vajrakarur
-
Vajrakarur: వజ్రాల వేట ప్రారంభం
వజ్రకరూరు మండల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ప్రారంభమయ్యింది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్నూల్, కడప, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి శనివారం వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాలు వెతకడం ప్రారంభించారు. పలువురు కార్లలో వచ్చి వజ్రాలు వెతకడం కనిపించింది. చంటి బిడ్డలనుసైతం ఎత్తుకుని వచ్చి వజ్రాలు వెతకడం విశేషం. దీంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. ఇక్కడ లభించే చిన్న వజ్రమైనా రూ. లక్షల్లో విలువ చేస్తుంది. ఏటా ఈ ప్రాంతంలో 20 నుంచి 40 దాకా వజ్రాలు లభ్యమవుతాయని సమాచారం. -
వజ్రాల కోసం వెతుకులాట
సాక్షి, వజ్రకరూరు: కరువుసీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రకరూరు మండలంలోని పొలాల్లో వజ్రాల అన్వేషణ కొనసాగుతోంది. తొలకరి పలకరించడంతో పరిసర ప్రాంతాల వారే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పొలాలను తూర్పారబడుతున్నారు. ఏ చిన్న రంగురాయి దొరికినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ ప్రాంతమంతా ఇసుకతో కూడిన ఎర్రనేలలు కావడంతో జూన్ మాసంలో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే భూమిలోపల ఉన్న వజ్రాలు పైకి వస్తాయని, పొలంలో నీరు పారినప్పుడు అవన్నీ ఏటవాలుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అందువల్లే ఇక్కడికి వచ్చే వారంతా పొలాల్లో అణువణువూ వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో ఏటా 10 నుంచి 20 దాకా వజ్రాలు దొరుకుతాయనీ, ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్‌తో సమానంగా ధర పలుకుతాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు వర్షం కురవగా... స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఉదయాన్నే పొలాలకు వెళ్లి వజ్రాలకోసం వేట కొనసాగిస్తున్నారు. ఏటా ఇక్కడ లభించే వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా కొందరు దళారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తారనీ, గత ఏడాది కూడా రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. -
వజ్రాల వేట ప్రారంభం
సాక్షి, వజ్రకరూరు : మండల కేంద్రం వజ్రకరూరు పరిసర పొలాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది. ఏటా జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటి. ఆదివారం సాయంత్రం భారీ గాలులతోపాటు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రెండురోజులుగా వజ్రాల కోసం అన్వేషకుల తాకిడి పెరిగిపోతోంది. పురుషులు, మహిళలు, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెదకడంలో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్ వజ్రంతో సమానంగా ఉంటాయని అంటుంటారు. దేవుడు కరుణిస్తే తమ తలరాతలు మారిపోతాయేమోనని ప్రజలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరైతే భోజనాలను కూడా అక్కడికే తెచ్చుకుంటున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు వజ్రాలకోసం వెతకడం జరుగుతూనే ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు వచ్చినప్పుడు ఒడ్డు ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తాయనే భావనతో ప్రజలు వెదుకుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నాయి. -
మద్యం మత్తులో కన్న కూతురునే చంపిన తండ్రి
-
వజ్రాల వేట !
వజ్రకరూరు: మండల కేంద్రం సమీపంలోని చాలా పొలాల్లో వజ్రాన్వేషణ కొనసాగుతోంది. తెల్లారింది మొదలు సాయంత్రం పొద్దు పోయే వరకు వజ్రాల కోసం ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఇక్కడకు చేరుకొని అన్వేషిస్తున్నారు. భోజనం, వాటర్ బాటిళ్లతో ఇక్కడకు చేరుకొని చాలమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
తలరాత మెరిసేనా!
– వజ్రకరూరులో వజ్రాల కోసం ప్రజల అన్వేషణ – వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న ప్రజలు వజ్రకరూరు (ఉరవకొండ): ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు వజ్రాలకు ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతంలో వజ్రాలను వెతకడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వజ్రాలు లభించే అవకాశం ఉందని కర్నూలు, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు రూ.50 లక్షలు విలువ చేసే వజ్రం దొరకిందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇతర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఒక వజ్రం దొరికితే చాలు తమ జీవితాలు మారుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరుకు వజ్రకరూరు పొలాల్లో అన్వేషిస్తున్నారు. -
అక్రమాలు నిజమే!
– వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో నాసిరకంగా పనులు – ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు – ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ల సరెండర్ – డ్వామాలో రిపోర్ట్ చేసుకోవాలని పీడీ ఉత్తర్వులు – సమగ్ర విచారణకు క్వాలిటీ కంట్రోల్ టీం ఏర్పాటు సాక్షి ఎఫెక్ట్ అనంతపురం టౌన్ : వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో అక్రమాలు నిజమేనని అధికారులు తేల్చారు. పనులు నాసిరకంగా చేపట్టడం, అవసరం లేని పనులు చేసి బిల్లులు చేసుకోవడం, బినామీ పేర్లతో బిల్లులు దిగమింగిన వైనాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో అధికారులను డ్వామా కార్యాలయానికి సరెండర్ చేసుకున్నారు. వాటర్‌షెడ్ పరిధిలోని వజ్రకరూరు, రాగులపాడు, తట్రకల్లు, ఎన్‌ఎన్‌పీ తండా, బోడిసానిపల్లి, గంజికుంట గ్రామాల్లో 2009–10 బ్యాచ్ కింద చేపట్టిన పనుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు కలిసి అక్రమాల వరద పారించారు. ఈ అవినీతి బాగోతంపై ఈ నెల 11న ‘వాటాల పంట’, 12వ తేదీన ‘చెక్ ఢాం’, 13న ‘కుంట నక్కలు’, 14వ తేదీన ‘వజ్ర వంకర్లు’ శీర్షికతో ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. వీటిపై కలెక్టర్ జి.వీరపాండియన్ సీరియస్ అయ్యారు. తక్షణం విచారణకు ఆదేశించడంతో మొదటి రోజే వాటర్‌షెడ్ అదనపు పీడీ విజయ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాసిరకం నిర్మాణాలున్నాయని, అవసరం లేని చోట నిర్మాణాలు చేశారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా నివేదికను డ్వామా పీడీ నాగభూషణంకు అందజేశారు. ఇదే సమయంలో ‘సాక్షి’లో కథనాల పరంపర కొనసాగడంతో వాటర్‌షెడ్ పరిధిలో జరిగిన పనులన్నింటినీ పరిశీలించాలన్న నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని నియమించారు. ఇందులో వాటర్‌షెడ్ అదనపు పీడీ విజయ్‌కుమార్, డీబీఓ చంద్రశేఖర్, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి రవీంద్రనాథ్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోవర్దన్ ఉన్నారు. తక్షణ చర్యల్లో భాగంగా ప్రాథమికంగా అందిన ఆధారాల మేరకు ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్న సూర్యనారాయణతో పాటు పనులు జరిగే సమయంలో జూనియర్ ఇంజినీర్‌గా ఉన్న సంజీవ్‌కుమార్ (ప్రస్తుతం కణేకల్లు డబ్ల్యూసీసీలో పని చేస్తున్నారు)ను ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డ్వామాలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. శింగనమల డబ్ల్యూసీసీ పీఓగా ఉన్న ఆర్.రాజాకు ఉరవకొండ డబ్ల్యూసీసీ బాధ్యతలు అప్పగించారు. ఇక కణేకల్లులో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సుధాకర్‌కు కణేకల్లు డబ్ల్యూసీసీ ఇన్చార్జ్ జూనియర్ ఇంజనీర్‌గా బాధ్యతలు అప్పగించారు. క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పీఓ ప్రభావం లేకుండా ఉండేందుకు సరెండర్ చేసుకున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం ‘సాక్షి’కి తెలిపారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలుంటాయన్నారు. కొల్లగొట్టిన నిధులను తప్పకుండా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. -
కుంటనక్కలు!
వజ్రకరూరులో వాటర్‌షెడ్‌లో అవినీతి బాగోతం – చాలా చోట్ల ఫారంపాండ్స్ లేకుండానే బిల్లులు స్వాహా – ఏడాదిన్నర వ్యవధిలో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు – పెద్ద పెద్ద గుంతలను ఫారంపాండ్స్గా చూపిన పరిస్థితి – రూ.కోటికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు – పనులు ప్రారంభించడం.. విలేయడం కరువును చూసి మీరు పారిపోకూడదు. మిమ్మల్ని చూసి కరువే పారిపోవాలి. ప్రభుత్వం తరపున నీటి సంరక్షణ చర్యలు చేపట్టాం. వాటి ద్వారా వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలు పెంపొందించుకోవాలి. సేద్యపు కుంటలతో సిరుల పంట పండాలి. – రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలివి.. అధికారులను చూసి మీరు భయపడకూడదు. మమ్మల్ని చూస్తే వాళ్లకే వణుకు పుడుతుంది. ప్రభుత్వం తరపున చేపట్టే పనులన్నీ మేమే చేస్తాం. అవి ఉన్నా..లేకున్నా బిల్లులు మాత్రం చేయండి. ఆ తర్వాత మేం చూసుకుంటాం. – ఇదీ తెలుగుదేశం పార్టీ నేతల తీరు.. అనంతపురం టౌన్/వజ్రకరూరు : భూగర్భ జలాలు వృద్ధి చెందాలంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడమే ప్రత్యామ్నాయం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సేద్యపు కుంటల(ఫారంపాండ్స్) తవ్వకానికి చర్యలు చేపట్టింది. వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో చేపట్టిన సేద్యపు కుంటల పనులు తెలుగుదేశం పార్టీ నేతలకు సిరుల పంట పండించాయి. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయడం.. పని ప్రారంభించి సగంలోనే నిలిపేసి నిధులు బొక్కేసిన వైనం వెలుగు చూస్తోంది. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఫారంపాండ్స్కు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. పోనీ సేద్యపు కుంటలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. అందినకాడికి దోచుకోవడమే పరమావధిగా అధికారులతో కలిసి అక్రమాలకు తెరతీశారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ.కోటికి పైగా ఖర్చు 2009–10లో మొదటి బ్యాచ్ కింద వజ్రకరూరు వాటర్‌షెడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి గత ఏడాది ప్రాజెక్ట్ కాల పరిమితి ముగిసే నాటికి 243 సేద్యపు కుంటలు తవ్వించి రూ.103.55 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. ఇందులో ఉపాధి హామీ నిధులు రూ.101.76 లక్షలు, వాటర్‌షెడ్ నిధులు రూ.1.80 లక్షలు వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 2015 ఏప్రిల్ నుంచి (2016 సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్ ముగిసింది) ఏకంగా 232 ఫారంపాండ్స్ నిర్మించి రూ.101.83 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. రాగులపాడులో 113 ఫారంపాండ్స్కి రూ.104.67 లక్షలకు పరిపాలన అనుమతి రాగా.. 113 పనులు చేసి రూ.50.33 లక్షలు ఖర్చు చేశారు. వజ్రకరూరు అవినీతి బాగోతం ప్రాంతం ఫారంపాండ్స్ అనుమతి వ్యయం(రూ.లక్షల్లో) నిర్మాణం వ్యయం(రూ.లక్షల్లో) తట్రకల్లు 35 32.66 35 17.86 లక్షలు వజ్రకరూరు 42 32.42 41 13.83 బోడిసానిపల్లి 6 5.04 6 1.68 గంజికుంట 47 48.11 47 19.82 ఎన్‌ఎన్‌పీ తండా 1 రూ.3వేలు అన్నీ అవినీతి ‘లెక్కలే’.. సేద్యపు కుంటల నిర్మాణానికి వెచ్చించిన నిధుల తీరు ఒక్కసారి పరిశీలిస్తే అవినీతి ‘లెక్క’ ఇట్టే అర్థమవుతుంది. వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ కింద మొత్తం 242 ఫారంపాండ్స్కు గాను రూ.222.35 లక్షలకు, ఐడబ్ల్యూఎంపీ కింద రెండు ఫారంపాడ్స్కు రూ.76 వేలతో పరిపాలన అనుమతి వచ్చింది. మంజూరైన (242) పనులన్నీ ప్రారంభించిన అధికారులు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. కానీ చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల అసలు సేద్యపు కుంటల ఆనవాళ్లే కనుమరుగయ్యాయి. విచిత్రంగా చిన్నపాటి గుంతలను తవ్వి వాటినే ఫారంపాండ్స్గా చూపి బిల్లు చేసుకున్నారు. అధికార పార్టీ నేతల అండతో డ్వామా అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారనే విషయం స్పష్టమవుతోంది. నిబంధనల మేరకు ఈ పనులన్నీ కూలీలతో చేయించాలి. కానీ ఇక్కడ యంత్రాలతో తూతూ మంత్రంగా చేపట్టి నిధులు బొక్కేశారు. పెద్ద పెద్ద గుంతలను ఫారంపాండ్స్గా చూపారు. కొన్ని ఫారంపాండ్స్ ఇప్పటికే పూడిపోయాయి. తట్రకల్లు సమీపంలోని వంకలో నిబంధనలకు విరుద్ధంగా ఫారంపాండ్ పనులు చేపట్టారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆ భూములను సాగు చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ తవ్విన ఫారంపాండ్లను పూడ్చివేశారు. తట్రకల్లులో ఓబన్న, బోయ ఆంజనేయస్వామి, శ్రీనివాసులు పొలాల వద్ద నిర్మించిన సేద్యపు కుంటలు ప్రస్తుతం పూడిపోయాయి. ఇలా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
వజ్రకరూరులో సినీనటుడు నాగినీడు
వజ్రకరూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం సినీనటుడు నాగినీడు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని కొనకొండ్ల, చాబాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు వజ్రకరూర్ మోడల్ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం నాగినీడు సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. మర్యాద రామన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత పలువురు నా వద్దకు వచ్చి మీ వాయిస్ బాగుందని చెప్పారన్నారు. అప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురికీ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా నాగినీడుతో ఫొటోలు దిగేందుకు పలువురు విద్యార్థులు ఉత్సాహం చూపారు. ఆయన వెంట జేవీవీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌యాదవ్, ఆర్డీటీ సీఓ నాగప్ప, తదితరులు ఉన్నారు. -
వజ్ర సంకల్పం
అనంతపురం జిల్లా వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట సాగుతోంది. ఏటా జూన్ మాసంలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే ఇక్కడ వజ్రాన్వేషణ మొదలవుతుంది. అందులో భాగంగా ఇటీవల కురిసిన వర్షాలతో మండల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వాసులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. రోజూ ఉదయాన్నే పొలాలకు చేరుకుని సాయంత్రం వరకు ప్రతి రాయినీ పట్టిపట్టి చూస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా వజ్రాల వేటలో పడ్డారు. ఇటీవల లక్ష రూపాయల విలువైన వజ్రం లభించినట్లు తెలిసింది. - వజ్రకరూరు -
వజ్రాల వేటకు పోదాం చలో చలో..
వజ్రకరూరు పరిసరపొలాల్లో గుంపులుగా వెతుకులాట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెతుకుతున్న జనం పోటాపోటీగా పాల్గొంటున్న మహిళలు భోజన క్యారియర్లతో వెళ్లి గాలింపు ఇటీవల వజ్రకరూరులో భారీ వర్షం వజ్రకరూరు: మండల కేంద్రం వజ్రకరూరు పరిసర ప్రాంతంలో వజ్రాల కోసం వేట కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించడం జరుగుతుంటుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడ వర్షాలు ప్రారంభం కావడంతో కొద్దిరోజుల క్రితం వజ్రాల కోసం వెతుకులాట మొదలైంది. మండల వాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం వజ్రకరూరులో భారీ వర్షం కురిసింది. దీంతో చుట్టు పక్కల పొలాల్లో వర్షపు నీరు ప్రవహించింది. ఈ క్రమంలోనే వందలమంది పొలాల వద్దకు చేరుకొని వజ్రాల వేటను వేగవంతం చేశారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేకమంది గుంపులు, గుంపులుగా ఏర్పడి వజ్రాల కోసం వెతుకున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే పొలాలకు చేరుకుని సాయంత్రం వరకు వజ్రాలను వెతుకున్నారు. పురుషులతోపాటు మహిళలు కూడ ఈ పనిలో పడ్డారు. కొద్దిరోజుల క్రితం లక్ష రూపాయలు విలువచేసే రెండు వజ్రాలు లభించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో లభించే వజ్రాలు కోహినూర్ వజ్రంతో సమానమని చెబుతుంటారు. పైగా ఇక్కడ లభించే వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వర్షాలు ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాలకు చెందిన అనేకమంది వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలు తీరుతాయని అనేకమంది ఎంతో ఆశతో ఇక్కడకు వస్తుండటం విశేషం. భోజనాలు తీసుకొని వెళ్లి మరీ వజ్రాలకు వెతికేందుకు వెళుతున్నారు. -
వజ్రాల కోసం వేట
వజ్రకరూరు : మండల కేంద్రం వజ్రకరూరు పరిసర ప్రాంతంలో వజ్రాల కోసం వేట ప్రారంభమైంది. మంగళవారం రాత్రి వజ్రకరూరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ప్రతి ఏటా జూన్‌లో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఐదు నుంచి పది దాకా వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం. -
ఉద్రిక్తతగా మారిన ధర్నా
వజ్రకరూరు (ఉరవకొండ) : పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, బీమా మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారం ఉద్రిక్తతగా మారింది. వజ్రకరూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జయేంద్రరెడ్డి అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తనయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, పార్టీ రాష్ట్ర నేతలు, వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ప్రణయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమన్నారు. సీఎం చంద్రబాబుకు ప్రజాశ్రేయస్సు పట్టడం లేదన్నారు. జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుంతోందన్నారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రతి పనినీ అడ్డుకుంటున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అనంతరం తహసీల్దార్ వెంటనే భయటకురావాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అక్కడికి ఎంపీడీఓ జాషువా చేరుకోగా ఉపాధి బిల్లులపై నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో ఎస్ఐ జనార్ధన్ నాయుడు, సిబ్బందితో వచ్చి సర్దిచెప్పారు. ఇంటి పట్టాల విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్య క్రమంలో వైఎస్సార్సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి వీరన్న, వైఎస్సార్సీపీౖ రెతువిభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మన్యం ప్రకాష్, వైఎస్సార్సీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయేం ద్రరెడ్డి, ఉస్మాన్, వైస్ ఎంపీపీ నారాయణప్ప, సర్పంచులు మన్యం హేమలత, రఘు, యోగా నంద, హనుమంతరాయుడు, సల్లా రమాదేవి, లక్ష్మీబాయి, వెంకటరత్నమ్మ, పాళ్యంలా వణ్య, ఎంపీటీసీ సభ్యులు రామాంజనేయులు, ఎస్తేరమ్మ, వెంకటేష్‌నాయక్, హంపీబాయి, మండల కోఆప్షన్ç సభ్యుడు పీర్‌బాషా, డైరెక్టర్ భరత్‌రెడ్డి, మహిళా కన్వీనర్ భూమా కమ లారెడ్డి, పార్టీనాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
దొంగ అనుమానాస్పద మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా వజ్రకరూర్ వద్ద ఓ దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసులో రెండు రోజుల క్రితం వల్లేష్ అనే వ్యక్తిని వజ్రకరూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం వల్లేష్ పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఇవాళ ఉదయం అనూహ్యంగా పోలీస్‌స్టేషన్ వద్ద చెట్టుకు వేలాడుతూ వల్లేష్ మృతదేహం కనిపించింది. వల్లేష్ మృతికి కారణం ఏంటి? అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. -
మహిళ మృతదేహం లభ్యం
వజ్రకరూరు: మండల పరిధిలోని చాయాపురం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహాన్ని వజ్రకరూరు పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. వజ్రకరూరు ఎస్ఐ జనార్ద¯ŒS నాయుడు తెలిపిన వివరాల మేరకు..పెంచలపాడు గ్రామానికి చెందిన సరస్వతి (26), ఆమె భర్త నాగభూషణంలు కొనకొండ్ల సమీపంలో పొలాన్ని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నారు. మిరప పంటకు శుక్రవారం నీరు పెడుతుండగా డీజిల్ ఇంజ¯ŒS ఆగిపోయింది. సరస్వతి ఇంజి¯ŒSలోకి డీజిల్ పోస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువలోకి కాలుజారి పడిపోయింది. మృతదేహాన్ని శనివారం రాత్రి చాయాపురం వద్ద గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫ్రిజ్ పేలి రూ.లక్షల నష్టం
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన జి.గాదిలింగప్ప అనే రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిజ్ పేలింది. ప్రమాదంలో రూ.9 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిల్లింది. ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలింది. దీంతో పక్కనే ఉన్న బీరువాలకు మంటలు వ్యాపించి రూ.2 లక్షల నగదు, మరోలక్ష విలువ గల పట్టుచీరలు, 10 తులాల బంగారం కాలిపోయింది. పొలాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాపుస్తకాలు, స్థలాలకు సంబంధించిన దస్త్రాలు, నిత్యావసర సరుకులు కూడా కాలిపోయినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే ఇంటిపైకప్పు కూడా దెబ్బతినింది. గుంతకల్లు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. స్థానిక ఉపసర్పంచు గురు, ఆర్ఐ సావిత్రి, వీఆర్వో మారెన్న తదితరులు అక్కడకు చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మళ్లీ చిరుత కలకలం
చిరుత దాడిలో దూడ మృతి దేవాలయ గుర్రంపైనా దాడిచేసి గాయపరచిన వైనం వజ్రకరూరు : గూళ్యపాళ్యంలో చిరుత సంచారం మళ్లీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కేశప్పకు చెందిన దూడను చిరుత చంపేసింది. శనివారం రాత్రి కూడా లాలుస్వామి దేవాలయానికి చెందిన గుర్రంపై చిరుత దాడిచేసి గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఏ సమయంలో చిరుత గ్రామంలోకి ప్రవేశిస్తుందోనన్న ఆందోళన నెలకొంది. పది రోజుల క్రితం కూడా చిరుత గ్రామ సమీపంలో ఉన్న కొండపై కూర్చుని అటు ఇటు తిరిగిన దృశ్యాలను గుర్తించారు. ఇప్పుడు మరోసారి దూడను చంపడం, గుర్రంపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలు అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీఎఫ్ఓ చంద్రశేఖర్, గుత్తి ఫారెస్టు రేంజర్ డేవిడ్ తదితరులకు చిరుత సంచారం గురించి వివరించారు. గ్రామస్తులకు భరోసా కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సూచనలతో అసిస్టెంట్ ఫారెస్టు బీట్ అధికారి నాగ్యనాయక్, వెటర్నరీ అసిస్టెంట్ భద్రు నాయక్, వైల్డ్ ఫీల్డ్ వాచర్ రాజశేఖర్ నాయక్ గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. -
వజ్రకరూర్‌లో చిరుత సంచారం
-
వజ్రకరూర్‌లో చిరుత సంచారం
అనంతపురం: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గుల్యపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా గ్రామంలో చిరుత సంచరిస్తోండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ అంశాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న ఓ వ్యక్తికి చిరుత కనిపించింది. దీంతో అతడు భయంతో పరుగు తీశాడు. చిరుత సంచారంపై స్థానికులు మరోసారి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
వజ్రం లభ్యం ?
వజ్రకరూరు: వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మూడు రోజుల క్రితం విలువైన వజ్రం లభించినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వజ్రకరూరుతో పాటు గుంతకల్లు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలాల్లో వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గుంతకల్లు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి సుమారు రూ. 20లక్షలు విలువ చేసే వజ్రం లభించినట్లు సమాచారం. -
డెంగ్యూతో నవ వధువు మృతి
వజ్రకరూర్ (అనంతపురం) : డెంగ్యూతో చికిత్స పొందుతూ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చినప్యాపిలి గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చినప్యాపిలి గ్రామానికి చెందిన సుజాత(19)కు పెద ప్యాపిలి గ్రామానికి చెందిన తిప్పయ్యతో మూడు నెలల కిందట వివాహమైంది. అయితే గత వారం రోజులుగా సుజాత అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగ్యూ సోకిందని తెలపడంతో.. ఆమెను హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. -
'సేంద్రీయ ఎరువులే మేలు'
వజ్రకరూర్ (అనంతపురం) : రసాయన ఎరువులను వాడకుండా కేవలం సేంద్రీయ ఎరువుల వాడకంతో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జేడీ శ్రీరాంమ్మూర్తి అన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గొల్యపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో మాట్లాడారు. రసాయన ఎరువులు వాడకుండా.. వేరుశెనగ పంటను సాగు చేస్తున్న గాయత్రిదేవి అనే మహిళను ఆయన ప్రశంసించారు.