Andhra Pradesh, Farmer Strikes Rs 1.20 Cr Daimond His Farming Land - Sakshi
Sakshi News home page

Kurnool: అదృష్టం అంటే ఈ రైతుదే... ఏకంగా రూ. 1.20 కోట్ల...

May 28 2021 4:21 AM | Updated on May 28 2021 2:50 PM

తుగ్గలి: అదృష్టం వజ్రం రూపంలో ఓ పేద రైతు ఇంటి తలుపుతట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామంలో గురువారం ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. వేరు శనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుగురాయి కంటపడింది. అది వజ్రం అని తెలియడంతో వజ్రాల వ్యాపారులు అతని ఇంటికి వెళ్లారు.

అక్కడ పోటీలో 25 క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.1.20 కోట్లకు రైతు నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏడేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ.37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న, పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతుంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement