
కర్నూలు: తొలకరి చినుకులు పడగానే కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి మండలాల్లో వజ్రాల వేట మొదలవుతోంది. దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ వజ్రాలు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రైతులు తమ పొలాలు సాగు చేసేటప్పుడు కూడా వజ్రాలు లభ్యమవుతుంటాయి. శనివారం మద్దికెర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా రూ.5లక్షలు విలువైన వజ్రం దొరికింది. అలాగే మదనంతపురం గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.15 లక్షలు విలువైన వజ్రం లభించింది. ఈ రెండు వజ్రాలను పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment