
వజ్రకరూరు మండల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ప్రారంభమయ్యింది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్నూల్, కడప, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి శనివారం వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాలు వెతకడం ప్రారంభించారు.
పలువురు కార్లలో వచ్చి వజ్రాలు వెతకడం కనిపించింది. చంటి బిడ్డలనుసైతం ఎత్తుకుని వచ్చి వజ్రాలు వెతకడం విశేషం. దీంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. ఇక్కడ లభించే చిన్న వజ్రమైనా రూ. లక్షల్లో విలువ చేస్తుంది. ఏటా ఈ ప్రాంతంలో 20 నుంచి 40 దాకా వజ్రాలు లభ్యమవుతాయని సమాచారం.