.. ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపాయి. అదే స్ఫూర్తితో శుక్రవారం చేపట్టని ప్లీనరీలోనూ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారు.  
- ఉరవకొండ

మూడేళ్లలో విశ్వ చేపట్టిన ఉద్యమాలు
- హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీటి సాధన కోసం అఖిలపక్షాన్ని కలుపుకుని 2015 మార్చిలో భారీ రైతు సదస్సు
- ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని 2015 జూన్‌ 20న 34 గంటల దీక్ష
- హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ 2015 జూలైలో 24 గంటల పాటు జలజాగరణ ఉద్యమం
- 2015 ఏఫ్రిల్‌ 12న ఉరవకొండలో పేదలకు ఇంటి పట్టాలకు 25 గంటల దీక్ష
- 2015 జూలై 29న ఉరవకొండ పట్టణ సమస్యలతో పాటు స్వచ్చమైన తాగునీటి సరఫరా, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుపై వేలాది మందితో మహాధర్నా
- 2016 ఫిబ్రవరి 20న పొట్టిపాడు వద్ద హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని జలజాగరణ
- హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో 2016 ఆగస్టు 29న రాగులపాడు లిప్ట్‌ ముట్టడి  
- కూడేరులోని తాగునీటి పథకాన్ని ప్రారంభించాలంటూ గత నెల 13న వేలాది మందితో ముట్టడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement